ప్రపంచంలో అత్యంత ధనిక క్రికెట్‌ లీగ్‌లు ఇవే.. ఐపీఎల్‌ తర్వాత అదే! | Top 10 Richest Cricket Leagues In The World In 2025: IPL Leads List | Sakshi
Sakshi News home page

ప్రపంచంలో అత్యంత ధనిక క్రికెట్‌ లీగ్‌లు ఇవే.. ఐపీఎల్‌ తర్వాత అదే!

Jun 26 2025 2:14 PM | Updated on Jun 26 2025 3:07 PM

Top 10 Richest Cricket Leagues In The World In 2025: IPL Leads List

ఐపీఎల్‌-2025 విజేత ఆర్సీబీ (PC: BCCI)

క్రికెట్‌లో ప్రస్తుతం టీ20 ఫార్మాట్‌ హవా నడుస్తోంది. పొట్టి క్రికెట్‌ను చూసేందుకు నవతరం యువత ఎక్కువగా ఆసక్తి చూపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో టీ20 లీగ్‌లు పుట్టుకొచ్చాయి. వీటి ద్వారా ఆటగాళ్లు రెండు చేతులా సంపాదించుకుండగా.. ఆయా బోర్డులపై కూడా కనక వర్షం కురుస్తోంది.

స్పాన్సర్‌షిప్‌లు. టీవీ ప్రసార హక్కులు, టికెట్ల విక్రయం తదితర మార్గాల ద్వారా బోర్డులు ఆదాయం సమకూర్చుకుంటున్నాయి. ప్రస్తుతం ఈ లీగ్‌లే ప్రపంచ క్రికెట్‌ మార్కెట్‌ను ఏలుతున్నాయి. మరి 2025 నాటికి పేరెన్నికగన్న ధనిక పొట్టి లీగ్‌లలో టాప్‌-10లో ఉన్న లీగ్‌లు ఏవో తెలుసా?!

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (IPL)
సందేహమే అక్కర్లేదు.. అవును.. ప్రపంచ టీ20 మార్కెట్లో ఐపీఎల్‌దే అగ్రస్థానం. 2008లో భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) దీనిని మొదలుపెట్టింది. ప్రపంచవ్యాప్తంగా మేటి జట్ల ఆటగాళ్లంతా ఈ లీగ్‌లో భాగమవుతూ.. కోట్లాది రూపాయాలు ఆర్జిస్తున్నారు.

ఎంతో మంది యువ క్రికెటర్లు కూడా వెలుగులోకి వచ్చి జాతీయ జట్లకు ప్రాతినిథ్యం వహించే అవకాశాలు దక్కించుకుంటున్నారు. ఇక అత్యంత ఆదరణ పొందిన లీగ్‌గా పేరున్న ఐపీఎల్‌ కేవలం బ్రాడ్‌కాస్ట్‌ డీల్స్‌ ద్వారానే 6.2 బిలియన్‌ డాలర్లు సంపాదించినట్లు జాతీయ మీడియా వెల్లడించింది. ప్రస్తుతం ఐపీఎల్‌ విలువ- 11 బిలియన్‌ డాలర్ల (భారత కరెన్సీలో దాదాపుగా 94, 220.5 కోట్ల రూపాయలు) వరకు ఉంటుందని అంచనా.

రెండో స్థానంలో ఐఎల్‌టీ20 (ILt20)
నెట్‌వర్త్‌పరంగా ఐపీఎల్‌ తర్వాతి స్థానం యూఏఈ వేదికగా సాగే ఇంటర్నేషనల్‌ లీగ్‌టీ20ది. మధ్య ప్రాచ్చ దేశాల పెట్టుబడి, ఐపీఎల్‌ ఫ్రాంఛైజీల ఆధ్వర్యంలో నడుస్తున్న ఐఎల్‌టీ20 విలువ 15 మిలియన్‌ డాలర్లు (సుమారుగా రూ. 128.64 కోట్లు) అని తెలుస్తోంది. పన్ను లేని కాంట్రాక్టులు మేటి క్రికెటర్లను కూడా ఐఎల్‌టీ20 వైపు ఆకర్షిస్తున్నాయి.

సౌతాఫ్రికా టీ20 లీగ్‌ (SAT20)
2023లో మొదలైన సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో జట్లన్నీ ఐపీఎల్‌ ఫ్రాంఛైజీలవే. హైదరాబాద్‌ (సన్‌రైజర్స్‌ ఈస్టర్న్‌కేప్‌), లక్నో (డర్బన్‌ సూపర్‌ జెయింట్స్‌), రాజస్తాన్‌ (పర్ల్‌ రాయల్స్‌), ఢిల్లీ (ప్రిటోరియా క్యాపిటల్స్‌), చెన్నై (జొబర్గ్‌ సూపర్‌ కింగ్స్‌), ముంబై (ఎంఐ కేప్‌టౌన్‌)ఐపీఎల్‌ ఫ్రాంఛైజీలు ఇందులో పెట్టుబడులు పెట్టాయి. ఈ లీగ్‌ విలువ 12 మిలియన్‌ డాలర్లు (దాదాపుగా రూ. 102.79 కోట్లు) అని అంచనా.

బిగ్‌బాష్‌ లీగ్‌ (BBL)
ఆస్ట్రేలియాకు చెందిన ఈ టీ20 లీగ్‌ నికర విలువ పది మిలియన్ల డాలర్ల (దాదాపు రూ. 85. 65 కోట్లు)వరకు ఉంటుందని తెలుస్తోంది.

ది హండ్రెడ్‌
ఇంగ్లండ్‌ వేదికగా సాగే 100 బాల్‌ టోర్నీ ‘ది హండ్రెడ్‌ లీగ్‌’ వాల్యూ తొమ్మిది మిలియన్‌ డాలర్లు (సుమారు రూ. 77.08 కోట్లు) అని అంచనా.

మేజర్‌ లీగ్‌ క్రికెట్‌ (MLC)
అమెరికాకు చెందిన ఈ పొట్టి లీగ్‌ విలువ 6.9 మిలియన్‌  డాలర్లు (దాదాపు రూ. 59.09 కోట్లు) అని సమాచారం.

పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ (PSL)
పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ నెట్‌వర్త్‌ 5.7 మిలియన్‌ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు 48.82 కోట్లు) అని అంచనా.

బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌ (BPL)
బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌ వాల్యూ 4.8 మిలియన్‌ డాలర్లు (సుమారు 41.11 కోట్ల రూపాయలు) అని తెలుస్తోంది.

కరేబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (CPL)
ఈ వెస్టిండీస్‌ టీ20 లీగ్‌లోనూ ఐపీఎల్‌ ఫ్రాంఛైజీల పెట్టుబడులు ఉన్నాయి. దీని నెట్‌వర్త్‌ 4.6 మిలియన్‌ డాలర్లు (సుమారు 39.40 కోట్లు) అని అంచనా.

లంక ప్రీమియర్‌ లీగ్‌ (LPL)
శ్రీలంకకు చెందిన ఈ పొటి​ ఫార్మాట్‌ లీగ్‌ వాల్యూ 3.98 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ. 34.09 కోట్లు) అని తెలుస్తోంది.

చదవండి: రింకూ సింగ్‌కు ప్రభుత్వ ఉద్యోగం.. పోస్ట్‌ ఏమిటంటే?!

Advertisement
 
Advertisement
Advertisement