ఐపీఎల్‌తో మరోసారి పోటీపడనున్న పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ | PSL 2027 season to run from March 18 to May 2 | Sakshi
Sakshi News home page

ఐపీఎల్‌తో మరోసారి పోటీపడనున్న పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌

Oct 8 2026 8:18 PM | Updated on Oct 8 2026 8:20 PM

PSL 2027 season to run from March 18 to May 2

source: X

పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ మరోసారి ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌తో పోటీపడనుంది. ఐపీఎల్‌ జరిగే సమయంలోనే మరోసారి పీఎస్‌ఎల్‌ను ప్లాన్‌ చేశారు పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు అధికారులు. గతేడాది కూడా ఇలాంటి పరిస్థితే ఏర్పడింది. దీంతో కొంతమంది విదేశీ ఆటగాళ్లు పీఎస్‌ఎల్‌ ఒప్పందాల నుంచి తప్పుకుని ఐపీఎల్‌లో చేరారు.

ఈ చేదు అనుభవం చవిచూశాక కూడా పీఎస్‌ఎల్‌ ఐపీఎల్‌తో ఢీకొట్టేందుకు ప్రణాళిక సిద్దం చేసింది. పీఎస్‌ఎల్‌ 2027 సీజన్‌కు సంబంధించిన తేదీలను లీగ్‌ నిర్వహకులు ఇవాళ ప్రకటించారు. ఈ టోర్నీలో వచ్చే ఏడాది మార్చి 18 నుంచి మే 2 వరకు జరుగనుంది.

మరోవైపు ఐపీఎల్‌ 2027 సీజన్‌కు సంబంధించి తేదీలు ఖరారు కానప్పటికీ.. ఇంచుమించు పీఎస్ఎ‌ల్‌ జరిగే సమయంలోనే ఐపీఎల్‌ కూడా జరుగుతుంది. ప్రస్తుతమున్న సమాచారం​ ప్రకారం ఐపీఎల్‌ 2027 మార్చి మధ్యలో మొదలవుతుంది.

ఐపీఎల్‌, పీఎస్‌ఎల్‌ మరోసారి క్లాష్‌ కానున్న నేపథ్యంలో మరోసారి విదేశీ ఆటగాళ్ల కోసం రెండు లీగ్‌ల మధ్య పోటీ తప్పకపోవచ్చు. గత సీజన్‌లో క్వెట్టా గ్లాడియేటర్స్‌కు డైరెక్ట్ సైనింగ్‌గా ఎంపికైన స్పెన్సర్ జాన్సన్.. వ్యక్తిగత కారణాలు సాకుగా చూపి పీఎస్‌ఎల్‌ నుంచి వైదొలిగి చెన్నై సూపర్ కింగ్స్‌లో చేరాడు.

శ్రీలంక ఆటగాడు దసున్‌ షనక లాహోర్ ఖలందర్స్ డీల్‌ను కాదనుకొని రాజస్తాన్ రాయల్స్‌లో చేరాడు. బ్లెస్సింగ్ ముజారబాని ఇస్లామాబాద్ యునైటెడ్‌తో ఒప్పందం రద్దు చేసుకొని  కోల్‌కతా నైట్ రైడర్స్‌లో చేరాడు. దీంతో ముజారబానిపై PSL రెండేళ్ల నిషేధం విధించింది.

ఇదీ చదవండి: సుందర్‌కు రూ. 75 లక్షల చెక్కును అందజేసిన తమిళనాడు సీఎం విజయ్‌

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement