
ఐపీఎల్‌లో అత్యధిక పారితోషికం అందుకున్న వ్యాఖ్యాతల వివరాలు ఇలా ఉన్నాయి. ఈ జాబితాలో భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ మొట్టమొదటి స్థానంలో ఉన్నాడు. 2024 ఐపీఎల్ సీజన్ లెక్కల ప్రకారం.. గవాస్కర్ ఓ సీజన్‌లో ఇంగ్లీష్ కామెంట్రీ చేసినందుకు గానూ రూ. 4.5 కోట్లు తీసుకుంటాడు. అంటే ఓ మ్యాచ్‌కు అతని రెమ్యూనరేషన్ రూ. 6 నుంచి 10 లక్షల మధ్యలో ఉంటుంది. వ్యాఖ్యాతలు కామెంట్రీతో పాటు మ్యాచ్ ప్రిడిక్షన్స్, స్టోరీస్ కూడా చేయాల్సి ఉంటుంది. వీటన్నిటికీ కలిపి వారి పారితోషికం ఉంటుంది.
గవాస్కర్‌తో సమానంగా ఐపీఎల్‌లో పారితోషికం అందుకునే వ్యాఖ్యాతలుగా మాథ్యూ హేడెన్, కెవిన్ పీటర్సన్, ఇయాన్ బిషప్ ఉన్నారు. వీరంతా ఇంగ్లీష్ కామెంట్రీకి తలో రూ. 4.17 కోట్లు అందుకుంటారు. వీరి తర్వాత ఇంగ్లీష్ కామెంట్రీకి హర్షా భోగ్లే రూ. 4.1 కోట్లు, రవిశాస్త్రి రూ. 4 కోట్లు అందుకుంటారు.
హిందీ కామెంట్రీకి అత్యధిక పారితోషికం అందుకునే వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా. అతనికి సీజన్‌కు రూ. 2.92 కోట్లు లభిస్తుంది. ఆకాశ్ చోప్రా తర్వాత సంజయ్ మంజ్రేకర్ అత్యధికంగా రూ. 2.8 కోట్లు అందుకుంటాడు. ఆతర్వాత సురేశ్ రైనా రూ. 2.5 కోట్లు, హర్భజన్ సింగ్ రూ. 1.5 కోట్లు రెమ్యూనరేషన్‌గా తీసుకుంటారు.
సీనియర్ వ్యాఖ్యాతల పారితోషికాలు ఇలా ఉంటే, జూనియర్లకు మ్యాచ్‌ల లెక్కన పేమెంట్ ఇస్తారు. ఇంగ్లీష్, హిందీతో పాటు అన్ని స్థానిక భాషల్లో వ్యాఖ్యానం చేసే వారికి ఒకే లెక్కన మ్యాచ్‌కు రూ. 35 వేలు ఇస్తారు.
ఇటీవలికాలంలో క్రికెట్‌లో కామెంట్రీకి ప్రాధాన్యత చాలా పెరిగింది. వ్యాఖ్యాతలకు కూడా సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందంటే, వారి క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో అర్దం చేసుకోవచ్చు. ప్రస్తుతం భారతీయ వ్యాఖ్యాతలు సునీల్ గవాస్కర్, రవిశాస్త్రి, హర్షా భోగ్లేకు ప్రపంచ వ్యాప్తంగా పిచ్చ క్రేజ్ ఉంది. ఔటైనప్పుడు కానీ సిక్సర్లు కొట్టినప్పుడు వీరి వ్యాఖ్యానం పతాక స్థాయిలో ఉంటుంది.