
ఆర్సీబీ టీమ్ ఐపీఎల్ టైటిల్ గెలవడంతో ఫ్యాన్స్ ఓ రేంజ్‌లో సెలబ్రేట్ చేసుకున్నారు. అర్ధరాత్రి రోడ్లపైకి వచ్చి వరల్డ్ కప్ గెలిచినంత సంబురాలు చేసుకున్నారు. ముఖ్యంగా కోహ్లీ అభిమానుల సంబురాలు మిన్నంటాయి. 18 ఏళ్ల తర్వాత ఆర్సీబీ కప్ గెలవడంతో సినీ ప్రముఖులు సైతం అభినందనలు చెబుతున్నారు. టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ ట్విటర్ వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నారు. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఏకంగా డ్యాన్స్ చేస్తూ బెంగళూరు విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు.
అయితే ఆర్సీబీ విజయంపై ప్రముఖ ఓటీటీ సంస్థ చేసిన వీడియో నెట్టింట వైరలవుతోంది. జియో హాట్‌స్టార్ తెలుగు తన ట్విటర్ వేదికగా బెంగళూరు విజయంపై ఓ వీడియోను రిలీజ్ చేసింది. ఇందులో ఆర్సీబీ విజయాన్ని.. పవన్ కల్యాణ్ నటించిన అత్తారింటికి దారేదీ క్లైమాక్స్ సీన్‌తో పోల్చింది. రైల్వేస్టేషన్‌లో పవన్ కల్యాణ్ తన అత్తను చూసి భావోద్వేగానికి గురయ్యే వీడియోను పంచుకుంది. ఇది చూసిన అభిమానులు ఆర్సీబీ టీమ్ క్రేజ్ వేరే లెవెల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరేమో ఇదెక్కడి సింక్‌రా మావ అంటూ ఫన్నీ పోస్టులు పెడుతున్నారు.
This part of my life, this little part, is called happiness. 🥹😭🏆#EeSaalaCupNamde #RCBvsPBKS #IPLFinal #Victory #JioHotstarTelugu pic.twitter.com/4k3rBcgLQ6
— JioHotstar Telugu (@JioHotstarTel_) June 3, 2025