బెంగళూరు విజయం.. కోహ్లీ సతీమణి అనుష్క శర్మ సెలబ్రేషన్స్ చూశారా? | Anushka Sharma Celebration After RCB Maiden IPL Win, Watch Video Went Viral On Social Media | Sakshi
Sakshi News home page

Anushka Sharma: బెంగళూరు విజయం.. అనుష్క శర్మ సెలబ్రేషన్స్ చూశారా?

Jun 4 2025 11:36 AM | Updated on Jun 4 2025 12:46 PM

Anushka Sharma celebration after RCB maiden IPL win

ఆర్సీబీ ఐపీఎల్ టైటిల్ గెలవడంతో సంబురాలు మిన్నంటాయి. కర్ణాటకతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ కోహ్లీ ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. దాదాపు 18 ఏళ్ల తర్వాత విజయం సాధించడంతో కోహ్లీ సతీమణి అనుష్క శర్మ ఆనందం పట్టలేకపోయింది. ఒక్కసారిగా మైదానంలోకి పరుగెత్తుకుంటూ వచ్చింది. అనంతరం కోహ్లీని కౌగిలించుకుని ఎమోషనలైంది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. అనుష్క శర్మ వెంటనే పరుగెత్తుకుంటూ వచ్చి కోహ్లీని హత్తుకుని ఓదార్చింది.

(ఇది చదవండి: ఆర్సీబీ విజయం.. అత్తారింటికి దారేది సీన్‌తో లింక్‌!)

అనుష్క గురించి కోహ్లీ మాట్లాడుతూ.. "అనుష్క నాకు అన్ని కష్టాల్లోనూ అండగా నిలిచింది. వందశాతం ఆర్సీబీకి మద్దతుగా ప్రతి మ్యాచ్‌కు వస్తోంది.  ఈ విజయం అనుష్క శర్మ గర్వంగా భావిస్తుందని కోహ్లీ అన్నారు. తను నాతో అన్ని ఒడిదుడుకులను ఎదుర్కొంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా అండగా నిలిచింది. ఆమెకు బెంగళూరుతో చాలా అనుబంధం కలిగి ఉంది. ఎందుకంటే తను కూడా బెంగళూరు అమ్మాయి. అందుకే ఈ గెలుపు ఆమెకు కూడా చాలా ప్రత్యేకమైనది. ఈ విజయంతో తను చాలా గర్వంగా ఉంది.' అని అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement