ఎస్‌ఆర్‌హెచ్‌ కీలక ప్రకటన.. కోచ్‌గా 'ఊహించ‌ని ప్లేయ‌ర్‌' | Varun Aaron joins Sunrisers Hyderabad as bowling coach for IPL 2026 | Sakshi
Sakshi News home page

IPL 2026: ఎస్‌ఆర్‌హెచ్‌ కీలక ప్రకటన.. కోచ్‌గా 'ఊహించ‌ని ప్లేయ‌ర్‌'

Jul 14 2025 5:25 PM | Updated on Jul 14 2025 6:41 PM

Varun Aaron joins Sunrisers Hyderabad as bowling coach for IPL 2026

స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్(SRH) ఫ్రాంచైజీ కీల‌క నిర్ణయం తీసుకుంది. త‌మ జ‌ట్టు బౌలింగ్ కోచ్ టీమిండియా మాజీ ఫాస్ట్ బౌల‌ర్ వ‌రుణ్ ఆరోన్‌(Varun Aaron)ను ఎస్ఆర్‌హెచ్ మెనెజ్‌మెంట్ నియ‌మించింది. ఈ విష‌యాన్ని సోషల్ మీడియా వేదిక‌గా ఎస్ఆర్‌హెచ్ వెల్ల‌డించింది. గ‌త సీజ‌న్‌లో ఆరెంజ్ ఆర్మీ బౌలింగ్ కోచ్‌గా ప‌నిచేసిన కివీస్ మాజీ ఆల్‌రౌండ‌ర్ జేమ్స్ ఫ్రాంక్లిన్ స్ధానాన్ని భ‌ర్తీ చేయ‌నున్నాడు.

ఆరోన్‌కు అంత‌ర్జాతీయ క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌లో ఆడిన అనుభ‌వం ఉంది. జార్ఖండ్‌కు చెందిన వ‌రున్ ఆరోన్  9 టెస్టులు, 9 వ‌న్డేల్లో భార‌త జ‌ట్టుకు ప్రాతినిథ్యం వ‌హించాడు. మొత్తంగా 29 అంత‌ర్జాతీయ వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఇక ఐపీఎల్‌లో గుజ‌రాత్ టైటాన్స్‌, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ డేర్‌డెవిల్స్ (ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్), రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ జ‌ట్లు త‌ర‌పున ఆడాడు.

త‌న ఐపీఎల్ కెరీర్‌లో 44 వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఓవ‌రాల్‌గా 95 టీ20ల్లో 93 వికెట్ల‌ను త‌న ఖాతాలో వేసుకున్నాడు. ఆరోన్ చివ‌ర‌గా విజ‌య్ హాజారే ట్రోఫీ 2024-25 సీజ‌న్‌లో జార్ఖండ్ త‌రపున ఆడాడు. ఆ త‌ర్వాత అన్ని ఫార్మాట్ల‌కు క్రికెట్‌కు వీడ్కోలు ప‌లికిన ఈ స్పీడ్ స్టార్‌.. కామెంటేట‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. గత సీజన్‌లో సన్‌రైజర్స్ తమ స్దాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయింది. 14 మ్యాచ్‌లు ఆడి కేవ‌లం ఆరింట మాత్ర‌మే విజ‌యం సాధించింది.
చదవండి: IND vs ENG: జోఫ్రా ఆర్చ‌ర్ సూప‌ర్ డెలివ‌రీ.. రిష‌బ్ పంత్‌కు మైండ్ బ్లాంక్‌! వీడియో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement