
లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా ఓటమి అంచున నిలిచింది. 193 పరుగుల లక్ష్యంతో బరిలోకి భారత జట్టు 82 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆఖరి రోజు ఆటలో ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ నిప్పులు చెరుగుతున్నాడు.
అతడి బౌలింగ్ ధాటికి భారత బ్యాటర్లు బెంబేలెత్తుతున్నారు. ఐదో రోజు ఆట ఆరంభంలో భారత వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్‌ను అద్బుత బంతితో ఆర్చర్ బోల్తా కొట్టించాడు. ఆర్చర్ వేసిన డెలివరీకి పంత్ దగ్గర సమాధానమే లేకపోయింది. భారత ఇన్నింగ్స్ 21 ఓవర్ వేసిన ఆర్చర్ బౌలింగ్‌లో మూడో బంతికి పంత్ అద్బుతమైన బౌండరీ బాదాడు.
ఆ తర్వాత ఐదో బంతికి పంత్‌ను క్లీన్ బౌల్డ్ చేసి ఈ ఇంగ్లండ్ పేసర్ ప్రతీకారం తీర్చుకున్నాడు. ఆర్చర్ ఆ ఐదో బంతిని రౌండ్‌ది వికెట్ నుంచి హాఫ్ స్టంప్ దిశగా హార్డ్ లెంగ్త్ డెలివరీగా పంత్ సంధించాడు. ఆ బంతిని పంత్ డిఫెన్స్ ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ పంత్ తన బ్యాట్‌ను కిందకు తీసుకొచ్చేలోపే బంతి స్టంప్స్‌ను గిరాటేసింది.
దీంతో పంత్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. వెంటనే పంత్‌కు వద్దకి వెళ్లి స్లెడ్జ్ చేశాడు. అతడి వైపు చూస్తూ సీరియస్‌గా ఏదో అంటూ సెండాఫ్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.
అనంతరం వాషింగ్టన్ సుందర్‌ను కూడా సంచలన రిటర్న్ క్యాచ్‌తో ఆర్చర్ పెవిలియన్‌కు పంపాడు. టీమిండియా విజయానికి ఇంకా 93 పరుగులు కావాలి. క్రీజులో రవీంద్ర జడేజా(14), నితీశ్ కుమార్ రెడ్డి(5) ఉన్నారు.
Split screen angles just hit different with Jofra 😍👌 pic.twitter.com/9kf7r2QmUk
— England Cricket (@englandcricket) July 14, 2025
చదవండి: IND vs ENG 3rd Test Day 5: తొలి సెషన్ కీలకం.. ఆరు వికెట్లు తీసి..: ఇంగ్లండ్ కోచ్