రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) జట్టు 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఈ సీజన్‌లో విజేతగా నిలిచింది. ఇన్నేళ్లలో ఈ జట్టులో కోహ్లి తప్ప అందరు మారారు. ఎంతో మంది కొత్త ఆటగాళ్లు వచ్చారు. ఇప్పుడేమో కొత్త యాజమాన్యం రాబోతోంది. ఎందుకంటే ఈ చాంపియన్ ఫ్రాంచైజీని తాజాగా అమ్మకానికి పెట్టారు. అన్నట్లు ఆర్‌సీబీ అంటే ఒక జట్టే కాదు... భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నిర్వహిస్తున్న ఐపీఎల్, మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టోర్నీల్లో ఆర్‌సీబీ జట్లు పోటీపడుతున్నాయి.
గతేడాది మహిళల ఆర్‌సీబీ జట్టు కూడా డబ్ల్యూపీఎల్ విజేతగా నిలిచింది. కొన్ని రోజులుగా అమ్మకంపై ఊహగానాలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ విషయాన్ని ఫ్రాంచైజీ యాజమాన్యం డియాజియో కంపెనీ అధికారికంగా వెల్లడించింది. ఈ మేరకు బాంబే స్టాక్ ఎక్సే్చంజ్‌కు సైతం సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. తమ ఫ్రాంచైజీలో పెట్టుబడిదారుల కోసం అన్వేషిస్తున్నట్లు చెప్పింది. కొత్త యజమానులను ఆహా్వనిస్తున్నట్లు తెలిపింది. ఈ ఆరి్థక సంవత్సం ముగిసే నాటికి... అంటే వచ్చే మార్చి 31 తేదీకల్లా విక్రయ ప్రక్రియ పూర్తిచేయనుంది.


