
ఐపీఎల్-2026కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీలో కీలక మార్పు చోటు చేసుకోనున్నట్లు తెలుస్తోంది. కెప్టెన్ అక్షర్ పటేల్‌పై వేటు వేసేందుకు ఢిల్లీ క్యాపిటల్స్ సిద్దమైనట్లు సమాచారం. న్యూస్ 24 నివేదిక ప్రకారం.. అక్షర్ స్ధానంలో స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌కు తమ జట్టు పగ్గాలను అప్పగించాలని క్యాపిటల్స్ యాజమాన్యం భావిస్తుందంట.
వచ్చే ఏడాది సీజన్‌లో అక్షర్ కేవలం ఆటగాడిగా మాత్రమే కొనసాగనున్నాడని సదరు రిపోర్ట్ పేర్కొంది. అయితే ఇప్పటివరకు ఢిల్లీ ఫ్రాంచైజీ నుంచి మాత్రం ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. ఐపీఎల్-2026కు ముందు ఆయా ఫ్రాంచైజీలకు సంబంధించి అనేక వార్తలు వస్తున్నాయి.
అందులో ఇది ఒకటి. కాగా రిషబ్ పంత్ లక్నో సూపర్ జెయింట్స్‌కు వెళ్లడంతో ఐపీఎల్-2025లో ఢిల్లీ కెప్టెన్‌గా అక్షర్ పటేల్ ఎంపికయ్యాడు. అందరూ కేఎల్ రాహుల్ డీసీ కెప్టెన్ అవుతాడని భావించినప్పటికి అనూహ్యంగా అక్షర్‌కు తమ జట్టు పగ్గాలను ఢిల్లీ అప్పగించింది.
అయితే రాహుల్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టేందుకు మొగ్గు చూపకపోవడంతోనే అక్షర్‌ను సారథిగా నియమించినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఈసారి మాత్రం కెప్టెన్‌గా జట్టును నడిపించేందుకు రాహుల్ ఆసక్తిగా ఉన్నట్లు ఐపీఎల్ వర్గాలు వెల్లడించాయి. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానున్నట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి.
కాగా ఈ ఏడాది సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ప్లే ఆఫ్స్‌కు ఆర్హత సాధించలేకపోయింది. 14 మ్యాచ్‌లలో ఐదింట విజయంతో 5వ స్దానంతో ఢిల్లీ సరిపెట్టుకుంది. రాహుల్ కెప్టెన్‌గా అపారమైన అనుభవం ఉంది. మూడు సీజన్ల పాటు లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్‌గా రాహుల్ వ్యవహరించాడు