
టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తాజాగా ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అశ్విన్.. ఇప్పుడు ఐపీఎల్ నుంచి కూడా తప్పుకొని అందరికి షాకిచ్చాడు. ఐపీఎల్-2025 ఎడిషన్‌లో సూపర్ కింగ్స్ (CSK) తరపున చివరిసారిగా ఆడిన అశ్విన్, ఇకపై విదేశీ లీగ్‌లలో ఆడేందుకు సిద్దంగా ఉన్నట్లు వెల్లడించాడు.
వచ్చే ఏడాది ఇంగ్లండ్‌కు చెందిన ది హాండ్రడ్ లీగ్‌లో అశూ భాగమయ్యే అవకాశముంది. ఇక ఐపీఎల్ నుంచి రిటైర్ కావాలనే తన ఆకస్మిక నిర్ణయానికి గల కారణాన్ని అశ్విన్ తాజాగా వెల్లడించాడు. దాదాపు మూడు నెలల పాటు కంటిన్యూగా క్రికెట్ ఆడేందుకు తను సిద్దంగా లేనందున ఐపీఎల్ నుంచి తప్పుకొన్నట్లు తెలిపాడు. అదేవిధంగా 44 ఏళ్ల వయస్సులోనూ ఐపీఎల్‌లో ఆడుతున్న ధోనిను అశ్విన్ ప్రశంసించాడు.
"వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్‌లో ఆడాలని తొలుత నిర్ణయించుకున్నాను. కానీ మూడు నెలల పాటు క్రికెట్ అంటే కొంచెం కష్టంగా అన్పించింది. అందుకు నా శరీరం సహకరించదని అనుకుంటున్నాను. ఐపీఎల్ నుంచి తప్పుకోవడానికి ఇదే ప్రధాన కారణం.
ధోని మాత్రం నిజంగా గ్రేట్. అతడి ఫిట్‌నెస్ చూసి నేను ఎప్పుడూ ఆశ్యర్యపోతుంటాను. వయస్సు పెరుగుతున్న కొద్ది ఐపీఎల్ వంటి టీ20 లీగ్‌లో ఆడడం అంత సులువు కాదు. దాదాపు మూడు నెలల పాటు అందుకు కేటాయించాల్సి వుంటుంది.
దేశ వ్యాప్తంగా ప్రయాణం చేస్తూ మ్యాచ్‌లు ఆడాలి. ఒక మ్యాచ్ తర్వాత మరొక మ్యాచ్‌కు సిద్దంగా ఉండాలి. కొన్ని సార్లు ఒకట్రెండు రోజుల వ్యవధిలోనే మ్యాచ్ ఆడాల్సి వస్తుంది. అందుకు మన శరీరం సహకరించాలి అని తన యూట్యూబ్ ఛానల్‌లలో అశ్విన్ పేర్కొన్నాడు.
అశ్విన్ తన కెరీర్‌లో మొత్తంగా 221 ఐపీఎల్ మ్యాచ్‌లలో 187 వికెట్లు పడగొట్టాడు. అంతేకాకుండా బ్యాటింగ్‌లో కూడా 833 పరుగులు సాధించాడు. 38 ఏళ్ల అశ్విన్ ఐపీఎల్‌లో ఐదు జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. సీఎస్‌కే, రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్తాన్ రాయల్స్ తరపున ఆడాడు.
చదవండి: Danish Malewar: డబుల్ సెంచరీతో చెలరేగిన యువ సంచలనం.. తొలి ప్లేయర్‌గా రికార్డు