
దులీప్ ట్రోఫీ-2025 తొలి క్వార్టర్ ఫైనల్‌లో భాగంగా బెంగళూరు వేదికగా నార్త్ ఈస్ట్ జోన్, సెంట్రల్ జోన్ తలపడతున్నాయి. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో సెంట్రల్ జోన్ ఆటగాడు డానిష్ మలేవర్ (Danish Malewar) అద్భుతమైన డబుల్ సెంచరీతో చెలరేగాడు.
వన్డే తరహాలో తన బ్యాటింగ్‌ను కొనసాగించిన మలేవర్ కేవలం 222 బంతుల్లోనే తన ఫస్ట్ క్లాస్ డబుల్ సెంచరీని సాధించాడు. 21 ఏళ్ల మలేవర్ 222 బంతుల్లో 36 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 203 పరుగులు చేసి ఔటయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో సెంట్రల్ జోన్ జట్టు భారీ స్కోర్‌గా దూసుకుపోతుంది.
72 ఓవర్లు ముగిసే సరికి సెంట్రల్ జోన్ మూడు వికెట్ల నష్టానికి 443 పరుగులు చేసింది. అంతకుముందు కెప్టెన్ రజిత్ పాటిదార్ సైతం సూపర్ సెంచరీతో మెరిశాడు. పాటిదార్ కేవలం 96 బంతుల్లో 21 ఫోర్లు, 3 సిక్స్‌లతో 125 పరుగులు చేసి ఔటయ్యాడు.
తొలి విదర్భ ప్లేయర్‌గా..
ఇక ఈ మ్యాచ్‌లో ద్విశతకం సాధించిన మలేవర్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. దులీప్ ట్రోఫీ అరంగేట్రంలోనే డబుల్ సెంచరీ చేసిన తొలి విదర్భ బ్యాటర్‌గా డానిష్ మాలేవర్ చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో నెటిజన్లు ఎవరీ మలేవర్ అని తెగ వెతికేస్తున్నారు.
ఎవరీ మాలేవర్..?
21 ఏళ్ల మాలేవర్ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో విదర్భకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. రంజీ ట్రోఫీ-2024లో ముంబై జరిగిన సెమీఫైనల్‌తో మాలేవర్ వెలుగు లోకి వచ్చాడు. ఆ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో 79 పరుగులు చేసిన మాలేవర్.. రెండో ఇన్నింగ్స్‌లో పరుగులు నమోదు చేశాడు. విదర్భ జట్టు ఫైనల్‌కు చేరడంలో డానిష్ కీలక పాత్ర పోషించాడు.
అనంతరం కేరళతో జరిగిన ఫైనల్లో మలేవర్ ఆసాధరణ ప్రదర్శన కనబరిచాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 153, రెండవ ఇన్నింగ్స్‌లో 73 పరుగులు చేసిన డానిష్.. విదర్భకు మరో రంజీ ట్రోఫీ టైటిల్‌ను అందించాడు. తన తొలి ఫస్ట్‌క్లాస్ సీజన్‌లోనే మలేవర్ తొమ్మిది మ్యాచ్‌లలో కలిపి 783 పరుగులు సాధించాడు.
ఇందులో రెండు సెంచరీలు, ఆరు ఆర్ధ శతకాలు ఉన్నాయి. మాలేవర్ తన అద్భుత ప్రదర్శనలతో భారత టెస్టు జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఆశ్చర్యపోనక్కర్లేదు. మలేవర్‌కు రైట్ ఆర్మ్ బౌలింగ్ చేసే సత్తా కూడా ఉంది.
చదవండి: హనుమా విహరి ఎంట్రీ..! ఆ జట్టుకు వీడ్కోలు పలికిన కెప్టెన్?