
కేకేఆర్ జెర్సీలో మన్‌దీప్ సింగ్
దేశవాళీ సీజన్ 2025-26కు ముందు టీమిండియా ఆటగాడు, వెటరన్ డొమాస్టిక్ క్రికెటర్ మన్‌దీప్ సింగ్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. త్రిపుర క్రికెట్ అసోయేషిన్‌తో 33 ఏళ్ల మన్‌దీప్ సింగ్ తెగదింపులు చేసుకున్నాడు. ఆంధ్ర స్టార్ ప్లేయర్ హనుమా విహరి త్రిపుర జట్టుకు ఆడనున్నట్లు ప్రకటించిన కొద్ది రోజుల్లోనే మన్‌దీప్ ఈ నిర్ణయం తీసుకోవడం ఆశ్చర్యపరుస్తోంది.
మన్‌దీప్ సింగ్ గత సీజన్‌లో పంజాబ్ నుంచి తన మకాంను త్రిపురకు మార్చాడు. ఈ క్రమంలో అతడు రంజీ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీ, సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో త్రిపుర జట్టుకు నాయకత్వం వహించాడు. మొత్తంగా 19 మ్యాచ్‌లలో త్రిపుర జట్టు కెప్టెన్‌గా ఈ పంజాబ్ క్రికెటర్ వ్యవహరించాడు. మన్‌దీప్ త్రిపుర జట్టు తరపున అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు.
రంజీ ట్రోఫీ 2024-25లో ఒక సెంచరీ, ఐదు హాఫ్ సెంచరీలు మన్‌దీప్ సింగ్ చేశాడు. అదేవిధంగా విజయ్ హజారే ట్రోఫీలో మూడు హాఫ్ సెంచరీలు, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో రెండు హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు.
దేశవాళీ సీజన్ 2024-25లో ఆడటానికి అవకాశం ఇచ్చినందుకు త్రిపుర క్రికెట్ అసోయేషిన్‌కి ధన్యవాదాలు. త్రిపురకు ఆడిన సమయాన్ని నేను నిజంగా ఆస్వాదించాను. నాకు అక్కడ ఎన్నో అద్భుతమైన జ్ఞాపకాలు ఉన్నాయి. రాబోయే సీజన్‌లో జట్టు విజయం సాధించాలని కోరుకుంటున్నాను.
నా తదుపరి అధ్యాయం కోసం ఎదురు చూస్తున్నాను మన్‌దీప్ ఓ ప్రకటనలో పేర్కొన్నాడు. కాగా రాబోయో సీజన్‌లో త్రిపురకు విహరితో పాటు తమిళనాడు ఆల్‌రౌండర్ విజయ్ శంకర్ కూడా ప్రాతినిథ్యం వహించాడు. ఈ విషయాన్ని శంకర్ ఇప్పటికే ధ్రువీకరించాడు. అన్ని ఫార్మాట్లలో త్రిపుర జట్టు కెప్టెన్‌గా హనుమ విహారి ఎంపికయ్యే అవకాశముంది.
చదవండి: Asia Cup 2025: భారత్-పాక్ మ్యాచ్.. టిక్కెట్ ధర ఎన్ని లక్షలంటే?