
క్రికెట్ మైదానంలో భారత్-పాకిస్తాన్ మధ్య యుద్దానికి సమయం అసన్నమవుతోంది. ఆసియాకప్-2025లో భాగంగా దుబాయ్ వేదికగా సెప్టెంబర్ 14న చిరకాల ప్రత్యర్థులు అమీతుమీ తెల్చుకోన్నారు. ఈ దాయుదుల పోరు కోసం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
ఈ హై వోల్టేజ్ మ్యాచ్‌ను చాలా మంది ఫ్యాన్స్ నేరుగా స్టేడియంకు వెళ్లి వీక్షించేందుకు ఆసక్తిచూపుతున్నారు. దీంతో భారత్-పాక్ మ్యాచ్ క్రేజుని బ్లాక్ మార్కెట్లు సొమ్ముచేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. బ్లాక్ మార్కెట్‌లో ఒక్కో టిక్కెట్ ధర ఏకంగా రూ.15.75 లక్షలు పలికినట్లు తెలుస్తోంది.
అయితే ఈ మ్యాచ్‌కు సంబంధించిన టిక్కెట్ల అమ్మకాలను ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఇంకా ప్రారంభించలేదు. ఒకట్రెండు రోజుల్లో టిక్కెట్ల విక్రయాలను ప్రారంభించే అవకాశముంది. కానీ కొన్ని థర్డ్ పార్టీ వెబ్‌సైట్‌లు మాత్రం కచ్చితంగా టిక్కెట్లు ఇస్తామని అభిమానుల నుంచి భారీ మొత్తాన్ని వసులు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే విషయంపై ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు సైతం స్పందించింది.
ఆసియాకప్ టిక్కెట్లను ఇంకా రిలీజ్ చేయలేదు. రెండు రోజుల్లో టిక్కెట్ల అమ్మకం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అభిమానులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే టిక్కెట్లు కొనుగోలు చేయాలి. అనాధికరిక వెబ్‌సైట్లలో టికెట్లను కొని మోసపోవద్దు అని ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఓ ప్రకటనలో పేర్కొంది.
🎟️ ATTENTION FANS 🎟️
An important update regarding tickets for the DP World Asia Cup 2025.
#ACC pic.twitter.com/CYe4k0fRFi— AsianCricketCouncil (@ACCMedia1) August 19, 2025
ఈ ఆసియాకప్‌లో భారత్-పాక్ జట్లు మూడు సార్లు తలపడే అవకాశముంది. లీగ్ స్టేజితో పాటు సూపర్-4లోనూ దాయాదులు ముఖాముఖి తలపడే ఛాన్స్ ఉంది. ఈ రెండు జట్లే ఫైనల్ చేరితే సెప్టెంబర్ 28న మరోసారి ముచ్చటగా మూడో సారి భారత్, పాక్ మ్యాచ్ జరగుతోంది.
మరోవైపు పెహల్గమ్ ఉగ్రదాడి తర్వాత భారత్-పాక్ మధ్య పరిస్థితులు మరింత ఉద్రిక్తమయ్యాయి. దీంతో ఆసియాకప్‌లో పాక్‌తో మ్యాచ్‌ను భారత్ బహిష్కిరించాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి.కానీ విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) నుండి బీసీసీఐకి అనుమతి లభించింది. దీంతో భారత్-పాక్ మ్యాచ్ షెడ్యూల్ ప్రకారం జరగనుంది.
చదవండి: కోహ్లి, గిల్ కాదు.. అతడికి బౌలింగ్ చేయడం కష్టం: ఇంగ్లండ్ స్టార్ పేసర్