
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్‌ని ప్రముఖ క్రికెటర్ హనుమ విహారి వదిలేశారు. త్రిపుర రాష్ట్రానికి ఆయన ప్రాతినిధ్యం వహించనున్నారు. 2025-26 కోసం కాంట్రాక్టు కుదుర్చుకున్న విహారి.. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్‌తో విసిగి.. ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు. సీనియర్ ప్లేయర్ అయిన తనకి అవకాశాలు ఇవ్వటం లేదని.. మూడు ఫార్మాట్లలో ఆడే సత్తా ఉన్నా కానీ అవకాశం ఇవ్వట్లేదని హనుమ విహారి ఆవేదన వ్యక్తం చేశారు.
ఇండియా జట్టులో సైతం ఆడి తన ప్రతిభ కనబర్చిన విహారికి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రాధాన్యత ఇవ్వలేదు. దీంతో ఏపీని వదిలి కొత్త వాతావరణంలో ఆడాలని ఆయన నిర్ణయించారు. క్రీడల్లో కూడా కూటమి సర్కార్ రాజకీయాన్ని చొప్పించిందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.