సందడి తెచ్చిన గండికోట ఉత్సవాలు | Gandikota Festivals Celebrated Grandly | Sakshi
Sakshi News home page

సందడి తెచ్చిన గండికోట ఉత్సవాలు

Jan 12 2026 4:22 AM | Updated on Jan 12 2026 4:22 AM

Gandikota Festivals Celebrated Grandly

శోభాయాత్రలో కళాకారుల ప్రదర్శన

శోభాయాత్రతో సరికొత్త వైభవం 

మంత్రముగ్ధుల్ని చేసిన సంప్రదాయ నృత్యాలు, జానపద గీతాలు, వీణ, నాదస్వర ప్రదర్శనలు 

ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన హెలికాప్టర్‌ రైడ్‌

జమ్మలమడుగు/జమ్మలమడుగు రూరల్‌: వైఎస్సా­ర్‌ కడప జిల్లాలో పర్యాటక ప్రాంతమైన గండి­కోటలో వారసత్వ ఉత్సవాలు ఆదివారం సా­యంత్రం శోభాయాత్రతో ప్రారంభమయ్యాయి. గండికోట సాంస్కృతిక, చారిత్రక వైభవాన్ని శోభాయాత్ర ప్రతిబింబించింది. పురాతన రాచరిక సంస్కృతిని గుర్తుచేసే వేషధారణలు, సంప్రదాయ కళారూపాలు, జానపద నృత్యాలు ఈ వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఉత్సవాల్లో భాగంగా సంప్రదాయ నృత్యాలు, జానపద గీతాలు, వీ­ణ, నాదస్వర ప్రదర్శనలు మంత్రముగ్ధుల్ని చేశా­యి. హస్తకళల ప్రదర్శన, స్థానిక వంటకాల స్టాళ్లు సందర్శకులకు ప్రత్యేక అనుభూతిని కలిగించా­యి. హెలికాప్టర్‌ రైడ్‌ ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

మూడు రోజులపాటు జరిగే ఈ ఉత్సవాలను రాయలసీమ సంస్కృతి, చరిత్ర, ప్రకృతి అందాలను ప్రపంచానికి చాటిచెప్పేలా డిజైన్‌ చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలతోపాటు లైవ్‌ కాన్సర్ట్‌­లు (రామ్‌ మిరియాల, డ్రమ్స్‌ శివమణి వంటి ప్ర­ముఖుల ప్రదర్శనలు), డ్రోన్‌ షో, ఫైర్‌ క్రాకర్స్, హెలికాప్టర్‌ రైడ్స్, పారాగ్లైడింగ్, బోటింగ్, ట్రెక్కింగ్‌ వంటి అడ్వెంచర్‌ యాక్టివిటీలు ఉన్నాయి.  లేజ­ర్‌ షో, ముషాయిరా తదితర కార్యక్రమాలు ఆక­ట్టు­కోగా.. మంగ్లీ పాట కచేరీ ఉర్రూతలూగించింది. తొలుత సాహితీవేత్తలు జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, తవ్వా ఓబులరెడ్డి, సగిలి సుధారా­ణి గండికోట చరిత్రను వివరించారు. శోభాయా­త్రలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గే­ష్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్‌.సవిత, ప్రభు­త్వ విప్, ఎమ్మెల్యే సి.ఆదినారాయణరెడ్డి, జిల్లా కలెక్టర్‌ శ్రీధర్‌ చెరుకూరి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement