
దేశవాళీ సీజన్ 2025-26కు ముందు తమిళనాడు స్టార్ ఆల్‌రౌండర్, టీమిండియా వెటరన్ విజయ్ శంకర్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. తమిళనాడు క్రికెట్ అసోయేషిన్‌తో తెగదింపులు చేసుకునేందుకు విజయ్ శంకర్ సిద్దమైనట్లు సమాచారం. రాబోయే దేశీయ సీజన్‌లో త్రిపుర తరపున శంకర్ ఆడనున్నాడు. ఇప్పటికే శంకర్ తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ నుండి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) పొందినట్లు క్రిక్‌బజ్ తమ రిపోర్ట్‌లో పేర్కొంది.
అయితే అతడికి ఇంకా త్రిపుర క్రికెట్ అసోసియేషన్ నుండి మాత్రం ఇంకా క్లియరెన్స్ రాలేదు. ఈ విషయంపై ఒకట్రెండు రోజుల్లో శంకర్ అధికారిక ప్రకటన చేసే అవకాశముంది. 2012లో తమిళనాడు తరపున ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన శంకర్.. మూడు ఫార్మాట్లోనూ కీలక సభ్యునిగా కొనసాగుతూ వచ్చాడు.
శంకర్ తన 13 ఏళ్ల కెరీర్‌లో తమిళనాడు తరపున 328 మ్యాచ్‌లు ఆడి 8000 పరుగులు సాధించాడు. అదేవిధంగా 143 వికెట్లు పడగొట్టాడు. తమిళనాడులో టాలెంటెడ్ ఆటగాళ్లకు కొరత లేనప్పటికి శంకర్ స్దానాన్ని భర్తీ చేయడం కష్టమే అని చెప్పాలి. భారత దేశవాళీ సీజన్ 2025-26 ఆగస్టు 28 నుండి దులీప్ ట్రోఫీతో ప్రారంభం కానుంది.
దులీప్ ట్రోఫీ తర్వాత చాలా డొమాస్టిక్ టోర్నీలు జరగనున్నాయి. ఈసారి రంజీ ట్రోఫీని కూడా రెండు దశల్లో నిర్వహించనున్నారు. ఫస్ట్ హాఫ్ అక్టోబర్-నవంబర్ వరకు, తర్వాత రెండో దశ జనవరి-ఫిబ్రవరిలలో జరగనుంది. కాగా ఆంధ్ర స్టార్ క్రికెటర్ హనుమా విహారీ కూడా వచ్చే సీజన్‌లో త్రిపుర తరపున ఆడనున్నాడు.
చదవండి: IND vs AUS: యో-యో టెస్టుకు రోహిత్ శర్మ..? అసలేంటి ఈ పరీక్ష?