breaking news
Tripura Cricket Association
-
కెప్టెన్సీ హామీ ఇవ్వలేదు.. కానీ జట్టు మారుతున్నా: హనుమ విహారి
న్యూఢిల్లీ: సీనియర్ బ్యాటర్ గాదె హనుమ విహారి దేశవాళీ క్రికెట్లో తన సొంత టీమ్ ఆంధ్రను వీడాడు. 2025–26 సీజన్ కోసం అతను ఈశాన్య జట్టు త్రిపురతో జత కట్టాడు. ఒక ఏడాది కోసం ప్రస్తుతానికి ఒప్పందం కుదుర్చుకున్నా, మున్ముందు దీనిని పొడిగించే అవకాశం ఉంది. దేశవాళీలో మరో టీమ్ తరఫున ఆడేందుకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) విహారికి నిరభ్యంతరకర పత్రం (ఎన్ఓసీ) జారీ చేసింది. తన కెరీర్‌ను పునర్నిర్మించుకోవడంలో భాగంగా మూడు ఫార్మాట్లలో ఆడేందుకే రంజీ ట్రోఫీలో ఎలైట్ డివిజన్లో ఉన్న త్రిపుర టీమ్‌ను విహారి ఎంచుకున్నాడు. ఈ విషయంలో ఏసీఏ అతనికి ఎలాంటి హామీ ఇవ్వకపోవడంతో జట్టును వదలాల్సి వచ్చిందని వెల్లడించాడు. 2024–25 సీజన్లో ఆంధ్ర తరఫున రంజీ మ్యాచ్‌లు మాత్రమే ఆడిన విహారి... వన్డేల్లో విజయ్ హజారే ట్రోఫీ, టి20ల్లో ముస్తాక్ అలీ ట్రోఫీలో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ‘మూడు ఫార్మాట్లలో బాగా ఆడగల సత్తా నాకు ఉందని నమ్ముతాను. అందుకే ఇతర అవకాశాల కోసం ఎదురు చూస్తూ వచ్చాను. టి20 ఫార్మాట్లో యువ ఆటగాళ్లను ఎంచుకుంటున్నామని ఏసీఏ నాకు చెప్పింది. దాంతో 50 ఓవర్ల ఫార్మాట్లో కూడా ఆడటం అనవసరమని భావించా. అందుకే విజయ్ హజారేలో బరిలోకి దిగలేదు. పైగా కొత్త తరహా వాతావరణంలో ఆడాలని నాకూ ఉంది’ అని విహారి చెప్పాడు.2023–24 సీజన్లో ఏసీఏతో విభేదాలు రావడంతో జట్టును వీడాలని అప్పుడే నిర్ణయించుకున్న విహారి గత సీజన్‌కు ముందే మధ్యప్రదేశ్ జట్టుతో చేరడం దాదాపుగా ఖాయమైంది. అయితే చివరి నిమిషంలో అతను మళ్లీ ఆంధ్రతో కొనసాగడానికి సిద్ధపడటంతో మధ్యప్రదేశ్ క్రికెట్ సంఘం అసంతృప్తి వ్యక్తం చేసింది. త్రిపుర కూడా ఇంకా కెప్టెన్సీ విషయంలో విహారికి ఎలాంటి హామీ ఇవ్వలేదు. ‘ప్రస్తుతం నేనున్న పరిస్థితిలో ఏదైనా చిన్న జట్టు తరఫున ఆడటానికి ఇదే సరైన సమయం అనిపించింది. ముందుగా త్రిపుర సంఘం నన్ను అడిగింది. దాంతో ఈ సవాల్‌ను స్వీకరించేందుకు సిద్ధమయ్యా. నేను కెపె్టన్‌ను అయినా కాకపోయినా సీనియర్‌గా జట్టుకు అన్ని విధాలా ఉపయోగపడతా. టీమ్‌లో చక్కటి ఆటగాళ్లు ఉన్నారు. పెద్ద టీమ్‌లపై రాణించే విధంగా దీనిని తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తా’ అని విహారి విశ్వాసం వ్యక్తం చేశాడు. -
విజయ్ శంకర్ సంచలన నిర్ణయం.. 13 ఏళ్ల బంధానికి ముగింపు?
దేశవాళీ సీజన్ 2025-26కు ముందు తమిళనాడు స్టార్ ఆల్‌రౌండర్, టీమిండియా వెటరన్ విజయ్ శంకర్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. తమిళనాడు క్రికెట్ అసోయేషిన్‌తో తెగదింపులు చేసుకునేందుకు విజయ్ శంకర్ సిద్దమైనట్లు సమాచారం. రాబోయే దేశీయ సీజన్లో త్రిపుర తరపున శంకర్ ఆడనున్నాడు. ఇప్పటికే శంకర్ తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ నుండి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) పొందినట్లు క్రిక్‌బజ్ తమ రిపోర్ట్‌లో పేర్కొంది.అయితే అతడికి ఇంకా త్రిపుర క్రికెట్ అసోసియేషన్ నుండి మాత్రం ఇంకా క్లియరెన్స్ రాలేదు. ఈ విషయంపై ఒకట్రెండు రోజుల్లో శంకర్ అధికారిక ప్రకటన చేసే అవకాశముంది. 2012లో తమిళనాడు తరపున ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అరంగేట్రం చేసిన శంకర్.. మూడు ఫార్మాట్లోనూ కీలక సభ్యునిగా కొనసాగుతూ వచ్చాడు. శంకర్ తన 13 ఏళ్ల కెరీర్లో తమిళనాడు తరపున 328 మ్యాచ్‌లు ఆడి 8000 పరుగులు సాధించాడు. అదేవిధంగా 143 వికెట్లు పడగొట్టాడు. తమిళనాడులో టాలెంటెడ్ ఆటగాళ్లకు కొరత లేనప్పటికి శంకర్ స్దానాన్ని భర్తీ చేయడం కష్టమే అని చెప్పాలి. భారత దేశవాళీ సీజన్ 2025-26 ఆగస్టు 28 నుండి దులీప్ ట్రోఫీతో ప్రారంభం కానుంది. దులీప్ ట్రోఫీ తర్వాత చాలా డొమాస్టిక్ టోర్నీలు జరగనున్నాయి. ఈసారి రంజీ ట్రోఫీని కూడా రెండు దశల్లో నిర్వహించనున్నారు. ఫస్ట్ హాఫ్ అక్టోబర్-నవంబర్ వరకు, తర్వాత రెండో దశ జనవరి-ఫిబ్రవరిలలో జరగనుంది. కాగా ఆంధ్ర స్టార్ క్రికెటర్ హనుమా విహారీ కూడా వచ్చే సీజన్లో త్రిపుర తరపున ఆడనున్నాడు.చదవండి: IND vs AUS: యో-యో టెస్టుకు రోహిత్ శర్మ..? అసలేంటి ఈ పరీక్ష? -
త్రిపుర క్రికెట్లో ప్రొటీస్ మాజీ ఆల్‌రౌండర్‌కు కీలక పదవి
దక్షిణాఫ్రికా మాజీ ఆల్‌రౌండర్ లాన్స్ క్లూసెనర్ త్రిపుర క్రికెట్లో కీలక బాధ్యతలు చేపట్టనున్నాడు. ఈ శనివారం(జూన్ 3న) త్రిపుర క్రికెట్ కన్సల్టెంట్ పదవిని స్వీకరించనున్నాడు. ఇప్పటికే అగర్తల చేరుకున్న క్లూసెనర్ రానున్న దేశవాలీ క్రికెట్ సీజన్లో భాగంగా త్రిపుర క్రికెట్ జట్టుకు కన్సల్టెంట్‌గా ఉండనున్నాడు. త్రిపుర జట్టు కన్సల్టెంట్‌గా లాన్స్ క్లూసెనర్ తొలుత 100 రోజుల సీజన్‌కు అందుబాటులో ఉంటాడని.. 20 రోజులు అగర్తల క్యాంప్‌లో ఉండి జట్టును పర్యవేక్షిస్తాడని త్రిపుర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ తిమిర్ చందా పేర్కొన్నాడు. కాగా కన్సల్టెంట్ పోస్టుకు మా వెబ్సైట్లో ఒక ప్రకటన చేశాం. ఈ పదవి చేపట్టేందుకు డేవ్ వాట్మోర్ సహా లాన్స్ క్లూసెనర్లు ఆసక్తి చూపించారు. అయితే వ్యక్తిగత కారణాల రిత్యా డేవ్ వాట్మోర్ రేసు నుంచి తప్పుకోవడంతో లాన్స్ క్లూసెనర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నాం అంటూ చెప్పకొచ్చాడు. కాగా కొన్నేళ్ల క్రితం తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ఒక ఫ్రాంచైజీకి క్లూసెనర్ ప్రధాన కోచ్‌గా పనిచేశాడు. ఇక అంతర్జాతీయంగా 1996 నుంచి 2004 వరకు దక్షిణాఫ్రికా తరపున ఆడిన క్లూసెనర్ 49 టెస్టుల్లో 1906 పరుగులతో పాటు 80 వికెట్లు, 171 వన్డేల్లో 3576 పరుగులతో పాటు 192 వికెట్లు పడగొట్టాడు. తన కెరీర్లో ఎక్కువగా లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ వచ్చిన క్లూసెనర్ మెరుపు ఇన్నింగ్స్‌లకు పెట్టింది పేరు. దీనికి తోడు తన బౌలింగ్‌తోనూ ప్రొటిస్‌కు చాలా మ్యాచ్‌ల్లో విజయాలు అందించి మంచి ఆల్‌రౌండర్‌గా గుర్తింపు పొందాడు. ఇక 1999 వన్డే వరల్డ్‌కప్‌లో సెమీ ఫైనల్ చేరిన సౌతాఫ్రికా జట్టులో క్లూసెనర్ సభ్యుడిగా ఉన్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన సెమీస్‌లో మ్యాచ్ టై కావడం.. నెట్ రన్‌రేట్ ఆసీస్ కంటే తక్కువగా ఉన్న కారణంగా ప్రొటీస్ పోరాటం సెమీస్‌తోనే ముగిసింది. ఇక 2004లో రిటైర్మెంట్ ప్రకటించిన అనంతరం క్లూసెనర్ అఫ్గానిస్తాన్, జింబాబ్వే జట్లకు కోచ్‌గా వ్యవహరించాడు. చదవండి: ఒక్క ఆటోగ్రాఫ్ కోసం బతిమాలించుకున్నాడు! -
త్రిపుర జట్టుకు మెంటార్‌గా వృద్ధిమాన్ సాహా..!
టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ వృద్ధిమాన్ సాహా.. త్రిపుర జట్టుకు ప్లేయర్ కమ్ మెంటార్‌గా సేవలు అందించాడనికి సిద్దమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే సాహా త్రిపుర క్రికెట్ అసోసియేషన్‌తో చర్చలు జరిపినట్లు సమాచారం. ఈ ఏడాది శ్రీలంకతో స్వదేశంతో జరిగిన టెస్టు సిరీస్‌కు సాహాను సెలక్టర్లు ఎంపిక చేయలేదు. అతడి స్థానంలో బ్యాకప్ వికెట్ కీపర్‌గా కెఎస్ భరత్‌ను మేనేజ్మెంట్ ఎంపిక చేసింది. అప్పటి నుంచి సాహాను సెలక్టర్లు పక్కన పెట్టారు. తాజాగా ఇంగ్లండ్‌తో ఏకైక టెస్టుకు కూడా సాహాను ఎంపిక చేయలేదు. కాగా జట్టు నుంచి ఉద్వాసన తర్వాత ఐపీఎల్, దేశవాళీ క్రికెట్‌పై దృష్టి సారిస్తాని గతంలో సాహా తెలిపాడు. ఈ ఏడాది ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ తరుపున ఆడిన షా అద్భుతంగా రాణించాడు. ఈ సీజన్లో 11 మ్యాచ్‌లు ఆడిన అతడు 317 పరుగులు చేశాడు. ఇక త్రిపుర తరపున షా ఆడాలనుకుంటే 'క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్' నుంచి ఖఛ్చితంగా నో-ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ పొందాలి.ఘీపై ఈ విషయాన్ని త్రిపుర క్రికెట్ అసోసియేషన్‌తో బీసీసీఐ చర్చిస్తుంది. "వృద్ధిమాన్ సాహా త్రిపురకు ప్లేయర్-కమ్-మెంటర్‌గా వ్యవహరించాలని అనుకుంటున్నాడు. అతడు త్రిపుర అపెక్స్ కౌన్సిల్ సభ్యులతో చర్చలు జరుపుతున్నాడు. అయితే ఇప్పటి వరకు ఇంకా ఏమీ ఖరారు కాలేదు" అని ఎన్డీటీవీతో బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. చదవండి: SL vs AUS: ఆస్ట్రేలియాపై శ్రీలంక ఘన విజయం.. 9 ఏళ్ల తర్వాత..! -
'కొత్త క్రికెట్ కమిటీని ఏర్పాటు చేస్తాం'
త్రిపుర:జస్టిస్ లోధా ప్యానెల్ సిఫారుసుల్ని అమలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) బోర్డు పెద్దలు అనురాగ్ ఠాకూర్, కార్యదర్శి అజయ్ షిర్కేలపై వేటు పడటంతో రాష్ట్ర క్రికెట్ సంఘాల్లో ఒక్కసారిగా అలజడి మొదలైంది. ఇప్పటికే లోధా ప్యానల్ సూచనల్ని అమలు చేయడానికి తమకు ఎటువంటి అభ్యంతరం లేదని ఆంధ్ర క్రికెట్ సంఘం స్పష్టం చేయగా, తాజాగా త్రిపుర క్రికెట్ అసోసియేషన్(టీసీఏ) కూడా ముందుకొచ్చింది. లోధా సిఫారుసుల్ని వెంటనే అమలు చేస్తామంటూ త్రిపుర క్రికెట్ సంఘం కార్యదర్శి సౌరవ్ దాస్ గుప్తా తెలిపారు. 'మేము లోధా కమిటీ సిఫారుసుల్ని అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దీనిలో భాగంగా మంగళవారం వార్షిక సర్వసభ్య సమావేశం(ఏజీఎం) నిర్వహించనున్నాం. టీసీఏ ప్రస్తుత కమిటీ రాజీనామా చేస్తుంది. ఈ రోజే కొత్త క్రికెట్ కమిటీ ఏర్పాటవుతుంది. ఆ మరుక్షణమే కొత్త కమిటీ పరిపాలన బాధ్యతలను తీసుకుంటుంది' అని దాస్ గుప్తా పేర్కొన్నారు.