న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ నేపథ్యంలో టీమిండియాకు మరో భారీ షాక్ తగిలింది. ఇప్పటికే రిషభ్ పంత్ గాయం కారణంగా జట్టుకు దూరమైన విషయం తెలిసిందే. తాజాగా మరో ఆటగాడు సైతం గాయపడ్డాడు.
వడోదర వేదికగా తొలి వన్డే సందర్భంగా ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ (Washington Sundar)కు గాయమైంది. పక్కటెముకల్లో నొప్పితో అతడు విలవిల్లాడాడు. ఈ క్రమంలో అతడిని స్కానింగ్‌కు పంపించారు. ప్రస్తుతం భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్న వాషీ.. తదుపరి రిపోర్టు వచ్చే వరకు వేచి చూడాల్సి ఉంది.

ఊహించని ఆటగాడు
ఈ నేపథ్యంలో వాషింగ్టన్ సుందర్ మిగిలిన రెండు వన్డేలకు దూరమయ్యాడు. మెన్స్ సెలక్షన్ కమిటీ వాషీ స్థానంలో యువ ఆటగాడు ఆయుశ్ బదోని (Ayush Badoni)ని జట్టుకు ఎంపిక చేసింది. రాజ్‌కోట్‌లో రెండో వన్డే కోసం బదోని టీమిండియాతో చేరతాడు. ఈ మేరకు బీసీసీఐ సోమవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. కాగా బదోని జాతీయ జట్టుకు ఎంపిక కావడం ఇదే తొలిసారి.
ఢిల్లీకి చెందిన ఆయుశ్ బదోని బ్యాటింగ్ ఆల్‌రౌండర్. కుడిచేతి వాటం బ్యాటర్ అయిన బదోని.. రైటార్మ్ ఆఫ్‌బ్రేక్ స్పిన్నర్ కూడా!.. ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న 26 ఏళ్ల బదోని.. ఇప్పటికి 56 మ్యాచ్‌లలో కలిపి 963 పరుగులు చేశాడు.
ఫామ్‌లో లేడు
ఇక లిస్ట్-ఎ క్రికెట్‌లో 27 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న ఆయుశ్ బదోని ఖాతాలో 693 పరుగులు ఉన్నాయి. ఇందులో ఓ శతకం, ఐదు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అయితే, ఇటీవల దేశీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో మాత్రం గత మూడు మ్యాచ్‌ల (1, 12, 3 నాటౌట్)లో బదోని తీవ్రంగా నిరాశపరిచాడు.
అయినప్పటికీ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ వాషీ దూరం కావడంతో అతడి స్థానంలో తొలిసారి టీమిండియాలోకి వచ్చాడు. కాగా న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారం నాటి మ్యాచ్‌లో భారత్ నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది.
ఇరుజట్ల మధ్య బుధవారం నాటి రెండో వన్డేకు రాజ్‌కోట్ వేదిక. ఇదిలా ఉంటే పంత్ స్థానంలోధ్రువ్ జురెల్ జట్టులో చేరిన విషయం తెలిసిందే.
న్యూజిలాండ్‌తో రెండు, మూడో వన్డేకు భారత జట్టు (అప్‌డేటెడ్)
శుబ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, మొహమ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, నితీశ్ కుమార్ రెడ్డి, అర్ష్‌దీప్ సింగ్, యశస్వి జైస్వాల్, ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), ఆయుశ్ బదోని.


