
‘కౌన్ బనేగా కరోడ్‌పతి’.. ఇండియాలో మోస్ట్ పాపులర్ రియాలిటీ గేమ్ షోలలో ఒకటి. ఎన్నో సీజన్ల నుంచి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కించుకుంటున్న ఈ షో తాజాగా 17వ సీజన్ నడుస్తోంది. ఈ సీజన్‌లో కూడా బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు.
అయితే గత వారంలో కంటెస్టెంట్‌లకు క్రికెట్‌కు సంబంధించి పలు ప్రశ్నలు ఎదురయ్యాయి. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో పాకిస్తాన్‌పై సెంచరీతో చేసిన భారత ఆటగాడు ఎవరు అన్న ప్రశ్న హోస్ట్ అమితాబ్ అడిగారు. ఈ ప్రశ్నకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్ అనే నాలుగు ఆప్షన్స్ ఇచ్చారు.
ఇందుకు సమాధానం ఆప్షన్ బి విరాట్ కోహ్లి. ఛాంపియన్స్ ట్రోఫీలో చిరకాల ప్రత్యర్ధిపై కోహ్లి అద్బుతమైన సెంచరీతో మెరిశాడు. కాగా ఈ ప్రశ్న "సూపర్ సాండూక్" అనే స్సెషల్ రౌండ్‌లో భాగంగా అడిగారు. ఈ రౌండ్‌లో మొత్తం పది ప్రశ్నలు ఉంటాయి.
ఒక్కో ప్రశ్నకు పదివేలు. మొత్తం పది ప్రశ్నలకు సరైన సమాధానం చెబితే లక్ష రూపాయలు బహుమతిగా లభించనుంది. అదేవిధంగా మరో కంటెస్టెంట్‌కు రూ. 7.50 లక్షలకు గానూ ఐపీఎల్ నుంచి ఓ ప్రశ్న ఎదురైంది. ఐపీఎల్ చరిత్రలో రెండు సార్లు పర్పుల్ క్యాప్ గెలవని ప్లేయర్ ఎవరు? అన్న ప్రశ్న అమితాబ్ అడిగారు.
ఇందుకు ఆప్షన్స్‌గా ఎ. లసిత్ మలింగ, బి.హర్షల్ పటేల్, సి. డ్వేన్ బ్రావో, డి. భువనేశ్వర్ కుమార్. సరైన సమాధనం అప్షన్ ఎ. లసిత్ మలింగ. మలింగ మినహా హర్షల్ పటేల్, డ్వేన్ బ్రావో, భువనేశ్వర్ ఐపీఎల్‌లో రెండు సార్లు పర్పుల్ క్యాప్ హోల్డర్‌గా నిలిచారు.
చదవండి: AUS vs SA: ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్.. సౌతాఫ్రికాకు భారీ షాక్