
ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌కు ముందు సౌతాఫ్రికాకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ కగిసో రబాడ గాయంతో కారణంగా ఆసీస్‌తో సిరీస్‌కు దూరమయ్యాడు. ఈ విషయాన్ని క్రికెట్ సౌతాఫ్రికా ధ్రువీకరించింది
31 ఏళ్ల కగిసో రబాడ కూడి చీలమండ గాయం కారణంగా ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ నుంచి తప్పకొన్నాడు.
రబాడకు సోమవారం(ఆగస్టు 18) స్కాన్ చేయించాము. కుడి చీలమండలో సమస్య ఉన్నట్లు తేలింది. ఈ క్రమంలో అతడికి విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. అతడు జట్టుతో పాటు ఆస్ట్రేలియాలో ఉండి ప్రోటీస్ వైద్య సిబ్బంది పర్యవేక్షణలో పునరావాసం పొందనున్నాడు అని క్రికెట్ సౌతాఫ్రికా ఓ ప్రకటనలో పేర్కొంది.
అతడి స్ధానాన్ని యువ ఫాస్ట్ బౌలర్ క్వేనా మఫాకాను సెలక్టర్లు భర్తీ చేశారు. ఆసీస్‌తో టీ20 సిరీస్‌ను ప్రోటీస్ కోల్పోయినప్పటికి మఫాకా మాత్రం తన సంచలన ప్రదర్శనతో అందరిని ఆకట్టుకున్నాడు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో మఫాకా(9) లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచారు.
ఈ క్రమంలో సెలక్టర్లు అతడికి మరోసారి ఛాన్స్ ఇచ్చారు. క్వెనా మఫాకా గతేడాది పాకిస్తాన్‌తో చివరగా వన్డే మ్యాచ్ ఆడాడు. కాగా ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌ను 2-1 తేడాతో కోల్పోయిన సౌతాఫ్రికా.. వన్డే సిరీస్‌ను ఎలాగైనా సొంతం చేసుకోవాలని పట్టుదలతో ఉంది. ఈ సిరీస్‌లో భాగంగా తొలి వన్డే కెయిర్న్స్ వేదికగా మంగళవారం జరగనుంది.
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు సౌతాఫ్రికా జట్టు
టెంబా బావుమా (కెప్టెన్), కార్బిన్ బాష్, మాథ్యూ బ్రీట్జ్కే, డెవాల్డ్ బ్రెవిస్, నండ్రీ బర్గర్, టోనీ డి జోర్జి, ఐడెన్ మార్క్రమ్, క్వెనా మఫాకా, సెనురాన్ ముత్తుసామి, కేశవ్ మహరాజ్, వియాన్ ముల్డర్, లుంగి ఎంగిడి, లువాన్-డ్రే ప్రిటోరియస్, కగిసో రబడ, రియాన్ రికెల్టన్, ట్రిస్టన్ స్టబ్స్, ప్రనెలన్ సబ్రాయన్.
సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌కు ఆస్ట్రేలియా జట్టు
మిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్‌లెట్, అలెక్స్ కారీ, కూపర్ కొన్నోలీ, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, కామెరాన్ గ్రీన్, ఆరోన్ హార్డీ, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మాథ్యూ కుహ్నెమాన్, మార్నస్ లబుషేన్, ఆడమ్ జంపా.
చదవండి: Asia Cup 2025: 'ఏ జట్టునైనా ఓడిస్తాము.. ఆసియాకప్ టైటిల్ మాదే'