
ఆసియాకప్-2025కు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఎనిమిది జట్ల మధ్య జరిగే ఈ మెగా టోర్నీకి మరో 20 రోజుల్లో తెరలేవనుంది. సెప్టెంబర్ 9న జరిగే తొలి మ్యాచ్‌లో అబుదాబి వేదికగా బంగ్లాదేశ్, హాంకాంగ్ జట్లు తలపడనున్నాయి.
అయితే ఈ మెగా ఈవెంట్ ఆరంభానికి ముందు బంగ్లాదేశ్ స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ జాకర్ అలీ అనిక్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ ఏడాది ఆసియాకప్ ఛాంపియన్స్‌గా నిలవడమే తమ లక్ష్యమని జాకర్ తెలిపాడు. కాగా బంగ్లా టైగర్స్ ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఆసియాకప్ టైటిల్‌ను సొంతం చేసుకోలేదు. ఇంతకుముందు మూడు సార్లు ఫైనల్‌కు చేరినప్పటికి.. ప్రతీసారి తుది మెట్టుపై బంగ్లా జట్లు బోల్తా పడింది.
2012లో పాకిస్తాన్, 2016, 2018 ఫైనల్లో భారత్‌పై బంగ్లా ఓటమి చవిచూసింది. కానీ ఈసారి మాత్రం ఎలాగైనా గెలిచి తమ సుదీర్ఘ నిరీక్షణకు తెరదించాలని బంగ్లా వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే 20 మంది సభ్యులతో కూడా తమ ప్రాథిమిక జట్టును బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. అంతేకాకుండా యూఏఈలో ఒక ప్రత్యేక క్యాంపును కూడా బంగ్లాదేశ్ ఏర్పాటు చేయనుంది. కెప్టెన్ లిట్టన్ దాస్ నేతృత్వంలో బంగ్లాదేశ్ ఇటీవల శ్రీలంక, పాకిస్తాన్‌లతో టీ20 సిరీస్‌లను సొంతం చేసుకుంది.
"టైటిలే లక్ష్యంగా ఈ ఏడాది ఆసియాకప్ బరిలోకి దిగనున్నాము. ఈసారి ఛాంపియన్స్‌గా నిలుస్తామన్న నమ్మకం డ్రెస్సింగ్ రూమ్‌లోని ప్రతి ఒక్కరికి ఉంది. మా జట్టులో అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారు. ప్రతీ ఒక్కరూ తీవ్రంగా శ్రమిస్తున్నారు.
ఏ విషయాన్ని మేము తేలికగా తీసుకోవడం లేదు. ఈ టోర్నీ కోసం మాకు ఎటువంటి ప్రణాళికలు లేవు. ఏ జట్టుతో ఆడినా మా బ్రాండ్ ఆఫ్ క్రికెట్‌ను కొనసాగించాలనకుంటున్నాము.
ఈ ఈవెంట్‌లో మెరుగైన ప్రదర్శన చేసేందుకు అన్ని విధాల సిద్దమవుతున్నాము అని విలేకరుల సమావేశంలో అలీ పేర్కొన్నాడు. కాగా ఈ టోర్నీలో గ్రూప్-బిలో శ్రీలంక, హాంకాంగ్, ఒమన్‌లతో పాటు బంగ్లాదేశ్ ఉంది.
ఆసియాకప్-2025 బంగ్లాదేశ్ ప్రిలిమినరీ జట్టు
లిట్టన్ దాస్ (కెప్టెన్), తాంజిద్ హసన్ తమీమ్, ఎండి నయీమ్ షేక్, సౌమ్య సర్కార్, మహ్మద్ పర్వేజ్ హోస్సేన్ ఎమోన్, తౌహిద్ హృదయ్, జాకర్ అలీ అనిక్, మెహిదీ హసన్ మిరాజ్, షమీమ్ హుస్సేన్, నజ్ముల్ హోస్సేన్, రిషాద్ హొస్సేన్, షాక్ మహేదీ హసన్, తన్వీర్ ఇస్లాం,నసుమ్ అహ్మద్, హసన్ మహమూద్,
తస్కిన్ అహ్మద్, తంజిమ్ హసన్ సాకిబ్, సైఫుద్దీన్, నహిద్ రానా, ముస్తాఫిజుర్ రెహమాన్, షోరీఫుల్ ఇస్లాం, సయ్యద్ ఖలీద్ అహ్మద్, నూరుల్ హసన్ సోహన్, మహిదుల్ ఇస్లాం భుయాన్ అంకోన్, మహ్మద్ సైఫ్ హసన్.
చదవండి: Asia Cup 2025: 'ఆసియాకప్‌లో భారత్- పాక్ మ్యాచ్ జరగదు'