రెండో అనధికారిక వన్డేలో భారత్ విజయం
9 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా చిత్తు
రాణించిన రుతురాజ్, నిశాంత్‌కు 4 వికెట్లు
రాజ్‌కోట్: దక్షిణాఫ్రికా ‘ఎ’పై వరుస విజయాలతో భారత్ ‘ఎ’ అనధికారిక వన్డే సిరీస్‌ను సొంతం చేసుకుంది. భారత బౌలర్ల సత్తాతో ఆదివారం ఇక్కడ జరిగిన రెండో మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా ‘ఎ’ను చిత్తు చేసింది. తద్వారా మరో మ్యాచ్ మిగిలుండగానే భారత్ ‘ఎ’ జట్టు 2–0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. 19న ఇదే వేదికపై ఆఖరి మ్యాచ్ జరుగుతుంది.
రెండో అనధికారిక వన్డేలో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ నిశాంత్ సింధు (4/16), హర్షిత్ రాణా (3/21), ప్రసిధ్ కృష్ణ (2/21) సమష్టిగా దక్షిణాఫ్రికాను కట్టడి చేశారు. దీంతో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సఫారీ ‘ఎ’ జట్టు 30.3 ఓవర్లలోనే 132 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్ రివాల్డో మూన్సామి (34 బంతుల్లో 33; 7 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా, ప్రిటోరియస్ (21; ఫోర్లు), డియాన్ ఫారెస్టర్ (22; 3 ఫోర్లు), డెలానో పాట్జియేటర్ (23; 1 ఫోర్) ఫర్వాలేదనిపించారు. మిగతా ఆరుగురు బ్యాటర్లయితే సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. కెప్టెన్ తిలక్ వర్మకు ఒక వికెట్ దక్కింది.
రుతురాజ్ గైక్వాడ్ అర్ధ సెంచరీ...
సులువైన లక్ష్యఛేదనకు దిగిన భారత ‘ఎ’ జట్టు 27.5 ఓవర్లలో ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 135 పరుగులు చేసి గెలిచింది. తొలి వన్డేలో విరోచిత సెంచరీతో భారత్‌ను గెలిపించిన ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (83 బంతుల్లో 68 నాటౌట్; 9 ఫోర్లు) ఈ మ్యాచ్‌లోనూ రాణించాడు. అజేయ అర్ధ సెంచరీతో ఆఖరిదాకా క్రీజులో నిలిచాడు. ముందుగా అభిషేక్ శర్మ (22 బంతుల్లో 32; 6 ఫోర్లు)తో కలిసి తొలి వికెట్‌కు 8.1 ఓవర్లలో 53 పరుగులతో శుభారంభం ఇచ్చాడు. తర్వాత కెప్టెన్ ఠాకూర్ తిలక్ వర్మ (62 బంతుల్లో 29 నాటౌట్; 2 ఫోర్లు)తో కలిసి అబేధ్యమైన రెండో వికెట్‌కు 82 పరుగులు జతచేశాడు. సఫారీ బౌలర్లలో లూథో సిపామ్లాకు ఒక వికెట్ దక్కింది.
స్కోరు వివరాలు
దక్షిణాఫ్రికా ‘ఎ’ ఇన్నింగ్స్: ప్రిటోరియస్ (సి) ప్రసి«ద్‌కృష్న (బి) హర్షిత్ 21; రివాల్డో (సి) బదోని (బి) నిశాంత్ 33; జోర్డాన్ (సి) బదోని (బి) హర్షిత్ 4; అకెర్మన్ (సి) ఇషాన్ కిషన్ (బి) హర్షిత్ 7; సినెతెంబా (సి) అండ్ (బి) నిశాంత్ 3; ఫారెస్టర్ (సి) విప్రాజ్ (బి) తిలక్ వర్మ 22; పాట్టియేటర్ (సి) ఇషాన్ కిషన్ (బి) ప్రసిధ్ కృష్ణ 23; సుబ్రయెన్ (బి) ప్రసిధ్ కృష్ణ 15; పీటర్ (సి) నితీశ్ రెడ్డి (బి) నిశాంత్ 0; సిపామ్లా (సి) అర్ష్దీప్ (బి) నిశాంత్ 0; బార్ట్‌మన్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (30.3 ఓవర్లలో ఆలౌట్) 132.
వికెట్ల పతనం: 1–39, 2–59, 3–66, 4–71, 5–73, 6–107, 7–127, 8–128, 9–128, 10–132.
బౌలింగ్: అర్ష్దీప్ 4–0–33–0, ప్రసిధ్ కృష్ణ 4.3–0–21–2, నిశాంత్ సింధు 7–1–16–4, హర్షిత్ 5–1–21–3, తిలక్‌వర్మ 4–0–12–1, ఆయుశ్ బదోని 4–0–15–0, విప్రాజ్ నిగమ్ 2–0–10–0.
భారత్ ‘ఎ’ ఇన్నింగ్స్: రుతురాజ్ నాటౌట్ 68; అభిõÙక్ (సి) ప్రిటోరియస్ (బి) సిపామ్లా 32; తిలక్ నాటౌట్ 29; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (27.5 ఓవర్లలో వికెట్ నష్టానికి) 135.
వికెట్ల పతనం: 1–53.
బౌలింగ్: సిపామ్లా 5–0–33–1, సుబ్రయెన్ 4.5–0–35–0, బార్ట్‌మన్ 4–0–15–0, పీటర్ 9–0–35–0, ఫారెస్టర్ 5–1–13–0.


