
దొడ్డబళ్లాపురం: విరాట్ కోహ్లి కటౌట్ ముందు మేకను బలి ఇచ్చిన ఆర్‌సీబీ అభిమానులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సంఘటన చిత్రదుర్గ జిల్లా మొళకాల్మూరు తాలూకా మారమ్మనహళ్లిలో చోటుచేసుకుంది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ విజయం సాధించారు. దీంతో ఆనందం పట్టలేని అభిమానులు మారమ్మనహళ్లిలో విరాట్ కోహ్లి కటౌట్ పెట్టి మేకను బలి ఇచ్చారు. సదరు వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. దీంతో మొళకాల్మూరు పోలీసులు పాలయ్య, జయణ్ణ, తిప్పేస్వామిలపై కేసు నమోదు చేశారు.