
కేఎల్ రాహుల్ ఐపీఎల్‌లో కొత్త ఫ్రాంచైజీ ఢిల్లీ తరఫున తొలి మ్యాచ్‌లో బరిలోకి దిగలేదు. వ్యక్తిగత కారణాలతో మ్యాచ్‌కు దూరమైనట్లు ముందుగా ఫ్రాంచైజీ ప్రకటించింది. మ్యాచ్ సాగుతున్న సమయంలో రాహుల్ శుభవార్త ట్వీట్ చేశాడు. తమకు అమ్మాయి పుట్టినట్లు రాహుల్, అతియా శెట్టి ప్రకటించారు. 2023 జనవరిలో వీరిద్దరి పెళ్లి జరిగింది.