
కేరళ క్రికెట్ నుంచి మరో యువ సంచలనం పుట్టుకొచ్చాడు. కేవలం 19 ఏళ్ల వయస్సులోనే తన బ్యాటింగ్ ప్రదర్శనలతో అందరిని ఆకట్టుకున్నాడు. ఓపెనర్‌గా వచ్చి ప్రత్యర్ధి బౌలర్లకు విరుచుకుపడుతున్నాడు. అతడే అహమ్మద్ ఇమ్రాన్. ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ కేరళ క్రికెట్ లీగ్ (KCL) 2025లో త్రిస్సూర్ టైటాన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.
ఈ టోర్నీలో భాగంగా శనివారం గ్రీన్ ఫీల్డ్ స్టేడియం వేదికగా కాలికట్ గ్లోబ్‌స్టార్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇమ్రాన్ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. కేవలం 55 బంతుల్లోనే 11 ఫోర్లు, 5 సిక్స్‌లతో తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.
ఈ ఏడాది కేసీఎల్ సీజన్‌లో సెంచరీ చేసిన తొలి ప్లేయర్ నిలిచాడు. అంతకముందు అల్లెప్పీ రిప్పిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా ఇమ్రాన్ హాఫ్ సెంచరీతో మెరిశాడు. 44 బంతుల్లో 8 ఫోర్లు సాయంతో 61 పరుగులు చేశాడు. ఇప్పటివరకు 2 మ్యాచ్‌లు ఆడిన ఇమ్రాన్.. 161 పరుగులతో లీడింగ్ రన్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. అతడి తర్వాతి స్ధానంలో వస్తాల్ గోవింద్(104), మనోహరన్(80) ఉన్నారు.
కాగా తిరువనంతపురంకు చెందిన 19 ఏళ్ల ఇమ్రాన్‌కు బ్యాట్‌తో పాటు బంతితో కూడా మ్యాజిక్ చేసే సత్తా ఉంది. ఎడమచేతి వాటం బ్యాటర్ అయినప్పటికి రైట్ ఆర్మ్ ఆఫ్-బ్రేక్‌తో బౌలింగ్ చేస్తాడు. అతడు ఇప్పటికే కేరళ తరపున
ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు.
ఇప్పటివరకు రెండు ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు, 4 లిస్ట్-ఎ మ్యాచ్‌లలో ఆడాడు. ఇమ్రాన్ ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే ఐపీఎల్‌లో జాక్ పాట్ కొట్టే అవకాశముంది. కాగా కేసీఎల్-2025లో టీమిండియా స్టార్ ప్లేయర్ సంజూ శాంసన్ కొచ్చి బ్లూ టైగర్స్ తరపున ఆడుతున్నాడు.
చదవండి: మా నాన్న చాలా నేర్పించారు.. కానీ అతడే నాకు రోల్ మోడల్: ఆర్యవీర్ సెహ్వాగ్