పంజాబ్‌లో ఫ్లైఓవర్‌ను ఢీకొన్న బస్సు.. ముగ్గురు మృతి! | 3 killed 18 injured as PRTC bus rams into flyover in Punjabs Sangrur | Sakshi
Sakshi News home page

పంజాబ్‌లో ఫ్లైఓవర్‌ను ఢీకొన్న బస్సు.. ముగ్గురు మృతి!

Nov 11 2026 9:40 AM | Updated on Nov 11 2026 9:40 AM

3 killed 18 injured as PRTC bus rams into flyover in Punjabs Sangrur

సంగ్రూర్‌: పంజాబ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సంగ్రూర్‌లో ముఖ్యమంత్రి భగవంత్ మాన్ నివాసానికి సమీపంలో బుధవారం ప్రయాణికులతో వెళ్తున్న పీఆర్‌టీసీ బస్సు ఫ్లైఓవర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, మరో 18 మంది గాయపడ్డారు. సంగ్రూర్ నుంచి చండీగఢ్‌కు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.

ప్రమాద తీవ్రతకు బస్సు దెబ్బతింది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. తొలుత ఫ్లైఓవర్‌కు దన్నుగా ఉన్న స్తంభాన్ని బస్సు ఢీకొట్టింది. అనంతరం అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించారు. పోలీసులు, జిల్లా అధికారులతో కలిసి సహాయక చర్యల్లో పాల్గొని క్షతగాత్రులను బయటకు తీసుకొచ్చారు. గాయపడిన 18 మందిలో 15 మందిని మెరుగైన చికిత్స కోసం పాటియాలాలోని ప్రభుత్వ రాజీంద్ర ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదం నెలకొంది. ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందుకున్న ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. 

ఇదీ చదవండి: న్యూజిలాండ్‌లో ఘోరం.. ముగ్గురు పంజాబీ యువకులు మృతి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement