శబరిమల భక్తులకు కేరళ పోలీసుల గుడ్‌న్యూస్‌ | Kerala Police Set Up Help Desks Railway Stations for Sabarimala Pilgrims | Sakshi
Sakshi News home page

శబరిమల భక్తులకు కేరళ పోలీసుల గుడ్‌న్యూస్‌

Nov 16 2026 8:40 AM | Updated on Nov 16 2026 8:47 AM

Kerala Police Set Up Help Desks Railway Stations for Sabarimala Pilgrims

తిరువనంతపురం: శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లే భక్తులకు కేరళ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. మండలం-మకరవిళక్కు యాత్ర నేపథ్యంలో రైళ్ల ద్వారా వచ్చే అయ్యప్ప భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఐదు ప్రధాన రైల్వే స్టేషన్లలో ప్రత్యేక పోలీసు సహాయ కేంద్రాలను ఏర్పాటు చేసింది. యాత్రికులకు ప్రయాణ సమాచారం అందించడంతో పాటు భద్రత, అత్యవసర పరిస్థితుల్లో తక్షణ సహాయం అందించడమే వీటి ప్రధాన ఉద్దేశం.

ఈ ఐదు స్టేషన్లలో ప్రత్యేక కేంద్రాలు
అధిక సంఖ్యలో అయ్యప్ప భక్తులు రాకపోకలు సాగించే ఎర్నాకులం, చెంగన్నూర్‌, తిరువల్ల, కొట్టాయం, కాయంకుళం రైల్వే స్టేషన్లలో ఈ కేంద్రాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇవి 24 గంటల పాటు పనిచేస్తాయి. ప్రయాణానికి సంబంధించిన సందేహాలు, శబరిమలకు వెళ్లే మార్గాలు, భద్రతాపరమైన సమస్యలు, అత్యవసర పరిస్థితుల్లో భక్తులకు పోలీసులు సహాయం అందిస్తారు.

మరోవైపు రైల్వే స్టేషన్లు, రైళ్లలో భద్రతా నిఘాను కూడా పటిష్టం చేశారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో భద్రతా విభాగాల మధ్య సమన్వయాన్ని పెంచారు. ఈ ప్రత్యేక సహాయ కేంద్రాల పనితీరును తిరువనంతపురంలోని రైల్వే పోలీస్ కమాండెంట్ నియంత్రణ కేంద్రం పర్యవేక్షిస్తుంది. యాత్రకు వెళ్లే అయ్యప్ప భక్తులు ఈ నంబర్లను దగ్గర ఉంచుకోవడం ద్వారా అవసరమైనప్పుడు పోలీసుల సహాయం పొందవచ్చు.

భక్తుల కోసం ముఖ్యమైన ఫోన్ నంబర్లు

  • పోలీసు నియంత్రణ కేంద్రం: 9846200100

  • అత్యవసర పోలీసు సహాయం: 112

  • రైల్వే భద్రత, ఫిర్యాదులు: 139

ఇదీ చదవండి: మహారాష్ట్రలో పొలిటికల్‌ సస్పెన్స్‌.. సునేత్రా వరుస భేటీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement