సాక్షి, గుంటూరు: ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణ ఎదుర్కొంటున్న వ్యవహారం మరో మలుపు తిరిగింది. ఈ కేసులో జనసేన నాయకురాలు, సంస్థ డైరెక్టర్‌గా పేర్కొంటున్న కోట రుక్మిణి పాత్రపైనా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని బాధితురాలి తల్లి గార్ల నాగమణి ఆదివారం ఆరోపించారు. సంస్థలో పనిచేసిన బోడపాటి ధరణి కృష్ణను రెండు కేసుల్లోనూ ప్రధాన నిందితురాలిగా చేర్చడం వెనుక కారణాలేమటని ప్రశ్నించారు. పోలీసులు తన కుమార్తెను అదుపులోకి తీసుకున్నారని, అనంతరం ఆమె ఆచూకీ తెలియడం లేదని పేర్కొంటూ హైకోర్టును ఆశ్రయించడం చర్చనీయాంశంగా మారింది.
⇒ గార్ల నాగమణి వాదన ప్రకారం.. తన కుమార్తె సంస్థలో హెచ్‌ఆర్ అండ్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్‌గా మాత్రమే పనిచేశారని నాగమణి తన అఫిడివిట్‌లో పేర్కొన్నారు. సంస్థలో ఆమెకు ఏలాంటి వాటాలు, డైరెక్టర్ పదవి తేదా యాజమాన్య హక్కులు లేవని తెలిపారు. తన కుమార్తెను మాత్రమే ప్రధాన నిందితురాలిగా చూపుతున్నారని ఆమె ప్రధాన ఆరోపణ. అరగంట వ్యవధిలో రెండు కేసులు రెండింటిలోను ఏ1గా నమోదు చేయడంపై అఫిడవిట్‌లో ఆమె ప్రశ్నించారు.
⇒ ఏపీ పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కళ్యాణం శివ శ్రీనివాసరావు అలియాస్ కేకే ఫిర్యాదుతో క్రైమ్ నెంబరు 497ః 2026 కోట రుక్మిణి ప్రాతినిధ్యం వహిస్తున్న సంస్థ ఫిర్యాదుతో క్రైమ్ నెంబరు 498ః 2026 నమోదైనట్లు నాగమణి తన పిటీషన్‌లో పేర్కొన్నారు. నవంబరు 11న అర్ధగంట వ్యవధిలో నమోదైన రెండు కేసుల్లో తన కుమార్తెను ఏ1 చేర్చారని ఆమె ఆరోపించారు.
36 మంది బాధితుల ప్రస్తావన ...
ఉద్యోగాలు ఇప్పిస్తామన్న హామీతో డబ్బులు చెల్లించి నష్టపోయినట్లు చెబుతున్న 36 మంది అభ్యర్థుల ప్రస్తావనను నాగమణి తన అఫిడవిట్‌లో తీసుకువచ్చారు. వారిలో ఏవరైనా నేరుగా ఫిర్యాదు చేశా రా? డబ్బులు ఎవరికి చెల్లించారు? సంస్థలో ఎవరి పాత్ర ఉంది అనే అం«శాలు దర్యాప్తులో పరిశీలించాలని కోరారు. నవంబరు 13న తన కుమార్తెను తన కళ్లముందే ఓ ప్రైవేటు వాహనంలో తీసుకెళ్ళారని అఫిడివిట్‌లో తెలిపారు. ఉన్నతాధికారులకు తెలియజేసినా వారినుంచి ఎటువంటి స్పందన లేద ని ఆరోపించారు. డీజీపీ, ప్రభుత్వ ప్రధాన కార్యద ర్శి, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, గుంటూరు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు పంపినట్లు నాగమణి తెలిపారు.
హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటీషిన్
తన కుమార్తె ఆచూకీ విషయంపై నాయ్యస్థానం ముందు హాజరు పరచాలని కోరుతూ ఏపీ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటీషిన్‌ను గార్ల నాగమణి దాఖలు చేశారు. బాధితులపై చర్యలు తీసుకోవాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించినట్లు ఆమె తెలిపారు.
ఇదీ చదవండి: పేరుకు జనసేన... పార్టీ మాత్రం టీడీపీ


