టీడీపీ గూండాల దాడి.. బీజేపీ అభ్యర్థికి గాయాలు! | BJP Reddappa Injured At YSR Dist Over TDP Leaders Over Action | Sakshi
Sakshi News home page

టీడీపీ గూండాల దాడి.. బీజేపీ అభ్యర్థికి గాయాలు!

Nov 16 2026 7:17 AM | Updated on Nov 16 2026 7:17 AM

BJP Reddappa Injured At YSR Dist Over TDP Leaders Over Action

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: ఏపీలో స్థానిక ఎన్నికల వేళ ఉద్రిక్తత చోటుచేసుకుంది. కూటమిలో భాగస్వాములుగా ఉన్న టీడీపీ, బీజేపీ నేతల మధ్య విభేదాలు దాడులకు దారితీశాయి. వైఎస్సార్‌ జిల్లా సుండుపల్లి మండలం చిన్నగొల్లపల్లి సర్పంచ్‌ స్థానానికి నామినేషన్‌ వేసేందుకు వెళ్తున్న బీజేపీ సానుభూతిపరుడు రెడ్డప్పపై టీడీపీ నేత దాడి చేశాడు.

చిన్నగొల్లపల్లికి చెందిన రెడ్డప్పపై టీడీపీ బీసీ సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్‌ గురిగింజకుంట శివప్రసాద్‌ నాయుడు అలియాస్‌ గుట్టబాబు దాడి చేసినట్లు బాధితుడు ఆరోపించారు. ఈ ఘటనలో గాయపడిన రెడ్డప్ప ప్రస్తుతం రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గతంలో ఎంపీటీసీ అభ్యర్థిగా నామినేషన్‌ వేసేందుకు ప్రయత్నించినప్పుడు కూడా తనపై దాడి చేసి అడ్డుకున్నారని ఆయన ఆరోపించారు. పోలీసుల నుంచి తనకు ఎలాంటి రక్షణ లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి పార్టీల మధ్య సఖ్యత మాటలకే పరిమితమైందా? అన్న చర్చ మరోసారి మొదలైంది. 

ఇదీ చదవండి: పల్లెల్లోనూ అదే పైత్యం

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement