మండలదీక్షకు వేళాయే..! | Mandala Pooja 2026: Sabarimala Yatra Ayyappa Vratham Preparation | Sakshi
Sakshi News home page

మండలదీక్షకు వేళాయే..!

Nov 15 2026 11:08 AM | Updated on Nov 15 2026 11:19 AM

Mandala Pooja 2026: Sabarimala Yatra Ayyappa Vratham Preparation

కేరళలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన శబరిమల శ్రీ ధర్మశాస్త అయ్యప్ప స్వామి ఆలయంలో 2026 సంవత్సరానికి సంబంధించిన మండల మకర విళక్కు తీర్థయాత్రకు నవంబర్ 16వ తేదీ సోమవారం ఆలయ ద్వారాలు తెరుచుకోనున్నాయి. నవంబర్ 17వ తేదీ మంగళవారం నుంచి మండల మాసం ప్రారంభమవుతుంది. శబరిమలలో శ్రీ అయ్యప్ప స్వామి ఆరాధనకు అత్యంత విశిష్టమైనది మండల కాలం. 

ఈ పవిత్ర కాలంలో భక్తులు 41 రోజుల పాటు మండల దీక్షను ఆచరిస్తారు. అయ్యప్ప మాలను ధరించి, బ్రహ్మచర్యం, సాత్విక ఆహారం, ఇంద్రియ నిగ్రహం, నిత్య పూజలు, భజనలు, హరిహరసుతుని నామస్మరణతో ఆధ్యాత్మిక జీవితాన్ని గడుపుతారు. అయ్యప్ప స్వామి మాలను గురుస్వామి చేతుల మీదుగా ధరించడం. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం పూజలు చేయడం. 

సాత్విక ఆహారాన్ని మాత్రమే స్వీకరించడం. కోపం, అసూయ, అహంకారాలకు దూరంగా ఉండటం. సత్యం, బ్రహ్మచర్యం, అహింస పాటించడం. స్వామియే శరణం అయ్యప్ప అనే నామస్మరణ చేయడం. మండల దీక్ష అనేది కేవలం నలభై ఒక్క రోజుల పాటు పాటించే నియమం మాత్రమే కాదు. అది మనిషి తన మనస్సును పవిత్రం చేసుకొని, కోరికలను అదుపులో ఉంచుకొని, ఇంద్రియ నిగ్రహాన్ని అలవర్చుకొని, క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడపడానికి చేసే ఆధ్యాత్మిక సాధన. 

ఈ దీక్ష ద్వారా సహనం, భక్తి, వినయం, సమానత్వ భావనలను అలవర్చుకుంటూ అహంకారాన్ని విడిచిపెట్టి భగవంతుని సన్నిధికి చేరువ కావడమే అసలైన లక్ష్యం. స్వామి సన్నిధికేళ్లే ప్రయాణం కంటే మనలోని చెడు ఆలోచనలను జయించి మనస్సును దైవమయం చేసుకోవడమే నిజమైన అయ్యప్ప దీక్ష.

ఇదీ చదవండి: శరవేగంగా కరిమల–పంబ సాంప్రదాయ అటవీ రహదారి పనులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement