హైదరాబాద్‌లో కోటి దీపోత్సవం.. భక్తిపారవశ్యంలో ఎన్టీఆర్‌ స్టేడియం! | Hyderabad Koti Deepotsavam Celebrations-2026 | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో కోటి దీపోత్సవం.. భక్తిపారవశ్యంలో ఎన్టీఆర్‌ స్టేడియం!

Nov 15 2026 8:08 AM | Updated on Nov 15 2026 8:32 AM

Hyderabad Koti Deepotsavam Celebrations-2026

హాజరైన హైకోర్టు న్యాయమూర్తి

జస్టిస్‌ సూరేపల్లి నందా

కార్తీక మాసాన్ని పురస్కరించుకొని రచన టెలివిజన్‌ ఆధ్వర్యంలో శనివారం ఎన్టీఆర్‌ స్టేడియంలో కోటి దీపోత్సవం ఘనంగా ప్రారంభమైంది. ముఖ్యఅతిథిగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సూరేపల్లి నందా హాజరై కార్తీక దీపాలు వెలిగించారు.

ఈ సందర్భంగా కోటి దీపోత్సవ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బంగారు శివలింగానికి 108 మంది భక్తులతో పంచ హారతులు ఇచ్చారు. అనంతరం కాళేశ్వరం శ్రీ ముక్తేశ్వర స్వామి కళ్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. పుష్పగిరి మహాసంస్థానం పీఠాధిపతి విద్యాశంకర భారతి స్వామి భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తిపారవశ్యంలో ముంచెత్తాయి.
– కవాడిగూడ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement