హైదరాబాద్‌లో మరో కొత్త రవాణా వ్యవస్థ.. పాడ్‌కార్‌ వచ్చేస్తోంది! | Hyderabad Pod Car PRTS Project | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో మరో కొత్త రవాణా వ్యవస్థ.. పాడ్‌కార్‌ వచ్చేస్తోంది!

Nov 15 2026 8:05 AM | Updated on Nov 15 2026 8:05 AM

Hyderabad Pod Car PRTS Project

పాడ్‌కార్‌పై క్షేత్రస్థాయి సర్వే...

మూడు మార్గాల్లో సాధ్యాసాధ్యాలపై అధ్యయనం

తొలుత కూకట్‌పల్లి– రాయదుర్గం కారిడార్‌కు బిడ్డింగ్‌

దశలవారీగా మిగతావాటిపై ప్రణాళికలు

హెచ్‌ఎంఆర్‌ఎల్‌ ప్రత్యేక కార్యాచరణ

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పర్సనల్‌ రాపిడ్‌ ట్రాన్సిట్‌ సిస్టమ్‌ (పీఆర్‌టీఎస్‌)పై క్షేత్రస్థాయిలో సర్వేలు నిర్వహించేందుకు హైదరాబాద్‌ మెట్రోరైల్‌ (హెచ్‌ఎంఆర్‌ఎల్‌) సన్నద్ధమవుతోంది. ప్రతిపాదిత మూడు మార్గాల్లో చేపట్టాల్సిన ఎలివేటెడ్‌ గైడ్‌వేల నిర్మాణం, పర్సనల్‌ రాపిడ్‌ ట్రాన్సిట్‌ (పీఆర్‌టీ), గ్రూప్‌రాపిడ్‌ ట్రాన్సిట్‌ (జీఆర్‌టీ)ల ఏర్పాటుకు అనుకూల, ప్రతికూలతలపై  క్షేత్రస్థాయిలో అధ్యయనం చేయనున్నారు.

అనంతరం ప్రాజెక్టు నిర్మాణానికి ఆసక్తిగల అంతర్జాతీయ సంస్థల నుంచి బిడ్డింగ్‌లను ఆహా్వనించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించిన మార్పులకనుగుణంగా క్షేత్రస్థాయి సర్వే నిర్వహించనున్నారు. కేపీహెచ్‌బీ మెట్రోస్టేషన్‌ నుంచి రాయదుర్గం, రహేజా మైండ్‌స్పేస్‌ మీదుగా బయోడైవర్సిటీ వరకు పొడిగించనున్నారు.

ప్రయాణికుల ఆదరణే కీలకం.. 
పాడ్‌కార్‌ ప్రయాణంలో రెండు రకాల సదుపాయాలు ఉంటాయి. కేవలం ఐదారుగురు పయనించేందుకు అవకాశం ఉన్న పాడ్‌కార్‌లను పర్సనల్‌ రాపిడ్‌గా పరిగణిస్తారు. కనీసం  20 మంది కలిసి పయనించేవాటిని గ్రూప్‌ రాపిడ్‌ ట్రాన్సిట్‌లుగా భావిస్తారు. ప్రతిపాదిత మూడు మార్గాల్లో ప్రయాణికుల డిమాండ్, రద్దీకనుగుణంగా పీఆర్‌టీ, జీఆర్‌టీలను ఎంపిక చేయనున్నారు.

రూ.3,400 కోట్ల అంచనాలతో ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టును  పబ్లిక్‌ ప్రైవేట్‌ భాగస్వామ్య (పీపీపీ) పద్ధతిలో నిర్మించి నిర్వహించడమే ఒక సవాల్‌. రాయదుర్గం–కూకట్‌పల్లి, హైటెక్‌ సిటీ–రాయదుర్గం (నాలెడ్జ్‌ సిటీ), కొండాపూర్‌–ఫైనాన్షియల్‌ డి్రస్టిక్ట్‌ రూట్‌లతో పాటు, బేగంపేట్, నెక్లెస్‌రోడ్డు, రాణిగంజ్, ఇందిరాపార్కు, ఎన్టీఆర్‌ గార్డెన్, సెక్రటేరియట్, అసెంబ్లీ తదితర  ప్రాంతాలను అనుసంధానం చేయడమే ప్రాజెక్టులో కీలకం. దీంతో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరగవచ్చని అధికారులు భావిస్తున్నారు.

దశలవారీగా 2050 నాటికి సుమారు 10 లక్షల మందికి పైగా పీఆర్‌టీఎస్‌ను వినియోగించుకొనే అవకాశం ఉన్నట్లు అంచనా. పాడ్‌కార్‌ విజయవంతమయ్యేందుకు ప్రయాణికుల ఆదరణే కీలకమని అధికారులు భావిస్తున్నారు.

ఇదీ చదవండి: AP: రోడ్డు ప్రమాదం.. తెలంగాణ ఐఏఎస్‌కు గాయాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement