ఇరకాటంలో టీవీకే..! | TVK MLA Arul Vignesh Served Police Summons In Woman Collector | Sakshi
Sakshi News home page

ఇరకాటంలో టీవీకే..!

Nov 25 2026 11:29 AM | Updated on Nov 25 2026 11:31 AM

TVK MLA Arul Vignesh Served Police Summons In Woman Collector

మహిళా జిల్లా కలెక్టర్‌కు అసభ్యకరమైన సందేశాలు పంపి, వేధింపునకు గురిచేసిన ఆరోపణలపై కళ్లకురిచ్చి  ఎమ్మెల్యే అరుళ్‌ విఘ్నేష్‌ రూపంలో టీవీకేకు తలవంపులు తప్పలేదు. గత కొద్ది రోజులుగా దుమారం రేగుతూ వచ్చిన ఈ కేసులో మంగళవారం కీలక మలుపు తిరిగింది. ఎమ్మెల్యేపై కలెక్టర్‌ ఫిర్యాదుతో  పోలీసు యంత్రాంగం కదిలింది. ఆ ఎమ్మెల్యేలపై  కేసు నమోదు చేశారు. ఆల్‌ ఉమెన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదు కావడంతో ఆయనను ఏ క్షణమైనా అరెస్టు చేసే అవకాశం ఉందని పోలీసు వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.

సాక్షి, చెన్నై: రెండు నెలల క్రితం కళ్లకురిచ్చి నియోజకవర్గ ఎమ్మెల్యే అరుల్‌  విఘ్నేష్,ఆ జిల్లా కలెక్టర్‌కు అసభ్యకరమైన రీతిలో టెక్స్‌›్ట మెసేజ్‌లు పంపడమే కాకుండా, ఆమెను వెంబడిస్తూ వేధించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ వ్యవహారం అప్పట్లో మీడియా, సోషల్‌ మీడియాలో తీవ్ర దుమారం రేపింది. ఎమ్మెల్యేపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ డీఎంకే, అన్నాడీఎంకే, బీజేపీ, డీఎండీకేలతో సహా టీవీకే ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న సీపీఎం, సీపీఐలు సైతం పట్టుబడుతూ వచ్చాయి. వ్యవహారం కోర్టుకు సైతం చేరడంతో కలెక్టర అధికారికంగా ఎలాంటి ఫిర్యాదు చేయలేదంటూ పోలీసు యంత్రాంగం వివరణ ఇచ్చింది. అదే సమయంలో మంగళవారం ఉదయం కలెక్టర్‌ తనకు అరుల్‌  విఘ్నేష్‌ అవాంఛిత, అసభ్యకరమైన సందేశాలు పంపి అనుచితంగా ప్రవర్తించారని జిల్లా ఎస్పీకి  లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా మహిళలపై వేధింపుల నిరోధక చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. 

మూడు సెక్షన్ల కింద కేసు.. 
ఈ ఘటనపై స్పెషల్‌ సబ్‌–ఇన్‌స్పెక్టర్‌ లోకేశ్వరన్‌ నేతృత్వంలోని పోలీసు బృందం కళ్లకురిచ్చిలోని ఎమ్మెల్యే నివాసానికి వెళ్లి ప్రాథమిక విచారణ జరిపింది. అనంతరం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కళ్లకురిచ్చి మహిళా పోలీస్‌ స్టేషన్‌లో ఎమ్మెల్యే అరుళ్‌ విఘ్నే‹Ùపై  సెక్షన్లు 75, 78, 79 కింద ఎఫ్‌ఐఆర్‌ నమో దు చేశారు. లైంగికంగా అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడం, మహిళ ఆసక్తి లేదని స్పష్టం చేసినా పదేపదే సంప్రదించడానికి ప్రయత్నించడం, ఆమె ఈ–మెయిల్, ఇతర ఎల్రక్టానిక్‌ కమ్యూనికేషన్లను నిరంతరం పర్యవేక్షించడం (స్టాకింగ్‌), ఆమె గౌరవానికి భంగం కలిగించేలా పదాలను ఉపయోగించడం , వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడం వంటి తీవ్రమైన అభియోగాలను ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. 

హైకోర్టు సీరియస్‌.. ఐజీ పర్యవేక్షణకు ఆదేశాలు..  
మరోవైపు ఈ ఘటనపై అన్నాడీఎంకే  మహిళా న్యాయవాది ఆర్‌. త్రిశూలి మద్రాస్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా, ఎమ్మెల్యేపై ఇప్పటికే కేసు నమోదు చేసినట్లు తమిళనాడు ప్రభుత్వం కోర్టుకు నివేదించింది. దీనిపై స్పందించిన మద్రాస్‌ హైకోర్టు, ఈ కేసు దర్యాప్తును స్వయంగా పర్యవేక్షించాలని ఉత్తర  జోన్‌ ఐజీని ఆదేశించడం ప్రాధాన్యత సంతరించుకుంది. మహిళా పోలీస్‌ స్టేషన్‌లో నాన్‌–బెయిలబుల్‌ సెక్షన్ల కింద కేసు నమోదు కావడం, హైకోర్టు సైతం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవడంతో ఎమ్మెల్యే అరుల్‌  విఘ్నేష్‌ను పోలీసులు ఏక్షణానైనా అరెస్టు చేసే అవకాశాలు ఉన్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఎవరినీ కాపాడే ప్రయత్నం చేయవద్దు అని,  జూలైలో ఫిర్యాదు అందినప్పుడే ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రభుత్వాన్ని నిలదీసిన న్యాయమూర్తికేసు దర్యాప్తును స్వయంగా పర్యవేక్షించాలని  ఉత్తర  జోన్‌ ఐజీ ప్రవీణ్‌ కుమార్‌ అభినవ్‌ను ఆదేశించారు. 27వ తేదీన నివేదిక సమరి్పంచాలని సూచించారు.  

కేసును సీబీఐకి అప్పగించాలి 
తప్ప చేస్తే కాపాడతామన్న ధీమాతోనే అధికార పార్టీ ఎమ్మెల్యేలు హద్దులు మీరుతున్నారని డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం విజయ్‌  ‘ మీ తమ్ముడ్ని, మేన మామను’ అని డైలాగులు వళ్లిస్తూ వచ్చారని, ఇప్పుడు మహిళా కలెక్టర్‌కు జరిగిన ఈ వ్యవహారంలో తన ఎమ్మెల్యేపై  ఎలాంటి చర్యలు తీసుకోనున్నారని ప్రశ్నించారు. ఈ వేదింపు విషయంగా  నాలుగు నెలల క్రితమే జిల్లా కలెక్టర్‌  ఫిర్యాదు చేశారన్న సంగతి తమరికి తెలియదా? అని నిలదీశారు. జాతీయ మహిళా కమిషన్‌ , మద్రాస్‌ హైకోర్టు న్యాయమూర్తి జోక్యం చేసుకున్న తర్వాతే కలెక్టర్‌ ఫిర్యాదుపై కనీసం ఎఫ్‌ఐఆర్‌ నమోదైందంటే, తమిళనాడులో అసలు పరిపాలన సాగుతోందా లేక మరేదైనా జరుగుతోందా అని ప్రశ్నించారు. 

ఈ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్‌ చేశారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళని స్వామిస్పందిస్తూ, ఈ వ్యవహారం బయటకు తెలిసినా, హైకోర్టులో అసలు అలాంటి ఘటనే జరగలేదని ప్రభుత్వం బుకాయించిందన్నారు. ఇక ఈ వ్యవహారంలో సీఎం విజయ్‌ నోరు విప్పాలని, వివరణ ఇవ్వాలని ప్రధాన ప్రతి పక్ష నేత ఉదయ నిధి స్టాలిన్‌ డిమాండ్‌ చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్‌నాగేంద్రన్, కేంద్ర మాజీ మంత్రి ఎల్‌ మురుగన్, అమ్మమక్కల్‌ మున్నేట్ర కళగం దినకరన్, పీఎంకే అధ్యక్షుడు అన్బుమణిలు స్పందిస్తూ,ఎమ్మెల్యేను అరెస్టు చేయడమేకాకుండా, ఆయనపై పార్టీ పరంగాను చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఇక, టీ ఎన్‌సీసీ «అద్యక్షుడుమాణిక్యంఠాకూర్‌ స్పందిస్తూ,  తప్పుచేసినవారు ఎవరైనా సరే  శిక్షించబాడాల్సిన అవసరం ఉందన్నారు.ఈ పరిణామాలు టీవీకే సర్కారు ఇరకాటంలో పడేసినట్లయ్యింది.   

ఇదీ చదవండి: పవన్‌ కళ్యాణ్‌కు మరోసారి కష్టమే


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement