breaking news
Penguin
-
నరవణే పుస్తకం లీక్: ‘పెంగ్విన్’ను విచారించిన పోలీసులు
న్యూఢిల్లీ: మాజీ సైన్యాధికారి జనరల్ మనోజ్ ముకుంద్ నరవణే రాసిన స్వీయ చరిత్ర (మెమోయిర్) ఇంకా ప్రచురణ కాకముందే బయటకు రావడంపై ఆరా తీసేందుకు ఢిల్లీ పోలీసులు రంగంలోకి దిగారు. గురువారం నాడు ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ విభాగం ‘పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా’ ప్రతినిధులను ఈ అంశంపై విచారించింది. పుస్తకంలోని అంశాలు ఎలా బయటకు వచ్చాయన్న దానిపై వివరణ కోరుతూ పోలీసులు అంతకుముందే పబ్లిషర్లకు నోటీసులు జారీ చేశారు.విచారణలో భాగంగా పోలీసులు అడిగిన కొన్ని కీలక ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు పబ్లిషర్లు కొంత సమయం కోరారు. జనరల్ నరవణే రచించిన ‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’ పుస్తకం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సమయంలో తీవ్ర దుమారం రేపింది. 2020లో భారత్-చైనా సరిహద్దు ప్రతిష్ఠంభనపై ఒక మ్యాగజైన్లో ప్రచురితమైన ఈ పుస్తక సారాంశాన్ని ప్రస్తావిస్తూ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అయితే సదరు పుస్తకం ఇంకా అధికారికంగా విడుదల కాలేదని, అందుకే అందులోని అంశాలను కోట్ చేయడం నిబంధనలకు విరుద్ధమని ప్రభుత్వం స్పష్టం చేసింది.ఈ వివాదం ముదురుతున్న తరుణంలో ప్రచురణ సంస్థ ‘పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా’ సోషల్ మీడియా వేదికగా కీలక వివరణ ఇచ్చింది. 'ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ' పుస్తకానికి సంబంధించిన పూర్తి హక్కులు తమ వద్దే ఉన్నాయని, అయితే ఈ పుస్తకం ఇంకా ప్రచురణ దశకే చేరుకోలేదని సంస్థ స్పష్టం చేసింది. ప్రింట్ రూపంలో కానీ, డిజిటల్ రూపంలో కానీ ఎక్కడా ఈ పుస్తకాన్ని పంపిణీ చేయలేదని, విక్రయించలేదని ‘ఎక్స్’వేదికగా వెల్లడించింది. మీడియాలో వస్తున్న వార్తల నేపథ్యంలో వాస్తవాలను వెల్లడించేందుకే ఈ ప్రకటన చేస్తున్నట్లు పబ్లిషర్లు పేర్కొన్నారు.తన పుస్తకం చుట్టూ జరుగుతున్న చర్చపై మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ నరవణే కూడా స్పందించారు. పబ్లిషర్లు ఇచ్చిన అధికారిక వివరణను ఆయన తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తూ, ప్రస్తుతం పుస్తకానికి సంబంధించిన వాస్తవ పరిస్థితి ఇదేనని నొక్కి చెప్పారు. అసలు ప్రచురణ కాని పుస్తకంలోని సున్నితమైన అంశాలు ఎలా లీక్ అయ్యాయి? దీని వెనుక ఎవరి ప్రమేయం ఉందనే కోణంలో ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ లోతుగా దర్యాప్తు చేస్తోంది. విచారణలో తేలే అంశాలను అనుసరించి తదుపరి చర్యలు ఉంటాయని పోలీస్ వర్గాలు వెల్లడించాయి. -
ఆ రెండు పుస్తకాలు ఒక్కటి కావు
న్యూఢిల్లీ: చైనా బలగాలతో భారత సైన్యం పోరాటానికి సంబంధించి పలు వివాదాస్పద అంశాలను ప్రస్తావిస్తూ భారత ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవణె రాసిన ‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’పుస్తకం చర్చనీయాంశం కావడంతో దాని ప్రచురణసంస్థ ‘పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఇండియా’మంగళవారం స్పష్టతనిచ్చింది. ఆ పుస్తకాన్ని ఇప్పటిదాకా ముద్రించలేదని, ఆన్లైన్ వేదికలపై ప్రత్యక్షమైనదంతా అనధికార కాపీ అని పెంగ్విన్ ర్యాండమ్ వెల్లడించింది. ఈ మేరకు సంస్థ మంగళవారం ఒక ప్రకటన విడుదలచేసింది. ‘‘ప్రీ–ఆర్డర్ అని పేర్కొన్నంత మాత్రాన అది ఇప్పటికే ముద్రితమై అమ్మకానికి సిద్ధంగా ఉందని కాదు. త్వరలో ప్రచురితంకావొచ్చు అని అర్థం. అంతేగానీ పుస్తకం ముద్రించామని మేం ఎక్కడా పేర్కొనలేదు’’అంటూ పుస్తకాలకు సంబంధించి తాము అనుసరించే 4 విధానాలను పెంగ్విన్ ర్యాండమ్ వివరించింది. అవి.. 1. కొత్త పుస్తకాన్ని ప్రకటించం: అంటే కొత్త రచన, నూతన పుస్తకాన్ని ముద్రించాలని నిర్ణయం జరిగిందని అర్థం. అంతేగానీ ఈ పుస్తకం ఇప్పటికే ముద్రితమైందని కాదు. అది ఇంకా ఆన్‌లైన్‌లోకి అందుబాటులోకికూడా రాదు. 2. ప్రీ–ఆర్డర్: ఇది ప్రచురణకు సంబంధించిన ప్రామాణిక అనుసరణీయ విధానం. నచి్చతే పాఠకులు లేదా రిటైల్ సంస్థలు త్వరలో ప్రచురితంకాబోయే ఈ పుస్తకం కోసం ఆర్డర్లు పెట్టుకోవచ్చు. ఈ దశలోనూ పుస్తకం ముద్రితంకాదు. అందుబాటులో ఉండదు. 3. రాబోయే తేదీ ఖరారు: ఫలానా తేదీన పుస్తకాన్ని ఆవిష్కరించాలని నిర్ణయం జరిగిదంతే. అంతమాత్రాన ఆరోజుకల్లా పుస్తకం ముద్రితమైపోతుందని అర్థంకాదు. 4.ముద్రిత పుస్తకం: విక్రయాల కోసం రిటైల్ దుకాణాల్లోకి వచ్చాకే ఆ పుస్తకం అధికారికంగా ముద్రితమైందని భావించాలి. పుస్తకాన్ని ఏరకంగానూ విడుదల చేయలేదు: పెంగ్విన్‘‘నరవణె రాసిన ఈ పుస్తకాన్ని ప్రింట్ లేదా డిజిటల్ లేదా పీడీఎఫ్ ఇలా ఏ ఫార్మాట్లోనూ అందుబాటులోకి తేలేదు. ఒక్క పుస్తకాన్ని కూడా ముద్రించలేదు. ఎవరికీ విక్రయించలేదు. ఆన్లైన్ వేదికలపై ప్రత్యక్షమైనదంతా అనధికార వెర్షన్ మాత్రమే. దానితో మాకు సంబంధం లేదు. పుస్తకం ప్రచురణ హక్కులు మాకే ఉన్నాయి. పుస్తకాన్ని ఏ రూపంలోనూ మేం పంపిణీ చేయలేదు. బహిర్గతంచేయలేదు. ప్రస్తుతం ప్రింట్, డిజిటల్, పీడీఎఫ్ రూపాల్లో షేర్ అవుతుంటేగనక అది పూర్తిగా మా సంస్థ కాపీరైట్ హక్కులను ఉల్లంఘించినట్లే లెక్క. ఈ అంశంలో మేం చట్టపర చర్యలు తీసుకుంటున్నాం’’అని సంస్థ స్పష్టం చేసింది. మౌనం వీడిన నరవణె పుస్తకం వివాదం కావడంతో ఎట్టకేలకు నరవణె మౌనం వీడారు. ఈ పుస్తకం ఇంకా ప్రచురితంకాలేదని ఆయన స్పష్టంచేశారు. ఈ మేరకు సోమవారం పెంగ్విన్ ఇండియా సంస్థ వెల్లడించిన ఒక ప్రకటనను నరవణే మంగళవారం తన సామాజిక మాధ్యమ ‘ఎక్స్’ఖాతాలో పోస్ట్‌చేశారు. ‘‘పుస్తకం తాజా స్థితి ఇదే’’అని దానికి ఒక క్యాప్షన్ పెట్టారు. పుస్తకమొచ్చిందని రెండేళ్ల క్రితమే చెప్పారు: రాహుల్పుస్తకం ప్రచురితంకాలేదన్న పెంగ్విన్ వాదనల్లో నిజంలేదంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ వ్యాఖ్యానించారు. మంగళవారం పార్లమెంట్ ప్రాంగణంలో మీడియాతో రాహుల్ మాట్లాడారు. గతంలో నరవణే చేసిన ట్వీట్‌ను రాహుల్ అందరిఎదుట బయటకు చదివి వినిపించారు. ‘‘హలో ఫ్రెండ్స్. నేను రాసిన పుస్తకం ఇప్పుడు అందుబాటులో ఉంది. ఇక్కడున్న లింక్‌ను క్లిక్‌చేసి చదవండి. ఆనందంగా పఠనం పూర్తిచేయండి. జైహింద్ అని నరవణె రాసుకొచ్చారు. ఇది డిసెంబర్ 2023లో నరవణె ఆయన ‘ఎక్స్’ఖాతాలో పోస్ట్‌చేశారు. పుస్తకం అసలు ప్రచురితంకాలేదని పెంగ్విన్ చెబుతోంది. కానీ ఇప్పటికే ఈ పుస్తకం అమెజాన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది’’అని రాహుల్ అన్నారు. -
నరవణే పుస్తక వివాదం.. పెంగ్విన్ కీలక ప్రకటన
ఢిల్లీ: నరవణే పుస్తకం రాజకీయ దుమారం రేపుతోంది. ఈ బుక్‌పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి వ్యాఖ్యలు చేశారు. ‘‘తన బుక్ అందుబాటులోకి వచ్చిందని నరవణె చెప్పారు. బుక్ విడుదలపై నరవణే అయినా అబద్ధం చెప్పాలి.. లేకపోతే పెంగ్విన్ అయినా అబద్ధం చెప్పాలి. మాజీ ఆర్మీ చీఫ్ అబద్ధం చెబుతున్నారని అనుకోను’’ అంటూ రాహుల్ వ్యాఖ్యానించారు.కాగా, ఆర్మీ మాజీ చీఫ్ ఎం.ఎం.నరవణె పుస్తకం ఉదంతంపై లోక్‌సభలో కొనసాగుతోంది. ఆర్మీ మాజీ చీఫ్ ఎం.ఎం.నరవణె పుస్తకంలోని అంశాలను ప్రస్తావించేందుకు విపక్ష నేత రాహుల్‌గాంధీ ప్రయత్నించడం.. అందుకు మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, అమిత్ షా తీవ్ర అభ్యంతరం తెలపడం రగడకు దారితీసింది. నాటినుంచి సభలో ఆందోళనలు మినహా కార్యకలాపాలేవీ సాగడం లేదు.పెంగ్విన్ ఏం చెప్పిందంటే?ఇదిలాఉండగా.. నరవణే పుస్తక వివాదంపై పెంగ్విన్ సంస్థ వివరణ ఇచ్చింది. మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ ఎం.ఎం. నరవణే రాసిన జ్ఞాపకాల సంకలనం 'ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ'పై పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా కీలక ప్రకటన విడుదల చేసింది. ఈ పుస్తక ప్రచురణకు సంబంధించి తమకే ప్రత్యేక హక్కులు ఉన్నాయని, ఇది ఇప్పటివరకు ఏ రూపంలోనూ అధికారికంగా విడుదల కాలేదని స్పష్టం చేసింది.ముద్రణ రూపంలో గానీ, డిజిటల్ రూపంలో గానీ ఈ పుస్తకాన్ని తాము ఇప్పటివరకు పంపిణీ చేయలేదని.. డిజిటల్ కాపీలు చట్టవిరుద్ధమని, అవి కాపీరైట్ ఉల్లంఘన కిందకు వస్తాయని సంస్థ హెచ్చరించింది. ఇలాంటి అనధికారిక పంపిణీపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపింది.ఢిల్లీ పోలీసుల విచారణమరోవైపు, అధికారికంగా విడుదల కాకముందే ఈ పుస్తకంలోని అంశాలు బయటకు ఎలా వచ్చాయనే దానిపై ఢిల్లీ పోలీసులు ఎఫ్ఆర్ఐ నమోదు చేశారు. స్పెషల్ సెల్ ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తోంది. -
ఎమోషనల్ అవ్వకండి.. ఆ పెంగ్విన్ అసలు కథ ఇదే
-
సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఒంటిరి పెంగ్విన్ వీడియో
-
'ఒంటరి పెంగ్విన్'..ఇంత స్ఫూర్తిని రగిలించిందా..!
ఓ డాక్యుమెంటరీ నుంచి వచ్చిన ఒంటరి నిహిలిస్ట్ పెంగ్విన్ క్లిప్ ఇప్పటికీ వైరల్ అవ్వుతూ స్ఫూర్తిని రగిలిస్తూ..యావత్తు ప్రపంచాన్ని ఆకర్షిస్తోంది. అంతేగాదు అసలేంటీ ఒంటరి పెంగ్విన్ కథ అని నెట్టింట చర్చలు లేవెనెత్తాయి. ఇది తిరుగుబాటుకు, ధైర్యానికి, పట్టుదలకు కేరాఫ్‌గా నిలిచింది. అందరు జీవిస్తారు కానీ ఈ ఎగరలేని పక్షి బతకాలని కోరుకుంటుందంటూ..ప్రేరణను అందించే కథలన్నీ గుట్టుగట్టలుగా ుపుట్టుకొచ్చేస్తుండటం విశేషం. ఇంతకీ ఈ ఒంటరి పెంగ్విన్ వెనుకున్న కథేంటంటే..!.నిజానికి పెంగ్విన్లు గుంపులు గుంపులు సంచరిస్తుంటాయి. కానీ ఇక్కడ వీడియోలోనిపెంగ్విన్ మాత్రం నా దారి రహదారి అంటూ..విభిన్నంగా వెళ్తోంది. అది కూడా అది వెళ్లే రూటు ఆహారం దొరికే ప్రదేశం కానేకాదు. సముద్రం వైపుకి వెళ్తున్న గుంపుని వదిలేసి మరి ఒంటరిగా వెళ్తుండటం అందర్నీ ఆకర్షించింది. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం గ్రీన్‌ల్యాండ్‌ని స్వాధీనం చేసుకుంటారనే బెదిరింపులకు ఆద్యం పోసేలా ఈ ఒంటరి పెంగ్విన్‌ను కలిగి ఉన్న AI- రూపొందించిన చిత్రాన్ని కూడా పంచుకున్నారు. అంతేకాదు చాట్‌జీపీటీ సైతం పెంగ్విన్ ఒంటరిగా అలా ఎందుకు వెళ్తుందో సర్చ్ చేయగా..ఈ క్లిప్ వన్యప్రాణులను చూడలేదని పేర్కొనడం గమనార్హం. 2007లో చిత్రీకరించిన డాక్యుమెంటరీ వీడియోలో అంటార్కిటికాలో చిత్రీకరణ జరుగుతున్నప్పుడు, మనుషులను చూసి భయపడిన పెంగ్విన్ల గుంపు ఆహారం కోసం సముద్రం వైపు పరిగెత్తాయి.కానీ, ఒక్క 'అడిలీ పెంగ్విన్' (Adelie Penguin) మాత్రం ఆహారం కోసం, తన మనుగడ కోసం కాకుండా ఒంటరిగా 70 కి.మీ దూరంలో ఉన్న పర్వతం వైపుకి దూరంగా వెళ్తుండటాన్ని చూపిస్తుంది. ఈ డాక్యుమెంట్‌ని ప్రఖ్యాత దర్శకుడు వెర్నర్ హెర్జోగ్ రూపొందించారు. ఆయన ఈ పెంగ్విన్ వాక్ని డెత్మార్చ్ అని పిలిచాడు. ఎందుకంటే ఆ పెంగ్విన్ పర్వతం వైపుకి వెళ్తే చలికి ప్రాణాలు పోతాయి, పైగా అక్కడ ఆహారం కూడా దొరకదు. వెర్నర్ హెర్జోగ్, ఆ పెంగ్విన్ దారికి అడ్డుగా నిలబడ్డారు. దానిని పట్టుకుని మళ్ళీ పెంగ్విన్ల గుంపులో కలిపారు. View this post on Instagram A post shared by ज़िन्दगी गुलज़ार है ! (@zindagi.gulzar.h) కానీ, ఆ పెంగ్విన్ మాత్రం పట్టుదలతో మళ్ళీ గుంపు నుండి బయటకు వచ్చి అదే పర్వతం వైపు తన ప్రయాణాన్ని కొనసాగించింది. చావు తప్పదని తెలిసినా వెనక్కి తగ్గలేదు. ఆ ెపెంగ్విన్ గుండెధైర్యానికి ఫిదా అయిన నెటిజన్లు తమ జీవితాలతో పోల్చి చూసుకుంటున్నారు. పైగా దాన్నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని అంటుండుంటం విశేషం.గుంపులో గోవింద అన్నట్లుగా కాకుండా స్పెషల్‌గా ఉండాలని, గెలుపో ఓటమో తనకంటూ ఒక ప్రత్యేక మార్గాన్ని ఎంచుకోవడం ఎలా అనేందుకు ఈ పెంగ్విన్ ఒక రోల్‌మోడల్ అని కొందరు చెబుతున్నారు. మరి ొకొందరు ఈ పెంగ్విన్ డిప్రెషన్లో ఉందంటూ భావోద్వేగంగా పోస్టులు పెట్టారు. ాకానీ ఎక్కువమంది మాత్రం ఎగరలేని పక్షి అయినప్పటికీ..కాలినడకన పర్వత శిఖరాన్ని అందుకోవాలనే పట్టుదలకు సలాం అంటూ కితాబులు ఇచ్చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by @reels.olizzzz (చదవండి: కొండల నుంచి సభకు..!) -
ప్రపంచాన్ని కదిలించిన పెంగ్విన్ కథ ఇదే
-
...పెంగ్విన్ ఒంటరి నడక
అది అంతులేని మంచు ఎడారి. ఎటు చూసినా గడ్డకట్టే చలి.. ప్రాణవాయువు కూడా భారమయ్యే శూన్యం. అక్కడ వందలాది పెంగ్విన్లు గుంపులు గుంపులుగా ఆహారం కోసం సముద్రం వైపు పరుగులు తీస్తున్నాయి. కానీ, ఒక్క పెంగ్విన్ మాత్రం వెనక్కి తిరిగింది. అందరూ వెళ్తున్న బాటను వదిలేసింది. చావు ఎదురొస్తుందని తెలిసినా.. మంచు కొండల వైపు ఒంటరిగా అడుగులు వేస్తోంది.ఏమిటీ ’నిహిలిస్ట్ పెంగ్విన్’ మిస్టరీ? ఇటీవల టిక్‌టాక్, ఇన్‌స్టా్రగామ్‌లో ఈ వీడియో ప్రత్యక్షమవ్వగానే.. నెటిజన్లు దీనికి ‘నిహిలిస్ట్ పెంగ్విన్’అని పేరు పెట్టారు. ‘నిహిలిజం’అంటే ‘ఈ ప్రపంచంలో దేనికీ అర్థం లేదు, ఏ విలువలకు ప్రాధాన్యం లేదు’అనే ఒక తాతి్వక చింతన. ‘నేను ఎక్కడికి వెళ్లినా చివరికి మిగిలేది శూన్యమే కదా’.. అనే భావనలో ఉన్నవారు, ఆ పెంగ్విన్ ప్రయాణంలో తమను దర్శించుకుంటున్నారు. ‘నేను కూడా ఈ పెంగ్విన్ లాగే ఉన్నాను.. అందరిలా పరుగెత్తలేక ఎటో తెలియని ప్రయాణం చేస్తున్నాను’.. అంటూ లక్షలాది మంది నెటిజన్లు తమ భావోద్వేగాలను దీనికి ముడిపెడుతున్నారు.అది ‘మృత్యుయాత్ర’ప్రఖ్యాత దర్శకుడు వెర్నర్ హెర్జోగ్ 2007 అంటార్కిటికాలో తన డాక్యుమెంటరీ కోసం చిత్రీకరించిన ఈ దృశ్యం ఇప్పుడు సోషల్ మీడియాలో కన్నీళ్లు పెట్టిస్తోంది. సముద్రం వైపు వెళ్తేనే దానికి ఆహారం దొరుకుతుంది, ప్రాణం నిలుస్తుంది. కానీ, ఆ పెంగ్విన్ తన గమ్యాన్ని మార్చుకుంది. ఎవరూ లేని, ఏమీ దొరకని నిర్జన పర్వతాల వైపు అది సాగిస్తున్న ప్రయాణాన్ని దర్శకుడు ‘మృత్యు యాత్ర’అని పిలిచాడు. ఎందుకంటే, ఆ దారిలో దానికి ఎదురయ్యేది కేవలం మరణం మాత్రమే. గుండె బరువెక్కుతోంది జనవరి 16న ఒక టిక్‌టాక్ యూజర్ ఈ వీడియోను ఎడిట్ చేసి ‘లామోర్ టూజూర్’అనే పాటను జత చేయడంతో అది విశ్వవ్యాప్తంగా కదిలిస్తోంది. ఇది ఒక ఫ్రెంచ్ పేరు. తెలుగులో దీని అర్థం ‘శాశ్వతమైన ప్రేమ’లేదా ‘ఎప్పటికీ నిలిచి ఉండే ప్రేమ’. ఆ గంభీరమైన సంగీతం, పెంగ్విన్ వేస్తున్న ఆ నిశ్శబ్ద అడుగులు చూస్తుంటే గుండె బరువెక్కక మానదు. చివరికి ఆ పెంగ్విన్ ఏమౌతుందో అందరికీ తెలుసు. అది తిరిగి రాదు. కానీ, ఆ ప్రయాణం మనిషికి ఒక నిశ్శబ్ద సత్యాన్ని బోధిస్తోంది. బతుకు పోరాటంలో అలిసిపోయిన ఆత్మలకు ఆ పెంగ్విన్ ఒక మూగ సాక్ష్యం. ఇది కేవలం ఒక పక్షి నడక కాదు.. ప్రతి మనిషి లోపల దాగి ఉన్న ఒక నిశ్శబ్ద ఆవేదన.– సాక్షి, నేషనల్ డెస్క్ -
ట్రెండింగ్‌లో 'ఒంటరి పెంగ్విన్'.. ఇంతకీ ఏంటి దీని స్టోరీ?
గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో 'పెంగ్విన్' స్టోరీ ఒకటి తెగ వైరల్ అవుతోంది. కొన్ని పెంగ్విన్స్ గుంపుగా సముద్రం వైపు వెళ్తుండగా.. ఒకటి మాత్రం ఒంటరిగా మంచు పర్వతాల్లోకి వెళ్తున్న వీడియో ఇది. చాలామంది దీనికి రిలేట్ అవుతున్నారు. తమని తాము ఆ ఒంటరి పెంగ్విన్‌లో చూసుకుంటున్నారు. ఇంతకీ ఈ సింగిల్ పెంగ్విన్ స్టోరీ ఏంటి? అసలేమైంది?(ఇదీ చదవండి: శోభిత 'చీకటిలో' సినిమా రివ్యూ)పెంగ్విన్ వీడియో.. సాధారణ వైరల్ వీడియో అయితే కాదు. దీని వెనక పెద్ద బ్యాక్ స్టోరీనే ఉంది. టాలీవుడ్ దర్శకుడు పూరీ జగన్నాథ్ ఐదేళ్ల క్రితం తన మ్యూజింగ్స్‌లో ఒంటరి పెంగ్విన్ గురించి చెప్పుకొచ్చాడు. సందర్భం ఏంటో తెలీదు గానీ ఇప్పుడు మరోసారి అది వైరల్ అవుతోంది. అంటార్కిటికాలో పెంగ్విన్స్ అన్నీ నివసిస్తుంటాయి. వీటి జీవన విధానం చాలా సింపుల్. సముద్రంలో ఉంటాయి. లేదంటే కాలనీల్లో ఉంటూ మిగతా పెంగ్విన్స్‌తో కలిసి పిల్లల్ని కంటూ ఉంటాయి. ట్రెండింగ్ అవుతున్న ఒంటరి పెంగ్విన్ వెనక మాత్రం కళ్లు చెమర్చే కథ ఉందట! మనుషులకే పరిమితమైన ప్రేమ, విరహం, వైరాగ్యం అనే ఎమోషన్స్ మూగజీవుల్లోనూ ఉంటాయని ఈ పెంగ్విన్ స్టోరీ చెప్పకనే చెబుతోంది.డైరెక్టర్ పూరీ జగన్నాథ్ చెప్పిన దానిబట్టి చూస్తే.. సాధారణంగా మగ పెంగ్విన్ తన భాగస్వామి పట్ల చాలా నమ్మకంగా ఉంటుంది. ఒకసారి జత కుదిరితే చనిపోయే వరకు ఆ బంధాన్ని వదులుకోదు. ఒకవేళ ఆడ పెంగ్విన్.. ఆ నమ్మకాన్ని వంచిస్తే లేదా బంధాన్ని బ్రేక్ చేస్తే మాత్రం మగ పెంగ్విన్ ఆ వియోగాన్ని తట్టుకోలేదు. ఈ ఒంటరి పెంగ్విన్ కూడా అలానే బంధం నుంచి దూరమైనట్లు తెలుస్తోంది. అందుకే మిగతా వాటితో కాకుండా ఒంటరిగా పర్వతాల వైపు వెళ్లదలుచుకున్నట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ హిట్ 'సర్వం మాయ'.. తెలుగులో స్ట్రీమింగ్)ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పెంగ్విన్ వీడియో బిట్.. 2007లో ప్రఖ్యాత దర్శకుడు వెర్నర్ హెర్జోగ్ తీసిన 'ఎన్కౌంటర్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్' అనే డాక్యుమెంటరీలోనిది. పరిశోధకుడు డాక్టర్ ఐన్లీతో కలిసి వెర్నర్.. అంటార్కిటికాలో ఓ పెంగ్విన్ గుంపుని గమనించినప్పుడు.. ఈ ఒంటరి పెంగ్విన్ని చూశారు. మిగతా పెంగ్విన్లు అన్నీ సముద్రం వైపు ఆహారం కోసం కదులుతుంటే..ఈ ఒంటరి పెంగ్విన్ మాత్రం కాసేపు అక్కడే ఆగిపోయింది. వెనక్కి తిరిగి దాదాపు 70 కిలోమీటర్లు దూరంలో ఉన్న మధ్యభాగం వైపు నడవటం మొదలుపెట్టింది. అది దారితప్పిందేమో అనుకుని తీసుకొచ్చి గుంపులో కలిపినా తిరిగి పర్వత ప్రాంతాల వైపు వెళ్లింది. దీంతో ఏదో విషయంలో అది మోసపోయిందని, జీవితంలో బాగా విసిపోయిందని.. అందుకే ఒంటరి దారిని ఎంచుకుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు మాత్రం ప్రేమలో విఫలమైందని అంటున్నారు.సోషల్ మీడియా.. ఈ ఒంటరి జీవికి 'నిహిలిస్ట్ పెంగ్విన్' అని పేరు పెట్టింది. ప్రస్తుతం జీవితం చాలా ఒత్తిడిగా మారిపోయిందని భావించే చాలామంది.. తమని తాము ఈ పెంగ్విన్‌లో చూసుకుంటున్నారు. ఎమోషనల్ అవుతున్నారు. పోటీతత్వం, బాధ్యతలు, జీవితంలో అలసట వల్ల 'ఇక చాలు' అని విషయాన్ని ఆ పెంగ్విన్ ప్రవర్తన ప్రతిబింబిస్తోందని మాట్లాడుకుంటున్నారు. ఏదేమైనా ఓ ఒంటరి పెంగ్విన్ వీడియో.. ఇంతలా సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటం విశేషమే!(ఇదీ చదవండి: మృణాల్-ధనుష్ పెళ్లి చేసేశారు.. వీడియో వైరల్)The Original 🐧 Story 🙂#penguin pic.twitter.com/TR6L5Adm7Q— THE LITTLE SQUIRREL 🇮🇳🚩🐿️⚡️ (@ReadwithLS) January 23, 2026 -
అత్యంత అరుదైన పెంగ్విన్..!
ఫొటోలో కనిపిస్తున్నది ప్రపంచంలోనే చాలా అరుదుగా కనిపించే పెంగ్విన్. పూర్తి నలుపు రంగులో కనిపించే ఇలాంటి పెంగ్విన్స్‌ను ‘మెలనిస్టిక్ పెంగ్విన్స్’ అని, ‘ఆల్ బ్లాక్ పెంగ్విన్స్’ అని అంటారు. బెల్జియన్ వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ వైవ్స్ ఆడమ్స్, దక్షిణ జార్జియా ద్వీపంలోని సెయింట్ ఆండ్రూస్ బే వద్ద ఈ అరుదైన పెంగ్విన్ ఫొటో తీశాడు. సాధారణంగా పెంగ్విన్లు నలుపు, తెలుపు రంగుల్లో ఉంటాయి. కౌంటర్ షేడింగ్ అనే మభ్యపెట్టే పద్ధతిలో భాగంగా పెంగ్విన్లకు ఈ రంగులు సహజంగా ఉంటాయి. పెంగ్విన్లు ఈత కొడుతున్నప్పుడు, తెలుపు భాగం ప్రకాశవంతమైన నీటితో కలసిపోయి, ఇతర జంతువుల నుంచి రక్షించుకునేందుకు సహాయపడుతుంది. అయితే, పూర్తి నల్లటి ఈకలతో కప్పబడి ఉండే ఈ రకం పరిస్థితిని మెలనిజం అని పిలుస్తారు. శరీరం మెలనిన్‌ను ఎక్కువగా ఉత్పత్తి చేసినప్పుడు, చర్మం లేదా వెంట్రుకలు నల్లగా ఉంటాయి. ‘నేను పూర్తి మెలనిస్టిక్ పెంగ్విన్‌ను చూసి చాలా సంతోషించాను. దూరం నుంచి చాలా నల్లగా ఉంటుంది, కాని దగ్గరగా వచ్చినప్పుడు దాని మెడ, బొడ్డుపై కొన్ని గుర్తులు ముదురాకుపచ్చగా ఉన్నాయి’ అని ఆడమ్స్ చెప్పాడు. నిజానికి ఆడమ్స్ వింతగా కనిపించే పెంగ్విన్ ఫొటో తీయటం ఇది రెండోసారి. 2021లో, ఇదే ప్రాంతంలో మునుపెన్నడూ చూడని పసుపు రంగు పెంగ్విన్ ఫొటో తీశాడు ఆడమ్స్. (చదవండి: ఆ జత జాడీలతో ఓ కుటుంబం రాత్రికి రాత్రే కోట్లకు పడగలెత్తింది..!) -
ఎంఆర్ఐ స్కాన్ చేయించుకున్న ప్రపంచంలోనే తొలి పక్షి ఏంటో తెలుసా!
పక్షులకు, జంతువులకు ఏదైన సమస్య వస్తే మనుషుల మాదిరి ఆస్పత్రులకు వెళ్లడం, చికిత్స చేయించుకోవడం వంటివి ఉండవు. ప్రత్యేకంగా పెంచుకుంటేనో లేక పార్క్‌లో ఉంటేనో వాటి సంరక్షకులు వాటి బాగోగులు గమనించి వెటర్నరీ ఆస్పత్రులకు తీసుకువెళ్లడం జరుగుతోంది. వాటికి మహా అయితే ట్రీట్మెంట్ చేసి పంపిచేస్తారు గానీ స్కానింగ్‌లు వంటి ఉండవు. కానీ తొలిసారిగా ఒక పక్షి ఎంఆర్ఐ స్కాన్ చేయించుకుంది. ఇలాంటి స్కానింగ్ చేయించుకున్న తొలి పక్షిగా కూడా నిలిచింది. వివరాల్లోకెళ్తే..న్యూజిలాండ్ రాజధాని వెల్లింగ్టన్లోని అడ్వెంచర్ పార్క్‌లో ఉంటున్న చకా అనే పెంగ్విన్ పక్షి నిలబడటం, కదలికలకు సంబదించిన సమస్యలు ఎదుర్కొంటోంది. అందుకు గల కారణాలేంటో తెలుసుకునేందుకు వెటర్నరీ డాక్టర్లు పలు పరీక్షలు నిర్వహించారు. ఐతే ఎందువల్ల ఈ సమస్యను ఎదర్కొంటుందనేది తెయకపోవడంతో దానికి ఎంఆర్ఐ స్కానింగ్ చేయాలని నిర్ణయించారు వైద్యులు. అందులో భాగంగా ఈ చకా అనే పెంగ్విన్‌కి ఎంఆర్ఐ స్కాన్ చేయగా..అది ఏ మాత్రం భయపడకుండా ఏం జరుగుతుందా అని నిశితంగా గమనించింది. ఈ పరీక్షల తదనంతరం నెమ్మదిగా బ్యాలెన్స్ అవ్వడం, మిగతా పెంగ్విన్ పక్షుల మాదిరి చకచక నడవడం వంటివి చేయగలుగుతోంది. ప్రస్తుతం దాని ఆరోగ్య పరిస్థితి కూడా నిలకడగానే ఉందని అడ్వెంచర్ పార్క్ పేర్కొంది. దీంతో ప్రపంచంలోనే తొలిసారిగా ఎంఆర్ఐ స్కానింగ్ చేయించుకున్న తొలిపక్షి. ఈ స్కానింగ్ ప్రక్రియ అనేది సముద్ర జాతికి చెందిన పక్షులు, జంతువుల తోపాటు అభయరణ్యాలు, పార్క్‌ల్లో పెరిగే జంతువులు వంటి వాటి గురించి మరింత లోతుగా అధ్యయనం చేయడానికి ఎంతగానో ఉపకరిస్తుందని అంటున్నారు వైద్యులు. (చదవండి: అనూహ్యంగా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్..నలుగురు ప్రయాణికులు అరెస్టు) -
బీవీఆర్ మోహన్ రెడ్డి ‘ఇంజనీర్డ్ ఇన్ ఇండియా’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సైయంట్ వ్యవస్థాపకులు బీవీఆర్ మోహన్ రెడ్డి రచించిన ‘ఇంజినీర్డ్ ఇన్ ఇండియా–ఫ్రమ్ డ్రీమ్స్ టు బిలియన్ డాలర్ సైయంట్’ పుస్తకాన్ని పెంగ్విన్ ఇండియా ప్రచురించింది. ఓ వ్యాపారవేత్తగా ఎదగాలని, దేశ నిర్మాణంలో తన వంతు పాలుపంచుకోవాలని కలలుకంటూ ఐఐటీ కాన్పూర్ నుంచి 1974లో బయటకు అడుగుపెట్టిన ఓ యువకుని సాహసోపేత కథ ఇది అని పెంగ్విన్ తెలిపింది. భారత్‌లో స్వేచ్ఛాయుత వాణిజ్యానికి ముందు అనుభవలేమి, మూలధన అవసరాలను సమకూర్చుకోవడమనే అవరోధాలను సైతం అధిగమించి మోహన్ రెడ్డి సాగించిన స్ఫూర్తిదాయక ప్రయాణాన్ని ఇది వెల్లడిస్తుందని వివరించింది. -
పెంగ్విన్ ఆర్ట్
పెంగ్విన్ పెయింటింగ్స్ గీసిన చిత్రకారులెందరినో చూసుంటారు. కానీ పెయింటింగ్ వేసే పెంగ్విన్ ఒకటుంది. అద్భుతమైన చిత్రాలను గీయడమే కాదు... వాటితో ఓ ప్రదర్శన కూడా ఏర్పాటయ్యింది. నమ్మశక్యంగా లేకపోయినా ఇది నిజం. యూకేలోని హెల్స్టన్ సమీపంలో ఉన్న ‘గ్వీక్ కార్నిష్ సీల్ సంరక్షణ కేంద్రం’లో స్క్విడ్జ్ అనే పెంగ్విన్ ఉంది. అది తన పాదముద్రలతో అద్భుతమైన పెయింటింగ్స్ గీసింది. ఆ చిత్రాలను పెన్జేన్స్లో జాతీయ, అంతర్జాతీయంగా ప్రముఖ చిత్రకారుల ప్రదర్శనలు జరిగే... ‘దఎక్సే్ఛంజ్’ ఆర్ట్ గ్యాలరీలో ప్రదర్శించారు. ఇలా పెంగ్విన్ గీసిన చిత్రాలతో యూకేలో ఎగ్జిబిషన్ జరగడం మొదటిసారి. ఆ పెయింటింగ్స్‌ను ‘ఫండ్ అవర్ ఫ్యూచర్’ పేరుతో https://uk.givergy. com/sealsanctuary వేలంలో కూడా పెట్టారు. వేలంలో పాల్గొనలేనివాళ్లు... ఇదే వెబ్సైట్లో టికెట్ కొంటే ప్రతి ఇద్దరిలో ఒకరు స్క్విడ్జ్ గీసిన చిన్న చిన్న ఆర్ట్ పీస్‌లను గెలుచుకోవచ్చు. ఇలా వచ్చిన డబ్బును సంరక్షణ కేంద్రం అభివృద్ధి, జంతువుల సంక్షేమం కోసం ఉపయోగించనున్నారు. -
నీనా గుప్తా ఆత్మకథ..‘నిజం చెప్పాలంటే’
తన జీవితాన్నితాను ఇష్టపడినట్టుగా జీవించడానికి తన మార్గాన్ని కొనసాగించడానికి ఎప్పుడూ ధైర్యాన్ని ప్రదర్శిస్తూ వచ్చిన నటి నీనా గుప్తా తన ఆత్మకథ ‘సచ్ కహూ తో’ వెలువరించింది. సినిమా అభిమానుల కంటే స్త్రీలు తప్పక చదవాల్సిన ఆత్మకథ కావచ్చు ఇది. పెంగ్విన్ సంస్థ ఇటీవల ప్రచురించిన నటి నీనా గుప్తా ఆత్మకథ ‘సచ్ కహూ తో’ (నిజం చెప్పాలంటే) సినిమా అభిమానులను, పాఠకులను కుతూహల పరుస్తోంది. అందులో నీనా గుప్తా తన జీవితంలోని అనేక అంశాలను ‘దాదాపుగా నిజాయితీ’తో చెప్పే ప్రయత్నం చేసిందని విమర్శకులు అంటున్నారు. అందులో కొన్ని విశేషాలు: సతీష్ కౌశిక్‌తో పెళ్లి ‘నటుడు సతీష్ కౌశిక్ నాకు కాలేజీ రోజుల నుంచి తెలుసు. స్నేహితుడు. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో నేను చేరడానికి కారణం అతడే. ముంబైలో నాకు అండా దండగా ఉండేవాడు. నేను వివియన్ రిచర్డ్స్‌తో గర్భం దాల్చి మసాబాకు జన్మనిచ్చాక సతీష్ ‘నన్ను పెళ్లి చేసుకో. నీ బిడ్డకు తండ్రిగా నా పేరు ఉంటుంది’ అన్నాడు. నా కోసం తన జీవితాన్ని త్యాగం చేయడానికి సిద్ధపడ్డాడు. సింగిల్ మదర్‌గా నేను, తండ్రి లేని పిల్లగా నా కూతురు మనలేరు అని అతడు నా కోసం బాధ పడ్డాడు.’ అని రాసింది నీనా. బయటపడ్డ ప్రాణాలు ‘మసాబా పుట్టిన మూడు నెలలకే నేను పని చేయడం మొదలెట్టాను. ది స్వోర్డ్ ఆఫ్ టిపూ సుల్తాన్ సీరియల్లో చిన్న పాత్ర దొరికింది. అది చేస్తున్నప్పుడే సెట్స్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. సంజయ్ ఖాన్ సకాలంలో స్పందించి మంటలార్పే ప్రయత్నంలో తనూ సగం కాలిపోయాడు. సెట్ బయట మసాబా ఉందప్పుడు. తనకు ఆరోగ్యం బాగలేదు. ఎలా ఉందో చూద్దామని నేను బయటకు వెళ్లినప్పుడే ప్రమాదం జరగడంతో బతికిపోయాను. ఆ ప్రమాదంలో 55 మంది చనిపోయారు’ అని రాసిందామె. సుభాష్ ఘాయ్ ‘చోలీ’ ‘ఖల్ నాయక్ సినిమాలో చోలీ కే పీఛే క్యాహై పాటలో నేను, మాధురి నటించాలి. నాకు రాజస్థాని డ్రస్ వేసి తీసుకువెళ్లి చూపించారు. ఆయనను నన్ను చూసి హతాశుడై ‘నో.. నో.. ఏదైనా కొంచెం నింపి తీసుకురండి’ అన్నాడు. ఇది నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. అతడు నా వక్షం నిండుగా ఉండాలని సూచించాడు. ఇందులో వ్యక్తిగతం ఏమీ లేదు. దర్శకుడిగా తనకు ఏది కావాలో ఆ ఊహకు తగినట్టుగా నేను ఉండాలనుకున్నాడు. ఆ రోజు షూటింగ్ జరగలేదు. మరుసటి రోజు ప్యాడెడ్ బ్రా వేసి నా కాస్ట్యూమ్స్ సిద్ధం చేశారు. అప్పుడు అతను సంతృప్తి చెందాడు. మంచి దర్శకుడు రాజీపడడు. సుభాష్ ఘాయ్ అందుకే మంచి దర్శకుడు’ అని రాసిందామె. ఇలాంటివే అనేక విశేషాలు ఆమె ఆత్మకథలో ఉన్నాయి. ∙ -
నెటిజన్లను మెప్పిస్తున్న పెంగ్విన్లు: వైరల్ వీడియో
మిస్సౌరీ: పెంగ్విన్లు ప్రధానాంశంగా పుస్తకాలు, సినిమాలు, డాక్యుమెంటరీలు చాలానే వచ్చాయి. కార్టూన్లు, టెలివిజన్ డ్రామాలు వినోదాన్ని పంచాయి. వీటి నడక, నాట్యం తమాషాగా ఉండటం వలన పెంగ్విన్లను అనేక కార్టూన్ పాత్రలుగా సృష్టించారు. కాగా యూఎస్‌లో మిస్సౌరీలోని సెయింట్ లూయిస్ జూ పార్క్‌లో తీసిన ఓ వీడియో నెటిజన్ల హృదయాలను గెలుచుకుంటోంది. రెడిట్‌లో పోస్ట్ చేసిన 44 సెకన్ల నివిడి గల ఈ వీడియోను 5 గంటల్లో 37000 వేల మంది వీక్షించారు. పెంగ్విన్లు బరువు చూసుకోవడానికి ఆత్రుతగా ఎదుచూస్తున్న ఈ వీడియో వేల కామెంట్స్‌తో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ క్రమంలో.. ‘‘ నేను పెంగ్విన్ కావాలనుకుంటున్నాను.’’ అంటూ ఓ నెటిజన్ చమత్కరిస్తే".. ‘‘ఇది నిజంగా ఓ మేధావి ఆలోచనలా ఉంది. వీటిని చూస్తే నిటారుగా ఉన్న కొండను చూసినట్టుంది.’’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక పెంగ్విన్లు తమ జీవిత కాలంలో సగం నేలమీద, సగం నీటిమీద నివసిస్తాయి. ఆడ పెంగ్విన్ల కన్నా మగ పెంగ్విన్లు ఆకారంలో కొద్దిగా పెద్దగా..పెద్ద ముక్కుతో ఉంటాయి. (చదవండి: చనిపోయే ముందు వీడియో.. యూట్యూబర్ ఆఖరి మాటలు) -
రేపే ప్రేక్షకుల ముందుకు ‘పెంగ్విన్’
సాక్షి, న్యూఢిల్లీ : తెలుగు వెండి తెర వేల్పు సావిత్రి జీవితంపై తీసిన బయోపిక్ ‘మహానటి’లో సావిత్రిగా నటించి తెలుగుతోపాటు తమిళ ప్రేక్షకులను విశేషంగా ఆకర్శించిన 27 ఏళ్ల కీర్తి సురేశ్ ‘పెంగ్విన్’ చలన చిత్రంతో జూన్ 19వ తేదీన ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ‘మహానటి’ తెలుగు చిత్రం తర్వాత ఫాషన్ డిజైనింగ్ కోర్స్ కోసం చెన్నై వెళ్లిన ఆమె ప్రస్తుతం కరోనా లాక్డౌన్ కారణంగా కేరళలోని తన ఇంటికే అంకితం అయ్యారు. కీర్తి సురేశ్ చెన్నైలో ఉండగానే ‘పెంగ్విన్’ అనే తమిళ చిత్రంలో నటించేందుకు అంగీకరించారు. తమిళనాడు సంచలన చిత్రాల నిర్మాతగా గుర్తింపు పొందిన కార్తీక్ సుబ్బరాజ్ తీసిన ‘పెంగ్విన్’ చిత్రానికి ఈశ్వర్ దర్శకత్వం వహించారు. తనను నుంచి తప్పిపోయిన కొడుకు కోసం నాలుగు రోజులపాటు అవిశ్రాంతంగా వెతికే త్రిల్లర్ సినిమాలో నటించినందుకు తనకు త్రిల్లింగా ఉందని కీర్తి సురేశ్ మీడియాకు తెలిపారు. ఓ తల్లికి, కొడుకుకు మధ్యనున్న అనుబంధాన్ని అచ్చు గుద్దినంటూ చూపించే కథనానికి తాను స్పందించి ఈ చిత్రానికి అంగీకరించానని ఆమె చెప్పారు. మొత్తం కొడైకెనాల్లో నిర్మించిన ఈ చిత్రం షూటింగ్ కేవలం 40 రోజుల్లో పూర్తయిందని ఆమె తెలిపారు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినీ రంగప్రవేశం చేసిన కీర్తి సురేశ్ 2013లో గీతాంజలి లీడ్ రోల్ ద్వారా తెలుగు, తమిళ చిత్రాలకు పరిచయం అయ్యారు. లాక్డౌన్ కారణంగా సినిమా థియేటర్లు మూత పడడంతో నెట్‌ఫ్లిక్స్. అమెజాన్ లాంటి ఆన్లైన్ మూవీ సైట్లకు ప్రేక్షకులు భారీగా పెరిగారు.


