అత్యంత అరుదైన పెంగ్విన్‌..! | Rarest Penguin On Earth Spotted: All Black Penguin | Sakshi
Sakshi News home page

అత్యంత అరుదైన పెంగ్విన్‌..!

Dec 15 2024 4:33 PM | Updated on Dec 15 2024 4:33 PM

Rarest Penguin On Earth Spotted: All Black Penguin

ఫొటోలో కనిపిస్తున్నది ప్రపంచంలోనే చాలా అరుదుగా కనిపించే పెంగ్విన్‌. పూర్తి నలుపు రంగులో కనిపించే ఇలాంటి పెంగ్విన్స్‌ను ‘మెలనిస్టిక్‌ పెంగ్విన్స్‌’ అని, ‘ఆల్‌ బ్లాక్‌ పెంగ్విన్స్‌’ అని అంటారు. బెల్జియన్‌ వైల్డ్‌ లైఫ్‌ ఫొటోగ్రాఫర్‌ వైవ్స్‌ ఆడమ్స్, దక్షిణ జార్జియా ద్వీపంలోని సెయింట్‌ ఆండ్రూస్‌ బే వద్ద ఈ అరుదైన పెంగ్విన్‌ ఫొటో తీశాడు. 

సాధారణంగా పెంగ్విన్‌లు నలుపు, తెలుపు రంగుల్లో ఉంటాయి. కౌంటర్‌ షేడింగ్‌ అనే మభ్యపెట్టే పద్ధతిలో భాగంగా పెంగ్విన్‌లకు ఈ రంగులు సహజంగా ఉంటాయి. పెంగ్విన్‌లు ఈత కొడుతున్నప్పుడు, తెలుపు భాగం ప్రకాశవంతమైన నీటితో కలసిపోయి, ఇతర జంతువుల నుంచి రక్షించుకునేందుకు సహాయపడుతుంది. అయితే, పూర్తి నల్లటి ఈకలతో కప్పబడి ఉండే ఈ రకం పరిస్థితిని మెలనిజం అని పిలుస్తారు. 

శరీరం మెలనిన్‌ను ఎక్కువగా ఉత్పత్తి చేసినప్పుడు, చర్మం లేదా వెంట్రుకలు నల్లగా ఉంటాయి. ‘నేను పూర్తి మెలనిస్టిక్‌ పెంగ్విన్‌ను చూసి చాలా సంతోషించాను. దూరం నుంచి చాలా నల్లగా ఉంటుంది, కాని దగ్గరగా వచ్చినప్పుడు దాని మెడ, బొడ్డుపై కొన్ని గుర్తులు ముదురాకుపచ్చగా ఉన్నాయి’ అని ఆడమ్స్‌ చెప్పాడు. నిజానికి ఆడమ్స్‌ వింతగా కనిపించే పెంగ్విన్‌  ఫొటో తీయటం ఇది రెండోసారి. 2021లో, ఇదే ప్రాంతంలో మునుపెన్నడూ చూడని పసుపు రంగు పెంగ్విన్‌ ఫొటో తీశాడు ఆడమ్స్‌.  

(చదవండి: ఆ జత జాడీలతో ఓ కుటుంబం​ రాత్రికి రాత్రే కోట్లకు పడగలెత్తింది..!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement