నెటిజన్లను మెప్పిస్తున్న పెంగ్విన్లు: వైరల్‌ వీడియో | Penguins Eagerly Wait To Be Weighed Video Viral On Social Media | Sakshi
Sakshi News home page

నెటిజన్లను మెప్పిస్తున్న పెంగ్విన్లు: వైరల్‌ వీడియో

May 12 2021 10:29 AM | Updated on May 12 2021 10:59 AM

Penguins Eagerly Wait To Be Weighed Video Viral On Social Media - Sakshi

మిస్సౌరీ: పెంగ్విన్లు ప్రధానాంశంగా పుస్తకాలు, సినిమాలు, డాక్యుమెంటరీలు చాలానే వచ్చాయి. కార్టూన్లు, టెలివిజన్ డ్రామాలు వినోదాన్ని పంచాయి.  వీటి నడక, నాట్యం తమాషాగా ఉండటం వలన పెంగ్విన్‌లను అనేక కార్టూన్‌ పాత్రలుగా సృష్టించారు. కాగా యూఎస్‌లో మిస్సౌరీలోని సెయింట్‌ లూయిస్‌ జూ పార్క్‌లో తీసిన ఓ వీడియో నెటిజన్ల హృదయాలను గెలుచుకుంటోంది. రెడిట్‌లో పోస్ట్ చేసిన 44 సెకన్ల నివిడి గల ఈ వీడియోను 5 గంటల్లో 37000 వేల మంది వీక్షించారు. పెంగ్విన్‌లు బరువు చూసుకోవడానికి ఆత్రుతగా ఎదుచూస్తున్న ఈ వీడియో వేల కామెంట్స్‌తో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.

ఈ క్రమంలో.. ‘‘ నేను పెంగ్విన్‌ కావాలనుకుంటున్నాను.’’ అంటూ ఓ నెటిజన్‌ చమత్కరిస్తే".. ‘‘ఇది నిజంగా ఓ మేధావి ఆలోచనలా ఉంది. వీటిని చూస్తే నిటారుగా ఉన్న కొండను చూసినట్టుంది.’’ అంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. ఇక పెంగ్విన్లు తమ జీవిత కాలంలో సగం నేలమీద, సగం నీటిమీద నివసిస్తాయి. ఆడ పెంగ్విన్ల కన్నా మగ పెంగ్విన్లు ఆకారంలో కొద్దిగా పెద్దగా..పెద్ద ముక్కుతో ఉంటాయి.

(చదవండి: చనిపోయే ముందు వీడియో.. యూట్యూబర్‌ ఆఖరి మాటలు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement