రేపే ప్రేక్షకుల ముందుకు ‘పెంగ్విన్‌’ | Keerthy Suresh's Penguin To Release On Amazon Prime Video Tomorrow | Sakshi
Sakshi News home page

రేపే ప్రేక్షకుల ముందుకు ‘పెంగ్విన్‌’

Jun 18 2020 4:28 PM | Updated on Jun 19 2020 1:05 PM

Keerthy Suresh's Penguin To Release On Amazon Prime Video Tomorrow - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : తెలుగు వెండి తెర వేల్పు సావిత్రి జీవితంపై తీసిన బయోపిక్‌ ‘మహానటి’లో సావిత్రిగా నటించి తెలుగుతోపాటు తమిళ ప్రేక్షకులను విశేషంగా ఆకర్శించిన 27 ఏళ్ల కీర్తి సురేశ్‌ ‘పెంగ్విన్‌’ చలన చిత్రంతో జూన్‌ 19వ తేదీన ‘అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో’ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ‘మహానటి’ తెలుగు చిత్రం తర్వాత ఫాషన్‌ డిజైనింగ్‌ కోర్స్‌ కోసం చెన్నై వెళ్లిన ఆమె ప్రస్తుతం కరోనా లాక్‌డౌన్‌ కారణంగా కేరళలోని తన ఇంటికే అంకితం అయ్యారు. కీర్తి సురేశ్‌  చెన్నైలో ఉండగానే ‘పెంగ్విన్‌’ అనే తమిళ చిత్రంలో నటించేందుకు అంగీకరించారు. తమిళనాడు సంచలన చిత్రాల నిర్మాతగా గుర్తింపు పొందిన కార్తీక్‌ సుబ్బరాజ్‌ తీసిన ‘పెంగ్విన్‌’ చిత్రానికి ఈశ్వర్‌ దర్శకత్వం వహించారు. 

తనను నుంచి తప్పిపోయిన కొడుకు కోసం నాలుగు రోజులపాటు అవిశ్రాంతంగా వెతికే త్రిల్లర్‌ సినిమాలో నటించినందుకు తనకు త్రిల్లింగా ఉందని కీర్తి సురేశ్‌ మీడియాకు తెలిపారు. ఓ తల్లికి, కొడుకుకు మధ్యనున్న అనుబంధాన్ని అచ్చు గుద్దినంటూ చూపించే కథనానికి తాను స్పందించి ఈ చిత్రానికి అంగీకరించానని ఆమె చెప్పారు. మొత్తం కొడైకెనాల్‌లో నిర్మించిన ఈ చిత్రం షూటింగ్‌ కేవలం 40 రోజుల్లో పూర్తయిందని ఆమె తెలిపారు.  చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా సినీ రంగప్రవేశం చేసిన కీర్తి సురేశ్‌ 2013లో గీతాంజలి లీడ్‌ రోల్‌ ద్వారా తెలుగు, తమిళ చిత్రాలకు పరిచయం అయ్యారు. లాక్‌డౌన్‌ కారణంగా సినిమా థియేటర్లు మూత పడడంతో నెట్‌ఫ్లిక్స్‌. అమెజాన్‌ లాంటి ఆన్‌లైన్‌ మూవీ సైట్లకు ప్రేక్షకులు భారీగా పెరిగారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement