
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సైయంట్ వ్యవస్థాపకులు బీవీఆర్ మోహన్ రెడ్డి రచించిన ‘ఇంజినీర్డ్ ఇన్ ఇండియా–ఫ్రమ్ డ్రీమ్స్ టు బిలియన్ డాలర్ సైయంట్’ పుస్తకాన్ని పెంగ్విన్ ఇండియా ప్రచురించింది.
ఓ వ్యాపారవేత్తగా ఎదగాలని, దేశ నిర్మాణంలో తన వంతు పాలుపంచుకోవాలని కలలుకంటూ ఐఐటీ కాన్పూర్ నుంచి 1974లో బయటకు అడుగుపెట్టిన ఓ యువకుని సాహసోపేత కథ ఇది అని పెంగ్విన్ తెలిపింది. భారత్‌లో స్వేచ్ఛాయుత వాణిజ్యానికి ముందు అనుభవలేమి, మూలధన అవసరాలను సమకూర్చుకోవడమనే అవరోధాలను సైతం అధిగమించి మోహన్ రెడ్డి సాగించిన స్ఫూర్తిదాయక ప్రయాణాన్ని ఇది వెల్లడిస్తుందని వివరించింది.