breaking news
pens
-
వేల సంఖ్యలో వెరైటీ పెన్నులు.. ఒకేచోట చూస్తారా?
డిజిటల్ యుగంలో చేతిరాత ప్రాధాన్యం క్రమంగా కనుమరుగవుతున్న నేపథ్యంలో ఫౌంటెన్ పెన్నుల పట్ల అమితాసక్తి ఉన్న కొందరు దానికి పూర్వవైభవం తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ‘హైదరాబాద్ పెన్ షో’ పేరిట హైదరాబాద్ ఫౌంటెన్ పెన్ క్లబ్ (Hyderabad Fountain Pen Club) ఆధ్వర్యంలో లక్డీకాపూల్‌లోని ఎఫ్‌టీసీసీఐ భవనం వేదికగా అక్టోబర్ 2, 3, 4వ తేదీల్లో ప్రదర్శన కొనసాగనుంది.క్లబ్ సభ్యుడు శ్రేయస్ మాట్లాడుతూ విద్యార్థులలో ఫౌంటెన్ పెన్నుల వాడకాన్ని ప్రోత్సహించడానికి 200 ప్రత్యేక స్టూడెంట్ కిట్లను రూపొందించి, ప్రదర్శనలో అతి తక్కువ ధరకే అందించనున్నామని తెలిపారు. దాదాపు 26 ప్రముఖ పెన్నుల తయారీ సంస్థలు ఇందులో పాల్గొంటున్నాయని, వీటిలో కొన్ని అంతర్జాతీయ బ్రాండ్లు ఉండటం విశేషమని పేర్కొన్నారు.ఈ మూడు రోజులపాటు పెన్నుల నిర్వహణ, కాలిగ్రఫీ తదితర అంశాలపై వర్క్‌షాప్‌లు కూడా ఉంటాయన్నారు. ఈ ప్రదర్శనకు రోజులో కేవలం కొన్ని గంటల పాటు మాత్రమే ప్రత్యేక ప్రవేశం ఉంటుంది, మిగిలిన సమయమంతా సాధారణ ప్రజలందరికీ ప్రవేశం పూర్తిగా ఉచితంగా ఉంటుంది. ఇదీ చదవండి: క్యాష్ రిసిప్ట్ తీసుకునేముందు జాగ్రత్త.. థర్మల్ పేపర్ తో క్యాన్సర్ వస్తుందా?సిల్వర్ పాస్: శని, ఆదివారాల్లో మధ్యాహ్నం 12 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు పెన్ షోలోని అన్ని ఉమ్మడి ప్రాంతాలకు ప్రవేశం.గోల్డ్ పాస్ (రూ.500): మూడు రోజుల పాటు పెన్ షోలోని అన్ని సాధారణ ప్రాంతాలకు ప్రవేశం. ప్రదర్శన వేళలు: శుక్రవారం, మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 6 వరకు, శనివారం మరియు ఆదివారం, ఉదయం 10 నుండి రాత్రి 8 వరకు.• హెచ్‌పిఎస్ స్పెషల్ గూడీ బ్యాగ్• ఏదైనా కొనుగోలుపై రీడీమ్ చేసుకోవడానికి ₹300 క్రెడిట్.ప్లాటినమ్ పాస్: (రూ. 1000): మూడు రోజుల పాటు పెన్ షోలోని అన్ని సాధారణ ప్రదేశాలకు ప్రవేశం. షో వేళలు: శుక్రవారం, మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 6 వరకు, శనివారం మరియు ఆదివారం, ఉదయం 10 నుండి రాత్రి 8 వరకు.• హెచ్‌పిఎస్ స్పెషల్ గూడీ బ్యాగ్• ఏదైనా కొనుగోలుపై రీడీమ్ చేసుకోవడానికి ₹500 క్రెడిట్• పెన్ షోకు ప్రత్యేక ప్రవేశ సమయాలు: శుక్రవారం మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 6 వరకు, శనివారం మరియు ఆదివారం ఉదయం 10 నుండి మధ్యాహ్నం 12 వరకు.• వర్క్‌షాప్‌లకు ప్లాటినం డిస్కౌంట్ఇదీ చదవండి: గుండెదడ గండమేనా.. ఈ విషయాలు గుర్తుంచుకోండి!వీఐపీ పాస్ (రూ. 4000): మూడు రోజుల పాటు పెన్ షోలోని అన్ని సాధారణ ప్రదేశాలకు ప్రవేశం. షో వేళలు: శుక్రవారం, మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 6 వరకు, శనివారం మరియు ఆదివారం, ఉదయం 10 నుండి రాత్రి 8 వరకు.• ప్రీమియం HPS గూడీ బ్యాగ్• ఏదైనా కొనుగోలుపై రీడీమ్ చేసుకోవడానికి ₹2,000 క్రెడిట్• పెన్ షోకు ప్రత్యేక ప్రవేశ సమయాలు: శుక్రవారం మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 6 వరకు, శనివారం మరియు ఆదివారం ఉదయం 10 నుండి మధ్యాహ్నం 12 వరకు.• వర్క్‌షాప్‌లకు VIP డిస్కౌంట్• విక్రేతలు మరియు FP కమ్యూనిటీతో ప్రత్యేక నెట్వర్కింగ్ డిన్నర్‌కు ప్రవేశం. -
మహిళ కడుపులో 13 పెన్నులు, 5 స్పూన్లు, కొవ్వొత్తి
నరసరావుపేట రూరల్: మతిస్థిమితం లేని మహిళకు అరుదైన శస్త్రచికిత్స ద్వారా 13 పెన్నులు, 5 స్పూన్లు, కొవ్వొత్తి వెలికితీసిన ఘటన పల్నాడుజిల్లా నరసరావుపేటలో చోటుచేసుకుంది. లాప్రోస్కోపి ద్వారా శస్త్ర చికిత్స నిర్వహించి మహిళ కడుపులో ఉన్న వాటిని వెలికితీసినట్లు మాతాశ్రీ ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ పి.రామచంద్రారెడ్డి తెలిపారు. ఆయన తెలిపిన సమాచారం ప్రకారం మండలంలోని పెట్లూరివారిపాలెంకు చెందిన కుటుంబం కొంతకాలంగా పట్టణంలో నివసిస్తుంది. వీరి కుమార్తెకు మతిస్థిమితం లేకపోవడంతో ఆమెకు చికిత్స చేయిస్తున్నారు. రెండు రోజులుగా ఎడమవైపు కడుపునొప్పితో బాధపడుతుండడంతో పలు పరీక్షలు నిర్వహించి కడుపులో పెన్నులు, స్పూన్లు, కొవ్వొత్తి ఉన్నట్టు గుర్తించారు. మతిస్థిమితం లేని వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని డాక్టర్ రామచంద్రారెడ్డి ఈ సందర్భంగా సూచించారు. -
పెన్నులు కొనుగోలు చేస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త!
లక్నో: వేసవి సెలవులు ముగిశాయి. స్కూళ్లు, కాలేజీలు తెరుచుకున్నాయి. కావాల్సిన బ్యాగ్స్,బుక్స్, పెన్నులు కొనుగోలు చేసేందుకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు స్టేషనరీ షాపులకు క్యూకట్టారు. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ పోలీస్‌శాఖ రాష్ట్ర ప్రజల్ని అప్రమత్తం చేసింది. స్టేషనరీ షాపుల్లో కొనుగోలు చేసే పెన్నుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.పెన్నుల్లా కనిపించేవన్నీ పెన్నులు కాదని.. సంఘ విద్రోహ శక్తులు పెన్నులకు బదులు..వాటి ఆకారంలో ఉండే బాంబుల్ని తయారు చేశారని తెలిపింది. అందుకు సంబంధించిన ఫొటోల్ని విడుదల చేసింది.ఉత్తరప్రదేశ్‌లో పెన్ ఆకారంలో ఉన్న అనుమానాస్పద వస్తువులపై ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. బులంద్‌షహర్ జిల్లా పోలీసులు (ఖుర్జా పోలీస్ స్టేషన్ పరిధి) ఈ అడ్వైజరీని విడుదల చేశారు. పెన్‌లా కనిపించే అనుమానాస్పద వస్తువులను తాకరాదని ప్రత్యేక సూచనలు చేశారు. ఇవి విస్ఫోటక పరికరాలుగా మార్పిడి చేసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.ప్రజలు రోడ్లపై, పొలాల్లో, ఖాళీ ప్రదేశాల్లో లేదా ఎడారిలాంటి ప్రాంతాల్లో కనిపించే వస్తువులను తాకకుండా 112 ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు. ప్రజల సహకారం అత్యంత కీలకమని, శిక్షణ పొందిన భద్రతా సిబ్బందే ఇలాంటి వస్తువులను పరిశీలించాని తెలిపారు. ప్రజలు సూచనలను పాటిస్తే ప్రమాదాలను నివారించవచ్చని పోలీసులు స్పష్టం చేశారు. అంతా ఉత్తుత్తే..తాజాగా సమాచారం ప్రకారం.. పెన్నులా కనిపించే ఒక వస్తువు చివర ఉన్న బటన్‌ను నొక్కగానే బాంబులు పేలుతాయని, కొన్ని సందర్భాల్లో మనుషులు ప్రాణాలు కోల్పోయారని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే, ఈ వైరల్ వార్తల్లో నిజం లేదని తేలింది. ముందుగా ఈ తరహా పెన్నులపై అప్రమత్తంగా ఉండాలని ఉత్తరప్రదేశ్ పోలీసులు సూచనలు జారీ చేశారని ప్రచారం జరిగింది. కానీ, తాము ఎలాంటి సూచనలు ఇవ్వలేదని యూపీ పోలీసులు మీడియాకు స్పష్టంగా తెలిపారు. -
బీవీఆర్ మోహన్ రెడ్డి ‘ఇంజనీర్డ్ ఇన్ ఇండియా’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సైయంట్ వ్యవస్థాపకులు బీవీఆర్ మోహన్ రెడ్డి రచించిన ‘ఇంజినీర్డ్ ఇన్ ఇండియా–ఫ్రమ్ డ్రీమ్స్ టు బిలియన్ డాలర్ సైయంట్’ పుస్తకాన్ని పెంగ్విన్ ఇండియా ప్రచురించింది. ఓ వ్యాపారవేత్తగా ఎదగాలని, దేశ నిర్మాణంలో తన వంతు పాలుపంచుకోవాలని కలలుకంటూ ఐఐటీ కాన్పూర్ నుంచి 1974లో బయటకు అడుగుపెట్టిన ఓ యువకుని సాహసోపేత కథ ఇది అని పెంగ్విన్ తెలిపింది. భారత్‌లో స్వేచ్ఛాయుత వాణిజ్యానికి ముందు అనుభవలేమి, మూలధన అవసరాలను సమకూర్చుకోవడమనే అవరోధాలను సైతం అధిగమించి మోహన్ రెడ్డి సాగించిన స్ఫూర్తిదాయక ప్రయాణాన్ని ఇది వెల్లడిస్తుందని వివరించింది. -
పెన్నులు తీసుకునేందుకు పోటెత్తిన విద్యార్థులు
అయినవిల్లి : అయినవిల్లి విఘ్నేశ్వరస్వామివారి ఆలయంలో ఈ నెల ఒకటో తేదీ నుంచి మూడో తేదీ వరకూ సప్తనదీజలాభిషేకం, సరస్వతీయాగం, లక్ష కలాల పూజ వంటి విశేష క్రతువులు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ప్రత్యేక పూజల్లో భాగంగా విఘ్నేశ్వరస్వామివారి పాదాల చెంత ఉంచిన పెన్నులను స్థానిక ఎమ్మెల్యే పులపర్తి నారాయణ మూర్తి, జెడ్పీ చైర్మ¯ŒS నామన రాంబాబులు విద్యార్థులకు ఆదివారం పంపిణీ చేశారు. ఈ పెన్నులను తీసుకునేందుకు జిల్లా నలు మూలల నుంచి విద్యార్థులు తరలివచ్చారు. ఈ పెన్నుతో పరీక్షలు రాస్తే ఉత్తమ మార్కులు వస్తాయనేది విద్యార్థుల నమ్మకం. అందుకే ఈ పెన్నుల తీసుకునేందుకు విద్యార్థులు పెద్ద ఎత్తున స్వామివారి దర్శించి పెన్నులు తీసుకున్నారు. వీరికి ఆలయ అధికారులు ఏ ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. తొలుత ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి, జెడ్పీచైర్మ¯ŒS నామన రాంబాబు స్వామికి పూజలు చేశారు. -
శ్రీవిద్యాగణపతి ప్రసాదంగా కలాల పంపిణీ
రాజమహేంద్రవరం కల్చరల్ : ‘‘ఆంధ్రమహాభారతం అవరించిన నేలపై, శ్రీనాథాది మహాకవులు నడయాడిన, కవి సార్వభౌములకు ఆలవాలమైన ఈ నేలపై కలానికి ఎంతో ప్రాముఖ్యం ఉంది కనుకనే ఈ ఏడాది గణపతిని శ్రీవిద్యా గణపతిగా కలాలతో అలంకరించాం’’ అని రాజమహేంద్రి గణేశ్ ఉత్సవ కమిటీ గౌరవాధ్యక్షురాలు జక్కంపూడి విజయలక్ష్మి అన్నారు. పుష్కరాల రేవులో ఈ నెల 5వ తేదీన ఏర్పాటు చేసిన గణపతి విగ్రహంలో ఉపయోగించిన 1,11,111 కలాలను భక్తులకు గురువారం ప్రసాదంగా వితరణ చేశారు. విజయలక్ష్మి తల్లి సుమతి కూడా ఈ వితరణలో పాల్గొన్నారు. ఈ కలాలలను స్వీకరించడానికి భక్తులు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. పుష్కరాల రేవులో గణపతి విగ్రహం నెలకొల్పిన తావు నుంచి దాదాపు పెద్ద ఆంజనేయ స్వామి ఆలయం వరకూ భక్తులు బారులు తీరారు. వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, నగరపాలక సంస్థలో ఫ్లోర్‌లీడర్ మేడపాటి షర్మిలారెడ్డి, పార్టీ నాయకులు జక్కంపూడి గణేష్, పార్టీ కార్పొరేటర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


