శ్రీవిద్యాగణపతి ప్రసాదంగా కలాల పంపిణీ
‘‘ఆంధ్రమహాభారతం అవరించిన నేలపై, శ్రీనాథాది మహాకవులు నడయాడిన, కవి సార్వభౌములకు ఆలవాలమైన ఈ నేలపై కలానికి ఎంతో ప్రాముఖ్యం ఉంది కనుకనే ఈ ఏడాది గణపతిని శ్రీవిద్యా గణపతిగా కలాలతో అలంకరించాం’’ అని రాజమహేంద్రి గణేశ్ ఉత్సవ కమిటీ గౌరవాధ్యక్షురాలు జక్కంపూడి విజయలక్ష్మి అన్నారు.
రాజమహేంద్రవరం కల్చరల్ :
‘‘ఆంధ్రమహాభారతం అవరించిన నేలపై, శ్రీనాథాది మహాకవులు నడయాడిన, కవి సార్వభౌములకు ఆలవాలమైన ఈ నేలపై కలానికి ఎంతో ప్రాముఖ్యం ఉంది కనుకనే ఈ ఏడాది గణపతిని శ్రీవిద్యా గణపతిగా కలాలతో అలంకరించాం’’ అని రాజమహేంద్రి గణేశ్ ఉత్సవ కమిటీ గౌరవాధ్యక్షురాలు జక్కంపూడి విజయలక్ష్మి అన్నారు. పుష్కరాల రేవులో ఈ నెల 5వ తేదీన ఏర్పాటు చేసిన గణపతి విగ్రహంలో ఉపయోగించిన 1,11,111 కలాలను భక్తులకు గురువారం ప్రసాదంగా వితరణ చేశారు. విజయలక్ష్మి తల్లి సుమతి కూడా ఈ వితరణలో పాల్గొన్నారు. ఈ కలాలలను స్వీకరించడానికి భక్తులు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. పుష్కరాల రేవులో గణపతి విగ్రహం నెలకొల్పిన తావు నుంచి దాదాపు పెద్ద ఆంజనేయ స్వామి ఆలయం వరకూ భక్తులు బారులు తీరారు. వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, నగరపాలక సంస్థలో ఫ్లోర్‌లీడర్ మేడపాటి షర్మిలారెడ్డి, పార్టీ నాయకులు జక్కంపూడి గణేష్, పార్టీ కార్పొరేటర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.