breaking news
Nation Building
-
దేశ నిర్మాణమే సంఘ్ ధ్యేయం
న్యూఢిల్లీ: దేశ నిర్మాణంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) అద్వితీయమైన పాత్ర పోషిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. ‘దేశమే ప్రథమం’ అనే స్ఫూర్తితో కార్యాచరణ కొనసాగిస్తోందని అన్నారు. నిరంతరం ప్రజాసేవలో నిమగ్నమైన సంఘ్‌పై ఇప్పటిదాకా ఎన్నో దాడులు జరిగాయని గుర్తుచేశారు. అయినప్పటికీ ఏనాడూ ఎవరిపైనా విద్వేషం ప్రదర్శించలేదని, అందరినీ అక్కున చేర్చుకుందని కొనియాడారు. బుధవారం ఢిల్లీలో కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆర్ఎస్ఎస్ శతాబ్ది వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. వందేళ్లు పూర్తి చేసుకుంటున్న సంఘ్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. సంఘ్ సేవలను ప్రత్యేకంగా ప్రస్తావించారు. కులం, జాతి అనే అడ్డుగోడలను తొలగించి, సమాజంలో ప్రజల మధ్య సామరస్యం, సోదరభావం పెంపొందించడమే లక్ష్యంగా దేశంలో నలుమూలలకూ సంఘ్ విస్తరించిందని చెప్పారు. సమీకృత సమాజ నిర్మాణమే ధ్యేయంగా పనిచేస్తోందని ఉద్ఘాటించారు. బ్రిటిషర్ల పాలనలో జరిగిన అకృత్యాలపై ఎన్నో పోరాటాలు చేసిందన్నారు. స్వాతంత్య్ర సమరయోధులకు స్వయంసేవకులు ఆశ్రయం ఇచ్చారని, స్వాతంత్య్ర సమరంలో ఎంతోమంది సంఘ్ నాయకులు అరెస్టయ్యి జైలుశిక్ష అనుభవించారని చెప్పారు. దేశాన్ని ప్రేమించడమే ఆర్ఎస్ఎస్ విధానమని స్పష్టంచేశారు. ప్రధానమంత్రి ఇంకా ఏం మాట్లాడారంటే... విశ్వాసం, గౌరవమే సంఘ్ బలం ‘‘ఆర్ఎస్ఎస్ ఆశయాలను అణచివేయడానికి ఎన్నో కుట్రలు జరిగాయి. ఇష్టానుసారంగా ఆరోపణలు చేశారు. తప్పుడు కేసులు పెట్టారు. సంఘ్‌ను శాశ్వతంగా నిషేధించే ప్రయత్నాలు కూడా చేశారు. లెక్కలేనన్ని సవాళ్లు ఎదురయ్యాయి. అయినప్పటికీ సంఘ్ ఏనాడూ వెనక్కి తగ్గలేదు. మహా మర్రివృక్షంగా స్థిరంగా నిలిచింది. ఎవరినీ ద్వేషించలేదు. ఎందుకంటే మనమంతా ఈ సమాజంలో భాగమే. ఇక్కడ మంచితోపాటు చెడును కూడా స్వీకరించాల్సిందే. సంఘ్ అధినేత గురూజీ గోల్వాల్కర్‌పై తప్పుడు కేసు నమోదుచేసి, జైలుకు పంపించారు. జైలు నుంచి బయటకు వచి్చన తర్వాత ఆయన విజ్ఞత ప్రదర్శించారు. జనాభా స్థితిగతుల్లో మార్పులు ఆందోళనకరం ఆర్ఎస్ఎస్కు వందేళ్లు పూర్తవుతున్నాయి. మన సంస్కృతి సంప్రదాయాలను బతికించుకోవాలన్న ఉద్దేశంతో సరిగ్గా వందేళ్ల క్రితం విజయ దశమి రోజున సంఘ్ స్థాపన జరిగింది. అప్పటి నుంచి దేశ ప్రగతికి కృషి చేస్తూనే ఉంది. దేశ భక్తి, ప్రజాసేవకు పర్యాయపదం ఆర్ఎస్ఎస్. ‘ఒకే భారత్, మహోన్నత భారత్’ అనే సిద్ధాంతాన్ని సంఘ్ విశ్వసిస్తోంది. భిన్నత్వంలో ఏకత్వమే మనదేశ ఆత్మ. అది విచ్ఛిన్నమైతే దేశం బలహీనపడుతుంది. దేశంలో జనాభా స్థితిగతుల్లో మార్పులు వస్తుండడం ఆందోళనకరం. ఈ పరిణామం దేశ భద్రతకు, సామాజిక సామరస్యానికి ప్రమాదకరం. బాహ్య శక్తులు మన దేశంలోకి చొరబడి వేర్పాటువాద సిద్ధాంతాలను నూరిపోస్తున్నాయి. చొరబాటుదారుల నుంచి మన పౌరులను కాపాడేందుకు ‘డెమొగ్రఫిక్ మిషన్’ను ప్రకటించాం. వాటి నుంచి సమాజానికి విముక్తి కల్పించాలి 1962లో యుద్ధం సమయంలో, 1971 నాటి సంక్షోభంలో, 1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్లలో వారు విశేషమైన సేవలందించారు. బాధితులను ఆదుకున్నారు. సంఘ్ సేవలను మాజీ రాష్ట్రపతులు అబ్దుల్ కలాం, ప్రణబ్ ముఖర్జీ కూడా ప్రశంసించారు. వార్ధాలోని సంఘ్ క్యాంప్‌ను మహాత్మాగాంధీ సందర్శించారు. సంఘ్ సిద్ధాంతాలను కొనియాడారు. ప్రస్తుత సర్సంఘ్చాలక్ మోహన్ భాగవత్ సమాజం ముందు స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించారు. ప్రజలందరికీ ‘ఒకే బావి, ఒకే గుడి, ఒకే శ్మశాన వాటిక’ అని చెబుతున్నారు. దేశంలో అన్ని వర్గాల ప్రజలు కలసిమెలసి ఉండాలని బోధిస్తున్నారు. ఈ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. వివక్ష, విభజన, అసమ్మతి నుంచి సమాజానికి విముక్తి కల్పించాలి’’ అని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. పోస్టల్ స్టాంప్, నాణెం ఆవిష్కరణ సంఘ్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక పోస్టల్ స్టాంప్, స్మారక నాణేన్ని ప్రధాని మోదీ విడుదల చేశారు. రూ.100 విలువ కలిగిన ఈ నాణెంపై ఒక వైపు భరతమాత చిత్రం, మరోవైపు జాతీయ చిహ్నం ఉంది. సింహంతోపాటు వరద ముద్రతో భరతమాత చిత్రం ఆకట్టుకుంటోంది. స్వయం సేవకులు ఆమెకు వందనం సమర్పిస్తున్నట్లుగా ఈ నాణెం ముద్రించారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో మన కరెన్సీపై భరతమాత చిత్రాన్ని ముద్రించడం ఇదే మొట్టమొదటిసారి అని ప్రధాని మోదీ చెప్పారు. ఇది చరిత్రాత్మకమని, మనకు గర్వకారణమని అన్నారు. నాణెంపై ఆర్ఎస్ఎస్ మోటో ‘రాష్ట్రాయ స్వాహా, ఇదం రాష్ట్రాయ, ఇదం న మమ’ కూడా ముద్రించారు. ‘ఏదీ నాది కాదు.. అంతా దేశానికే అంకితం’ అని దీని అర్థం. ఇక పోస్టల్ స్టాంప్‌పై 1963 రిపబ్లిక్ డే పరేడ్‌లో స్వయంసేవకులు పాల్గొన్న చిత్రం ముద్రించారు. ‘పంచ పరివర్తన్’ ఎజెండా ప్రజల మద్దతుతోనే సంఘ్ వందేళ్లు విజయవంతంగా పూర్తి చేసుకుందని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హొసబలే చెప్పారు. శతాబ్ది వేడుకల్లో ఆయన మాట్లాడారు. దేశంలో నేడు అతిపెద్ద స్వచ్ఛంద సంస్థగా మారిందని, దీని వెనుక ఎన్నో సవాళ్లు, కష్టాలు ఉన్నాయని తెలిపారు. సంఘ్‌పై ప్రత్యేక పోస్టల్ స్టాంప్, నాణెం విడుదల చేసినందుకు కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. సంఘ్ నిస్వార్థ సేవలకు ఇది చక్కటి గుర్తింపు అని పేర్కొన్నారు. మన దేశ ప్రగతి కోసం స్వదేశీ ఉత్పత్తులకు పెద్దపీట వేయాలని ప్రజలను కోరారు. దేశం స్వయం సమృద్ధి సాధించడానికి అందరూ కృషి చేయాలన్నారు. శతాబ్ది వేడుకలను పురస్కరించుకొని సంఘ్ నాయకత్వం ‘పంచ పరివర్తన్’ ఎజెండాను రూపొందించింది. భారతీయ విలువలు, సరైన కుటుంబ విలువలు, సామాజిక సామరస్యం, పర్యావరణహిత జీవనశైలితోపాటు పౌర విధులు సక్రమంగా నిర్వర్తించేలా ప్రజలను ప్రోత్సహించాలన్నదే ఈ ఎజెండా లక్ష్యం. -
Mann ki Baat: పటేల్ జయంతి నాడు... మేరా యువ భారత్
న్యూఢిల్లీ: జాతి నిర్మాణ కార్యకలాపాల్లో యువత మరింత చురుగ్గా పాల్గొనేందుకు వీలుగా మేరా యువ భారత్ పేరుతో జాతీయ స్థాయి వేదికను అందుబాటులోకి తేనున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. సర్దార్ వల్లభ్ బాయి పటేల్ జయంతి సందర్భంగా అక్టోబర్ 31న దీన్ని ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ఆ సందర్భంగా మేరా యువ భారత్ వెబ్‌సైట్‌ను కూడా ప్రారంభిస్తామని చెప్పారు. MYBharat.Gov.in సైట్లో పేర్లు నమోదు చేసుకోవాలని యువతకు సూచించారు. దీన్ని యువ శక్తిని జాతి నిర్మాణానికి, ప్రగతికి వినియోగపరిచేందుకు తలపెట్టిన అద్భుత కార్యక్రమంగా మోదీ అభివర్ణించారు. ఆదివారం ఆయన మన్ కీ బాత్ కార్యక్రమంలో జాతినుద్దేశించి మాట్లాడారు. అక్టోబర్ 31 దివంగత ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి కూడానని గుర్తు చేసుకున్నారు. ఆమెకు ఘనంగా నివాళులర్పించారు. నవంబర్ 15న ఆదివాసీ నేత బిర్సా ముండా జయంతి సందర్భంగా ఆయనకు కూడా మోదీ నివాళులర్పించారు. విదేశీ పాలనను ఒప్పుకోని ధీర నాయకునిగా ఆయన చరిత్రలో నిలిచిపోతారన్నారు. తిల్కా మహరాజ్, సిద్ధూ, కాన్హు, తాంతియా భీల్ వంటి వీర గిరిజన నాయకులు దేశ చరిత్రలో అడుగడుగునా కనిపిస్తారన్నారు. గిరిజన సమాజానికి దేశం ఎంతగానో రుణపడిందన్నారు. స్థానికతకు మరింతగా పెద్ద పీట వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. గాంధీ జయంతి రోజున ఖాదీ వస్తువుల అమ్మకం రికార్డులు సృష్టించిందని గుర్తు చేశారు. ఢిల్లీలో అమృత్ వాటిక రెండున్నరేళ్లుగా దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అక్టోబర్ 31న ఘనంగా ముగియనుందని మోదీ చెప్పారు. ‘‘దీనికి గుర్తుగా ఢిల్లీలో అమృత్ వాటిక నిర్మించనున్నాం. ఇందుకోసం అమృత్ కలశ్ యాత్రల పేరుతో దేశవ్యాప్తంగా మట్టిని సేకరించి పంపుతుండటం హర్షణీయం’’అన్నారు. వ్యర్థాల నుంచి సంపద అన్నది మన నూతన నినాదమని మోదీ అన్నారు. గుజరాత్ల అంబా జీ మందిర్‌లో వ్యర్థౠల నుంచి రూపొందించిన పలు కళాకృతులు అద్భుతంగా ఆకట్టుకుంటున్నాయన్నారు. దీన్ని దేశవాసులంతా స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. బెర్లిన్‌లో తాజాగా ముగిసిన ఒలింపిక్స్ వరల్డ్ సమ్మర్ గేమ్స్‌లో భారత్ 75 స్వర్ణాలతో పాటు ఏకంగా 200 పతకాలు సాధించడం గర్వకారణమన్నారు. గిరిజన వీరుల ప్రస్తావన ప్రధాని నరేంద్ర మోదీ మన్‌కీ బాత్‌లో గిరిజన వీరుల గురించి ప్రస్తావించారు. గిరిజన యుద్ధ వీరుల చరిత్రను ప్రశంసించారు. తెలంగాణలోని నిర్మల్, ఉట్నూరు, చెన్నూరు, అసిఫాబాద్ ప్రాంతాలను పరిపాలించి బ్రిటిష్ పాలనకు వ్యతిరేంగా పోరాడి ఉరికొయ్యకు ప్రాణాలరి్పంచిన రాంజీ గోండు, ఛత్తీస్‌గఢ్‌లో బస్తర్ప్రాంతానికి చెందిన వీర్ గుండాధుర్, మధ్యప్రదేశ్‌కు చెందిన ప్రథమ స్వాతంత్య్ర సమర యోధుడు భీమా నాయక్‌ల వీర చరిత్రను కొనియాడారు. అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడిన తిల్కా మాంఝీ, సమానత్వం కోసం పోరాడిన సిద్ధో–కన్హూ, స్వాతంత్య్ర యోధుడు తాంతియా భీల్‌లు ఈ గడ్డపై పుట్టినందుకు గరి్వస్తున్నామని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. గిరిజన ప్రజల్లో అల్లూరి సీతారామరాజు నింపిన స్ఫూర్తిని దేశం ఇప్పటికీ గుర్తుంచుకుందని పేర్కొన్నారు. గిరిజన సమాజానికి స్ఫూర్తినిచి్చన రాణి దుర్గావతి 500వ జయంతిని దేశం జరుపుకొంటోందని, గిరిజన సమాజానికి స్ఫూర్తినిచ్చిన వారి గురించి యువత తెలుసుకొని వారి నుంచి స్ఫూర్తి పొందాలని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. -
పురోగతికి నిధులు కావాల్సిందే
న్యూఢిల్లీ: వృద్ధికి, దేశ నిర్మాణానికి నిధులు తప్పనిసరి అని అనిల్ అగర్వాల్‌కు చెందిన వేదాంత రీసోర్సెస్ పేర్కొంది. వృద్ధి అవకాశాలను దృష్టిలో పెట్టుకుని, చెల్లింపుల సామర్థ్యం ఆధారంగానే కంపెనీలు, వ్యక్తులు, ప్రభుత్వాలు రుణాలు తీసుకుంటాయనే విషయాన్ని గుర్తు చేసింది. నిర్వహణ పరిమితుల్లోపే రుణాలను కట్టడి చేస్తామని, ఈ విషయంలో ఇన్వెస్టర్ల సమూహాన్ని ఒప్పించగలమన్న విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. ఇప్పటి వరకు రుణాలను సకాలంలో చెల్లించిన చరిత్రను ప్రస్తావించింది. పూర్తి చెల్లింపులకు తగిన సామర్థ్యం ఉన్నట్టు స్పష్టం చేసింది. 2023 మార్చి నాటికి తీర్చాల్సిన రుణాలకు ముందే చెల్లింపులు చేసినట్టు వేదాంత రీసోర్సెస్ తెలిపింది. గడిచిన 11 నెలల్లో 2 బిలియన్ డాలర్ల రుణాలను తగ్గించుకున్నట్టు వివరించింది. 2023 జూన్‌తో ముగిసే త్రైమాసికం వరకు నిధుల అవసరాలను చేరుకోగలమని విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. సంస్థ చరిత్రలో ఇప్పటి వరకు 35 బిలియన్ డాలర్ల నిధులు సమీకరించగా, వాటన్నింటికీ సకాలంలో చెల్లింపులు చేసినట్టు ప్రకటించింది. అధిక నగదు ప్రవాహాలను తెచ్చిపెట్టే బ్రహ్మాండమైన ఆస్తులు ఉన్నాయంటూ నమ్మకాన్ని కలిగించే ప్రయత్నం చేసింది. ప్రస్తుతం చేస్తున్న విస్తరణతో సమీప భవిష్యత్తులో ఆదాయం 30 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేసింది. ‘‘వేదంతా కంపెనీలు అన్నీ కూడా టాప్ సీఈవోల ఆధ్వర్యంలో నిపుణులతో నిర్వహిస్తున్నవి. అధిక వృద్ధి అవకాశాలతో, తక్కువ నిర్వహణ వ్యయాలతో వేదాంతా గ్రూప్ వ్యాపారాలను నిర్వహిస్తోంది. భారత్ ఆర్థిక పురోగతిలో మేము కూడా భాగస్వాములు అవుతాం’’అని లింక్డ్ఇన్ పోస్ట్‌లో వేదాంత రీసోర్సెస్ పేర్కొంది. వేదాంత లిమిటెడ్ ప్రమోటర్ సంస్థకు భారీ రుణాలు ఉండడంతో.. అదానీ తర్వాత వేదాంతా గ్రూపు రుణ సమస్యలు ఎదుర్కోనుందంటూ ఆందోళనలు వస్తున్న నేపథ్యంలో ఈ పోస్ట్ విడుదల చేయడం గమనార్హం. -
బీవీఆర్ మోహన్ రెడ్డి ‘ఇంజనీర్డ్ ఇన్ ఇండియా’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సైయంట్ వ్యవస్థాపకులు బీవీఆర్ మోహన్ రెడ్డి రచించిన ‘ఇంజినీర్డ్ ఇన్ ఇండియా–ఫ్రమ్ డ్రీమ్స్ టు బిలియన్ డాలర్ సైయంట్’ పుస్తకాన్ని పెంగ్విన్ ఇండియా ప్రచురించింది. ఓ వ్యాపారవేత్తగా ఎదగాలని, దేశ నిర్మాణంలో తన వంతు పాలుపంచుకోవాలని కలలుకంటూ ఐఐటీ కాన్పూర్ నుంచి 1974లో బయటకు అడుగుపెట్టిన ఓ యువకుని సాహసోపేత కథ ఇది అని పెంగ్విన్ తెలిపింది. భారత్‌లో స్వేచ్ఛాయుత వాణిజ్యానికి ముందు అనుభవలేమి, మూలధన అవసరాలను సమకూర్చుకోవడమనే అవరోధాలను సైతం అధిగమించి మోహన్ రెడ్డి సాగించిన స్ఫూర్తిదాయక ప్రయాణాన్ని ఇది వెల్లడిస్తుందని వివరించింది. -
దేశ నిర్మాణమనే మహాయజ్ఞంలో... ఎన్‌ఈపీది కీలక భూమిక
న్యూఢిల్లీ: దేశ నిర్మాణమనే మహాయజ్ఞంలో కీలక భూమిక పోషిస్తున్న వాటిలో నూతన జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) ఒకటని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. యువత తమ ఆకాంక్షలను నేరవేర్చుకోవడానికి దేశం వారికి అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. కొత్త జాతీయ విద్యా విధానాన్ని తీసుకొచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా గురువారం ఓ కార్యక్రమంలో మోదీ మాట్లాడారు. క్షేత్రస్థాయిలో ఎన్ఈపీని అమలు చేయడానికి టీచర్లు, ప్రిన్సిపాల్స్, విధాననిర్ణేతలు తీవ్రంగా శ్రమించారని కితాబిచ్చారు. ‘భవిష్యత్తులో ఎంత ఉన్నత స్థాయికి చేరుకుంటామనేది ప్రస్తుతం యువతకు మనమెలాంటి విద్యను అందిస్తున్నామనే దానిపైనే ఆధారపడి ఉంటుంది. దేశం మొత్తం మీతో ఉందని, మీ ఆకాంక్షలకు అండగా నిలుస్తుందనే భరోసాను కొత్త ఎన్ఈపీ యువతకు ఇస్తోంది’ అని మోదీ పేర్కొన్నారు. గురువారం కొత్తగా ప్రారంభించిన ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (కృత్రిమ మేధ– ఏఐ) కార్యక్రమం యువతను భవిష్యత్తు అవసరాలను అనుగుణంగా తీర్చిదిద్దుతుందని, ఏఐ ఆధారిత ఆర్థిక వ్యవస్థకు బాటలు వేస్తుందని అన్నారు. ఆకడమిక్ బ్యాంక్ ఆప్ క్రెడిట్ (ఏబీసీ) పథకాన్ని ప్రధాని ప్రకటించారు. దీని ప్రకారం ఉన్నతవిద్యలో ఒక విద్యార్థి తనకు నచ్చిన సబ్జెక్టులను ఎంచుకోవచ్చు. భిన్న యూనివర్శిటీలకు మారొచ్చు. వరుసగా ఇన్నేళ్లు చదవాలని కాకుండా... తను కోరుకున్నపుడు కోర్సులో చేరడం, మధ్యలో నిలిపివేయడం చేయవచ్చు. అతని రికార్డులన్నీ ఏబీసీలో నిక్షిప్తమవుతాయి. అలాగే 3, 5, 8వ తరగతుల విద్యార్థులకు సీబీఎస్ఈ ప్రవేశపెట్టిన సమర్థత ఆధారిత మూల్యాంకనం (సఫల్)ను గురువారం మోదీ ఆరంభించారు. మాతృభాషకు పెద్దపీట మాతృభాషకు, ప్రాంతీయ భాషలకు కూడా ఎన్ఈపీ ప్రాధాన్యమిస్తోందనే అంశాన్ని ఎత్తిచూపుతూ... ఎనిమిది రాష్ట్రాల్లోని 14 ఇంజనీరింగ్ కాలేజీలు ఐదు భారతీయ భాషల్లో (హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీ) విద్యాబోధనను ప్రారంభించనుండటం పట్ల ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ‘ఇంజనీరింగ్ పాఠ్యాంశాలను 11 భాషల్లోకి అనువదించడానికి ఒక టూల్‌ను అభివృద్ధి చేయడం జరిగింది. మాతృభాషలో చదువుల కు ప్రాధాన్యమిస్తే... పేద, గ్రామీణ, గిరిజన విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపగలం. భారత సంకేత భాషకు తొలిసారిగా భాష హోదా ఇవ్వడం జరిగింది. విద్యార్థులు ఎవరైనా తాము నేర్చుకునే భాషల్లో ఒకటిగా దీన్ని ఎంచుకోవచ్చు’ అని పేర్కొన్నారు. -
నెహ్రూ జాతినిర్మాణ కార్యక్రమంపై అమిత్ షా విమర్శలు
పుణె: జవహర్ లాల్ నెహ్రూ జాతీయ నిర్మాణ కార్యక్రమం దేశంలోని విలువలను నిర్మూలించి, విదేశాలనుంచి ఆలోచనలను అరువు తెచ్చుకునే విధాన మని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా విమర్శించారు.దీన దయాల్ ఉపాధ్యాయ ప్రతిపాదించిన సిద్ధాంతమే దేశంలో విలువలను కాపాడగలదని పేర్కొన్నారు.దీన్ దయాల్ జీవిత చరిత్ర 'రాష్ట్ర్ర ద్రష్ట' ను పుణెలో ఆవిష్కరించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దీన దయాల్ సిద్ధాంతాల పునాదులపైననే జన సంఘ్ నిర్మాణం,బీజేపీ స్థాపన జరిగిందని షా తెలిపారు. విభిన్న భావజాలమున్న వ్యక్తుల త్యాగాల ఫలితంగా దేశానికి స్వతంత్రం వస్తే గొప్ప తనాన్ని కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకుందని ఆయన పేర్కొన్నారు.దీన్ దయాల్ సిద్ధాంతాలకు కట్టుబడి ఆయన ఆశయ సాధనకు బీజేపీ కృషి చేస్తోందని షా అన్నారు.