breaking news
Penguin bird
-
ఆ పెంగ్విన్ మందను వీడడానికి.. కారణాలివే..!
ఇటీవల ఓ పెంగ్విన్ వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. అందుక్కారణం ఆ వీడియోలో కనిపించే పెంగ్విన్ ఆహారం కోసం సముద్రం వైపు వెళ్లకుండా.. తన మందను వీడి.. పర్వతాల వైపు సుదీర్ఘ ప్రయాణం చేసింది. అందుకు కారణాలేమిటి? ఆ పెంగ్విన్ ఎందుకు అలా ప్రవర్తించింది? ఇది నిజంగానే పెంగ్విన్ల ‘డెట్ వాక్’కు సంకేతమా? ఇప్పుడు నెటిజన్లు ఈ ప్రశ్నలకు సమాధానాల కోసం ఏఐ టూల్స్, సెర్చింజన్లను జల్లెడపడుతున్నారు. అయితే.. ‘సాక్షి డిజిటల్ ఎక్స్‌క్లూజివ్’ పలు కారణాలను గుర్తించింది. ఆ వివరాలు తెలియాలంటే.. ఈ కథనం చదవాల్సిందే..ఆ వీడియో ఎప్పటిదంటే..వైరల్ అవుతున్న ఆ పెంగ్విన్ వీడియో ఇప్పటిది కాదు. 2007 నాటిది. అయితే.. చాలా మంది నెటిజన్లు ఆ పెంగ్విన్ ‘డెత్ వాక్’కు సిద్ధపడే అలా మందను వీడిందనే కన్‌క్లూజన్‌కు వస్తున్నారు. అందుకు సంబంధించిన థియరీలు చెబుతున్నారు. అయితే.. ఆ డాక్యుమెంట్‌ను ‘ఎన్కౌంటర్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద వరల్డ్’ అనే పేరుతో చిత్రీకరించారు. దీనికి ప్రఖ్యాత జర్మన్ చిత్ర నిర్మాత వెర్నర్ హెర్జోగ్ దర్శకత్వం వహించారు. అంటార్కిటికాలోని క్లష్ట పరిస్థితులపై ఈ డాక్యుమెంట్‌ను చిత్రీకరించారు. 81వ అకాడమీ అవార్డుల్లో ఈ డాక్యుమెంట్ ఉత్తమ ఫీచర్‌గా నామినేట్ అయ్యింది.పర్వతాల వైపే ఎందుకెళ్లింది?అంటార్కిటికాలోని ‘కేప్ రాయిడ్స్’ అనే ప్రాంతంలోని మందకు సంబంధించిన పెంగ్విన్ వింతగా ప్రవర్తిస్తూ.. ఒంటరిగా క్రియాశీల అగ్నిపర్వతం వైపు వెళ్లడంపై ఈ డాక్యుమెంట్ ప్రధానంగా ఫోకస్ చేసింది. ఆహారం కోసం పెంగ్విన్లు సముద్రం వైపు వెళ్తాయి. కానీ, ఒంటరి పెంగ్విన్ మాత్రం పర్వతాల వైపు వెళ్లింది. అక్కడ ఆహారం దొరకదు. కాబట్టి.. అది ‘డెత్ వాక్’ లేదా ‘డెత్ మార్చ్’ చేసింది అనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.ఆధారాలు లేకున్నా.. చిత్ర బృందం ఆ పెంగ్విన్‌ను ఫాలో చేయగా.. 80 కిలోమీటర్ల దూరంలో వేరే కాలనీ నుంచి ఇలాగే ఒంటరిగా వచ్చిన పెంగ్విన్‌ను గుర్తించింది. 19 సంవత్సరాల తర్వాత ఒంటరి పెంగ్విన్ వీడియో బయటకు వచ్చి, వైరల్ అయినా.. అసలు విషయం మాత్రం వెలుగులోకి రాలేదు. ఈ నేపథ్యంలో నిర్మాత వెర్నర్ రెండో వీడియోను విడుదల చేయడం గమనార్హం. ఇది డెత్ వాక్ అనేది కేవలం వెర్నర్ హైపోథెసిస్ మాత్రమే..! అది నిజమనడానికి ఎలాంటి ఆధారాలు లేకున్నా.. సైంటిఫిక్‌గా వేర్వేరు కారణాలుంటాయని పర్యావరణవేత్తలు చెబుతున్నారు.‘నిహిలిస్ట్ పెంగ్విన్’ అంటే..మందను వీడి.. ఒంటరిగా దూరంగా వెళ్లే పెంగ్విన్లను ‘నిహిలిస్ట్ పెంగ్విన్’ అని పిలుస్తారు. నిహిలిస్ట్ అంతే.. జీవితం అర్థరహితమని.. పనికిరానిదనే భావన ఉంటుంది. అంటే.. జీవితం వృథా అనే భావనతో మరణమే శరణ్యం అనే అర్థం వస్తుంది. కానీ, పెంగ్విన్లకు ఆత్మహత్య చేసుకునే ధోరణి ఉండదని నిపుణులు చెబుతున్నారు. కేవలం ఈ వీడియోను చూసిన మానవుల భావోద్వేగాల నుంచి పుట్టిన ‘డెత్ వాక్’ అనే మాటను పెంగ్విన్లపై రుద్దుతున్నారంటున్నారు. పెంగ్విన్లలో ఉండే సహజసిద్ధమైన నావిగేషన్‌లో లోపాలతో అవి మందకు దూరంగా వెళ్తాయని వివరిస్తున్నారు.అందుకే మందను వీడతాయా?అంటార్కటిక్లో సూర్యకాంతి ఒకేలా ఉండదు. దాంతో.. పెంగ్విన్లు తమ జీవ గడియారాన్ని నమ్ముకుంటాయి. దాన్ని బట్టి గమనాన్ని కొనసాగిస్తాయని పలు పరిశోధనలు వెల్లడించాయి. సూర్యుడు ఉన్నప్పుడు అవి సముద్రం వైపు వెళ్లడం, మేఘాలు కమ్ముకున్నప్పుట్లు దారీతెన్ను లేకుండా వెళ్లడం జరుగుతుంది. అప్పటికి కూడా పెంగ్విన్లు జీవగడియారానికి భూ అయస్కాంత క్షేత్రం ఆధారంగా గమనాన్ని నిర్దేశించుకుంటాయి. పెంగ్విన్లలో ఈ జీవ గడియారానికి సంబంధించిన నావిగేషన్ సిగ్నల్స్ మందగిస్తే.. అవి మందను వీడుతాయని పలు పరిశోధనలు చెబుతున్నాయి. ఒకవేళ తమ మందను తిరిగి కలిస్తే.. అవి సాధారణంగా వ్యవహరిస్తాయని వివరిస్తున్నాయి. ‘డీరేంజ్డ్ పెంగ్విన్’ అంటే..పెంగ్విన్లు మందను వీడడానికి అనారోగ్యం లేదా శారీరక బలహీనత మరో కారణమని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. గాయాలు తగిలినప్పుడు.. వాటి ఇన్ఫెక్షన్ మెదడును ప్రభావితం చేస్తే.. మతిభ్రమించినట్లుగా పెంగ్విన్లు ఒంటరితనాన్ని కోరుకుంటాయి. అధిక జ్వరం కారణంగా కూడా పెంగ్విన్ల నాడీ వ్యవస్థ డిస్టర్బ్ అవుతుంది. ఇలాంటి పెంగ్విన్లను ‘డీరేంజ్డ్ పెంగ్విన్’ అంటారు. మెదడుపై ఇన్ఫెక్షన్ ప్రభావం కారణంగా ఈ పెంగ్విన్లు సముద్రంలోకి వెళ్లాలనే సాధారణ విషయాన్ని కూడా మరిచిపోతాయి.అధ్యయనాలు ఏం చెబుతున్నాయి?మానవుల్లాగే పెంగ్విన్లకు కూడా మానసిక ఒత్తిడి ఉంటుందని పలు అభిప్రాయాలున్నాయి. ఒత్తిడి కారణంగా అవి తమ మనుగడకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటాయని తెలుస్తోంది. అంటే.. మందను విడిచి దూరంగా వెళ్లడం. పెంగ్విన్లలో మానసిక ఒత్తిడికి సంబంధించి ఇప్పటి వరకు శాస్త్రీయమైన అధ్యయనాలు జరగలేదు. అయితే.. తనను తాను చంపుకోవాలని పెంగ్విన్లు ఎన్నడూ ఆలోచించవని పలు అధ్యయనాలు వివరించాయి. అందుకే.. ‘డెత్ వాక్’ లేదా ‘డెత్ మార్చ్’ అనే హైపోథెసిస్ తప్పనే వాదనలు వినిపిస్తున్నాయి.ఒంటరి పెంగ్విన్ వైరల్ వీడియో సంగతి ఎలా ఉన్నా.. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ అంశంపై మీమ్స్ బాగా పెరిగాయి. ఆ మీమ్స్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ‘‘మనుషులు కూడా బోర్ కొడితే ఇంతే..’’ అంటూ ఓ నెటిజన్ ఎక్స్‌లో రాసుకురాగా.. నిహిలిస్ట్ అనే సిద్ధాంతంపై పుంకానుపుంకాలుగా నెట్టింట చర్చలు జరుగుతున్నాయి. ఇక ట్రంప్‌నకు వ్యతిరేకంగా కూడా మీమ్స్ వస్తున్నాయి.ఆ పెంగ్విన్‌ను ట్రంప్‌గా పోలుస్తూ..ఆ పెంగ్విన్‌ను ట్రంప్‌గా పోలుస్తూ.. అమెరికా జెండాతో వెళ్తున్నట్లుగా.. గ్రీన్లాండ్లో ఆ జెండాను పాతుతున్నట్లుగా వచ్చిన మీమ్‌కు మిలియన్ల వ్యూవ్స్ రావడం గమనార్హం..! ఇక ఢిల్లీ పోలీసులు వినూత్నంగా 70 మీటర్లు వెళ్లినా.. 70 కిలోమీటర్లు వెళ్లినా.. హెల్మెట్ తప్పనిసరి అంటూ ఆ పెంగ్విన్ చిత్రంతో ప్రచారం చేస్తున్నారు. మేజర్ కీ క్యాపిటల్ అనే నెటిజన్ ఏకంగా నిహిలిజం అనేది కేవలం మీమ్ కాదని.. ఇది జెన్-జీ మానసిక స్థితి అని పేర్కొన్నారు. తోష్ఎక్స్ అనే వినియోగదారుడు ఆ ఒక్క పెంగ్విన్‌ను క్రిప్టో వినియోగదారుడిగా పేర్కొనడం కూడా మిలియన్లలో వ్యూవ్స్ తెచ్చిపెట్టింది.మానవ భాషలను పోలి..ఏది ఏమైనా.. ఇది చదివిన తర్వాత.. ఆ ఒంటరి పెంగ్విన్ మందకు ఎందుకు దూరమైందనే ప్రశ్నకు మీకు ఓ సమాధానం దొరికే ఉంటుంది. అయితే.. పెంగ్విన్లు ఎగరలేని పక్షులు. గుంపులుగా జీవిస్తాయి. సముద్రంలో చేపల కదలికలను నిశితంగా గమనించి, వేటాడుతాయి. సమష్టిగా వేటకు ఉపక్రమిస్తాయి. బ్రిటన్‌కు చెందిన రాయల్ సొసైటీ ఆఫ్ ఓపెన్ సైన్స్ నిర్వహించిన అధ్యయనంలో పెంగ్విన్ల వేటపై స్పష్టమైన వివరాలున్నాయి. పెంగ్విన్ల శబ్దాలు కొంత వరకు మానవ భాషలను పోలి ఉంటాయిని ఇటలీలోని యూనివర్సిటీ ఆఫ్ టురిన్ జరిపిన అధ్యయనంలో తేలింది.పెంగ్విన్లు అలా కాదు.. ఎందుకంటే..మనుషులు ఎక్కువగా ఉపయోగించే ‘హా..’, ‘ఊ..’ వంటి పదాలను పెంగ్విన్లు వాడుతాయి. 2020లో పెంగ్విన్ల స్వరాలపై నిర్వహించిన అధ్యయనంలో అవి తమ శక్తిని రెట్టింపు చేయడానికి ఇలాంటి శబ్దాలను ఉచ్ఛరిస్తాయని తేలింది. మిగతా జంతువులు, పక్షులు అద్దంలో తమ ప్రతిబింబాన్ని చూస్తే.. వింతగా ప్రవర్తిస్తాయి. తమలాంటి జీవి అక్కడ ఉన్నట్లు భావిస్తాయి. కానీ, పెంగ్విన్లు అలా కాదు. అద్దంలో తమ ప్రతిబింబాన్ని చూస్తే.. అందంగా ముస్తాబవుతున్నట్లు ప్రతిస్పందిస్తాయి. పెంగ్విన్లపై అధ్యయనం చేసిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ ఎథాలజిస్ట్ అనింద్య సిన్హా కూడా ఇతర పక్షులకు లేని విధంగా పెంగ్విన్లకు మానవుల మాదిరిగా తమపై తమకు అవగాహన ఉంటుందని వివరించారు. -
చావును వెతుక్కుంటూ 70 కి.మి ప్రయాణించి.. చివరకు..The Nihilist Penguin సోర్టీ ఇదే
ప్రపంచం చాలా వేగంగా పరిగెడుతోంది.. డెడ్లైన్లు, బాధ్యతలు, బిల్లులు, stress… ఈ గందరగోళం మధ్య “ఇవన్నీ వదిలేసి ఎక్కడికైనా ఒంటరిగా వెళ్లిపోవాలి?” అనే భావన చాలామందిలో ఉంటుంది. ఇప్పుడు కనిపించబోయే ఈ సీన్… మీ మనసు లోతుల్లో ఉన్న భావనకి మౌనంగా సమాధానం.ఇంటర్నెట్లో ఓ వీడియో ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతోంది. అదే ఒంటరిగా నడుచుకుంటూ వెళ్లే ఒక చిన్న పెంగ్విన్. దాన్ని నెటిజన్లు ప్రేమగా “ది నిహిలిస్ట్ పెంగ్విన్” అని పిలుస్తున్నారు, అంటే ఇక ఏదీ పట్టించుకోని పెంగ్విన్. ఎందుకంటే అది వెళ్లే దారిలో ఎవరూ లేరు, ఏ శబ్దం లేదు, ఏ గమ్యం కూడా లేదు.ఈ వీడియో కొత్తది కాదు. ఇది 2007లో వచ్చిన ప్రఖ్యాత జర్మన్ దర్శకుడు వెర్నర్ హెర్జోగ్ తీసిన Encounters at the End of the World అనే డాక్యుమెంటరీ నుంచి తీసుకున్న క్లిప్.డాక్యుమెంటరీ వీడియోలో డాక్టర్ డేవిడ్ ఎయిన్లే మాట్లాడుతూ.. ‘ఒక వేళ ఆ పెంగ్విన్ అక్కడి నుంచి తిరిగి కాలనీకి వచ్చేద్దామని అనుకున్నా కూడా సాధ్యపడదు. తిరిగి రావటం కూడా ‘డెత్ మార్చ్’ అవుతుంది. మార్గం మధ్యలోనే అది చనిపోయే అవకాశం ఉంది’ అని అన్నారు. ఆ డాక్యుమెంటరీ వీడియో తీసిన ఫిల్మ్ మేకర్ వెర్నర్ హెర్జోగ్ మాట్లాడుతూ...వీడియో తీసిన కొంత సేపటికే ఆ పెంగ్విన్ చనిపోయి ఉంటుంది. అది చనిపోవడానికి ముందు అంటార్కిటికా మంచు పర్వతాల్లో దాదాపు 70 కిలోమీటర్లు ఒంటరిగా నడిచింది’ అని చెప్పారు. అయితే, ఆ పెంగ్విన్ అలా అన్నిటినీ వదలి చావును వెతుక్కుంటూ వెళ్లిపోవటం వెనుక ఉన్న సరైన కారణం ఇంత వరకు తెలియరాలేదు. తన భాగస్వామి చనిపోవటం వల్ల ఆ పెంగ్విన్ డిప్రెషన్లోకి వెళ్లిపోయిందని, ఆ బాధలో డెత్ మార్చ్ చేసి ప్రాణాలు తీసుకుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.ఇప్పుడు ఈ క్లిప్ సోషల్ మీడియాలో మళ్లీ వైరల్ అయింది. ముఖ్యంగా దీనికి ఒక పాటను జోడించిన తర్వాత ఇది మరింత ఎమోషనల్ గా మారింది. కానీ అసలు ప్రశ్న ఇదే… ఈ పెంగ్విన్ వీడియోకి ఇంత క్రేజ్ ఎందుకు? ఎందుకంటే ఇది మనల్నే చూపిస్తోంది. ఆఫీసు కుర్చీలో కూర్చొని, ల్యాప్‌టాప్ ముందు కళ్ళు ముడుచుకుని “ఇక చాల్రా… అన్నీ వదిలేసి ఎక్కడికైనా వెళ్లిపోవాలి” అనిపించిన క్షణాల్ని ఇది గుర్తుచేస్తోంది. పెంగ్విన్ మాటలు మాట్లాడదు, కానీ దాని నడక చెబుతోంది – “నాకు శాంతి కావాలి, నాకు స్వేచ్ఛ కావాలి, నాకు కొంచెం ఒంటరితనం కావాలి.అని.ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతున్న ఈ పెంగ్విన్ వీడియో చూసి నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు..ఇది ఒక పెంగ్విన్ కథ కాదు, ఇది మన ఆత్మ కథ. అని కామెంట్లు పెడుతున్నారు. పెంగ్విన్ వీడియోపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా స్పందించారు. ఆ పెంగ్విన్‌తో తాను కూడా నడుచుకుంటూ వెళుతున్నట్లు ఓ ఏఐ ఫొటో క్రియేట్ చేశారు. -
పెంగ్విన్లు ఏలియన్లా?
ఏలియన్స్ అంటే భూమి అవతల ఎక్కడో గ్రహాల్లోనో, సుదూర సౌర వ్యవస్థల్లోనో ఉన్నాయని అనుకుంటున్నాం. కానీ ఏలియన్స్ ఎప్పుడో భూమ్మీదికి వచ్చి ఉంటాయని, ఇప్పటికీ వాటి అవశేషాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మరి ఆ ఏలియన్స్ ఏమిటో తెలుసా..? మంచు ప్రాంతాల్లో తిరిగే పెంగ్విన్ పక్షులట. మరి ఈ విశేషాలు ఏమిటో చూద్దామా? ఉండటమే చిత్రంగా.. భూమి ఉత్తర, దక్షిణ ధృవాల్లోని మంచు ప్రాంతాల్లో జీవించే పక్షులు పెంగ్విన్లు. మామూలుగానే అవి చిత్రంగా ఉంటాయి. పేరుకు పక్షులే అయినా ఎగరలేవు. నిటారుగా రెండు కాళ్లపై నిలబడతాయి, అలాగే నడుస్తాయి. నీటిలో బుడుంగున మునుగుతూ, తేలుతూ వేగంగా ఈదుతాయి. గుంపులు గుంపులుగా జీవిస్తాయి. ఇంతవరకు బాగానే ఉన్నా.. భూమ్మీద ఏ జీవిలోనూ లేని ఓ ప్రత్యేకమైన రసాయన పదార్థం పెంగ్విన్లలో ఉన్నట్టు తాజాగా గుర్తించడం ఆసక్తి రేపుతోంది. శుక్రగ్రహంలోని రసాయనం యూకేకు చెందిన లండన్ ఇంపీరియల్ కాలేజీ ప్రొఫెసర్ డేవ్ క్లెమెంట్స్ ఆధ్వర్యంలోని శాస్త్రవేత్తలు ఫాక్లాండ్ ప్రాంతంలోని గెంటూ రకం పెంగ్విన్లపై కొద్దిరోజులుగా పరిశోధన చేస్తున్నారు. ఈ క్రమంలోనే వాటి విసర్జితాలను పరిశీలిస్తుండగా.. ‘ఫాస్పైన్’ అనే రసాయనం ఆనవాళ్లు లభించాయి. భాస్వరం, హైడ్రోజన్ మూలకాల సమ్మిళితం అయిన ఈ రసాయనం.. సాధారణంగా భూమ్మీది ఏ జీవిలోనూ ఉండదని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. గత ఏడాదే శుక్రగ్రహ వాతావరణంలో ‘ఫాస్పైన్’ జాడను కనిపెట్టిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. హా 6.1 కోట్ల కిలోమీటర్ల దూరంలోని శుక్రుడిలో ఉన్న రసాయనం పెంగ్విన్ల విసర్జితాల్లో ఉండటం అంటే.. అవి బహుశా మరో ప్రపంచానికి చెందిన జీవులు (ఏలియన్లు) అయి ఉండవచ్చని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అసలు పెంగ్విన్లలో ఈ రసాయనం ఎలా ఉత్పత్తి అవుతోందన్న దానిని పరిశీలిస్తున్నామని ప్రకటించారు. ఫాస్పైన్.. వెరీ డేంజర్ ఫాస్పైన్ ప్రమాదకర వాయువు. అత్యంత విషపూరితమైనది. పీల్చుకుంటే నిమిషాల్లోనే ప్రాణాలు తీస్తుంది. వేగంగా మండిపోయే స్వభావం ఉంటుంది. దీనిని పారిశ్రామికంగా తయారు చేస్తారు. కీటక నాశనులు, ఎలుకల మందు వంటివాటి తయారీలో వినియోగిస్తారు. కొన్ని పరిశ్రమల్లో మంటలకు ఇంధనంగా, సెమీకండక్టర్ల తయారీ ప్రక్రియలో వినియోగిస్తారు. ఏలియన్ల జాడ తెలుసుకోవచ్చా? పెంగ్విన్ల జీవన విధానం, వాటి శరీరంలోని రసాయనాలను పరిశీలించడం ద్వారా.. భవిష్యత్తులో ఏలియన్ల జాడను గుర్తించేందుకు వీలవుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. గతంలో ఎప్పుడో గ్రహాంతర వాసులు భూమ్మీదికి వచ్చి వెళ్లి ఉంటారని.. ఆ క్రమంలోనే పెంగ్విన్ల వంటి ప్రత్యేక జాతులు అభివృద్ధి చెంది ఉంటాయని మరికొందరు శాస్త్రవేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
ఓ మనిషి కోసం 5,000 మైళ్లు ఈదుకుంటూ వస్తున్న పెంగ్విన్
బ్రసీలియా: మనిషి, కుక్క మధ్య ఆప్యాయత, అనుబంధం ఉంటుందని మనకు తెలుసు. అదే మనిషి, పెంగ్విన్ పక్షి మధ్య అలాంటి ఆప్యాయత, అనుబంధమే ఏర్పడితే విచిత్రమంటాం. బ్రెజిల్‌కు చెందిన 71 ఏళ్ల వృద్ధుడు జొహావో పీరా డిసౌజా, పెంగ్విన్ మధ్య ఇలాంటి ప్రేమానుబంధం గత నాలుగేళ్లుగా కొనసాగుతోంది. ప్రతి ఏటా మనిషి మిత్రుడిని కలుసుకునేందుకు పెంగ్విన్ పక్షి 5,000 మైళ్ల దూరంలోని ఆర్జెంటీనా, చిలీ తీరం నుంచి ఈదుకుంటూ వస్తుంది. 8 నెలల పాటు డిసౌజాతో గడుపుతోంది. తిరిగి బ్రీడింగ్ కోసం ఐదువేల మైళ్లు ఈదుకుంటూ వెళుతోంది. 2011 నాటి నుంచి ఇప్పటి వరకు పెంగ్విన్ పక్షి ప్రతి ఏడాది వచ్చి పోతోందని, జూన్ నెలలో వచ్చి ఫిబ్రవరి నెలలో గుడ్లు పెట్టేందుకు, తన పిల్లలను చూసుకునేందుకు వెళ్లి పోతుందని డిసౌజా ఓ టీవీ ఇంటర్వ్యూలో తాజాగా వెల్లడించారు. తాపీ పనిచేసే తాను అప్పుడప్పుడు చేపల వేటకు వెళుతుంటానని, అలా 2011లో ఒకనాడు చేపల వేటకు వెళ్లినప్పుడు సముద్రం పక్కన దట్టమైన చమురులో చిక్కుకొని ఆకలితో బాధ పడుతున్న పెంగ్విన్ పక్షి తనకు తారసపడిందని, దాన్ని కాస్త నీటితో కడిగి ఇంటిని తీసుకెళ్లానని, రెక్కలకంటిన చమురును పూర్తిగా తొలగించేందుకు తనకు వారం రోజులు పట్టిందని డిసౌజా వివరించారు. మరో వారం రోజులపాటు పూర్తిగా కోలుకునే వరకు తనతోనే ఉంచుకున్నానని, ఆ తర్వాత దాన్ని తీసుకొచ్చి సముద్ర తీరాన వదిలిపెడితే వెళ్లిపోయిందని, మళ్లీ కనిపించదని కూడా అనుకున్నానని ఆయన చెప్పారు. ఓ నాలుగు నెలల తర్వాత మరోసారి సముద్ర తీరానికి చేపల వేటకు వచ్చినప్పుడు ఆ పెంగ్విన్ పక్షి తన కోసం నిరీక్షిస్తూ కనిపించడం ఆశ్చర్యం వేసిందని డిసౌజా తెలిపారు. తన ఇంట్లో ఉన్నప్పుడు దానికి ఆహారంగా రోజు చేపలు తీసుకొచ్చి పెట్టేవాడినని, అలా తమ మధ్య విడదీయ అనుబంధం ఏర్పడిందని ఆయన చెప్పారు. ఎప్పుడూ తన వద్దకు వచ్చి ఒళ్లో కూర్చుంటుందని, తన ముక్కుతో ముఖమంతా తడుముతూ తన ప్రేమను చాటుతుందని ఆయన అన్నారు. సకాలంలో దాన్ని తాను ఆదుకోకపోతే పెంగ్విన్ చనిపోయి ఉండేదని, తనకు ప్రాణదానం చేసినందుకు ఇంత అభిమానం చూపిస్తుందేమోనని ఆయన వ్యాఖ్యానించారు. దానికి ముద్దుగా డిండిమ్ అని కూడా పేరు పెట్టినట్లు చెప్పారు. బ్రెజిల్‌లోని రియో డి జనిరో దీవిలో ఉండే డిసౌజా వద్దకు దక్షిణ అమెరికా ప్రాంతానికి చెందిన పెంగ్విన్ దాదాపు 5000 వేల మైళ్లు ఈదుకుంటూ రావడం నిజంగా ఓ అద్భుతమేనని, తాము పెంగ్విన్ పక్షుల్లో ఇలాంటి ప్రవర్తనను ఇంతవరకు చూడలేదని బయోలోజిస్ట్ పావులో క్రెజివిస్కీ వ్యాఖ్యానించారు. పెంగ్విన్ పక్షి డిసౌజాను అచ్చం తన కుటుంబానికి చెందిన పెంగ్విన్‌లానే చూస్తోందని, అలాగే డిసౌజా కూడా తన కుటుంబంలోని వ్యక్తిగానే దాన్ని చూసుకుంటున్నారని ఆయన అన్నారు.


