విపత్తు మిగిల్చిన విషాదం..! పాపం ఆ పసివాడు.. | Little boy carries younger sister while searching for missing parents | Sakshi
Sakshi News home page

విపత్తు మిగిల్చిన విషాదం..! తల్లిదండ్రుల ఆచూకీ కోసం..ఆ పసివాడు..

Aug 31 2026 2:49 PM | Updated on Aug 31 2026 3:55 PM

 Little boy carries younger sister while searching for missing parents

నేపాల్‌ జలప్రళయం అంతులేని విషాదాన్ని మిగల్చడమే కాదు ఎందరో చిన్నారులను అభాగ్యులగా మార్చేసింది. ఆ విషాదం గడిచి నాలుగురోజులైన దాని తాలుకు బాధకర దృశ్యాలు ఇంకా వెన్నాడుతూనే ఉండటం బాధకరం. అందుకు సంబంధించిన ఓ హృదయ విదారక వీడియో అందర్నీ కంటతడిపెట్టిస్తోంది. 

నేపాల్‌ భారీ వరదల తాలుకా ఓ వీడియో అందరీ హృదయాలను కదిలిస్తోంది. ప్రస్తుతం అక్కడంతా తమ వాళ్ల ఆచూకీ కోసం పడిగాపులు పడుతున్న ఘోషే కనిపిస్తుంది. ఎటు చూసినా శవాల దిబ్బ, బురదతో కలిసి శోక సంద్రాన్ని తలపించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియోలో ఇద్దరు పసివాళ్లు కనిపిస్తున్న తీరు చూస్తే గుండెతరక్కుపోతుంది. 

వరద ప్రభావిత ప్రాంతాల గుండా ఆ బాలుడు తన చెల్లిని వీపుపై మోస్తూ నీరసంగా నడుస్తూ కనిపిస్తాడు. అతడు ఆమెను ఓదార్చేలా దగ్గరకు పట్టుకున్నట్లుగా ఆ పరిసర ప్రాంతాల్లో కలయతిరగడం చూస్తే..ప్రకృతి విపత్తు మిగిల్చే విషాదం ఇంత భయానకంగా ఉంటుందా అనిపిస్తుంది. ఆ చిన్నారి తన తల్లిదండ్రుల ఆచూకీ కోసం తిరుగుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం అక్కడ అధికారులు వరద బాధితుల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. 

అయితే నేపాల్‌ వరదలతో అతలాకుతలమైన తరుణంలో బయటకు వచ్చిన ఈ వీడియో ప్రకృతి విపత్తు  ఇద్దరు చిన్నారులకు ఎలాంటి కష్టాలను మిగిల్చిందనే దానిపై అందరి దృష్టికి తీసుకొచ్చింది. అయితే ఈ వీడియోలో కనిపిస్తున్న చిన్నారి నిజంగానే పేరెంట్స్‌ ఆచూకీ కోసమే తిరుగుతున్నాడా లేక ఇంకేదైనా కారణమా అన్నది నిర్థారణ కావాల్సి ఉంది. 

కాగా, నెట్టింట వైరల్‌ అవుతున్న ఆ వీడియోని చూసి నెటిజన్లు చిన్నారులు అంత నిస్సహాయంగా తిరుగుతుంటే సాయం చేయడం మానేసి వీడియో తీస్తున్న వ్యక్తి ఎవరు అంటూ తిట్టిపోస్తున్నారు. మరికొందరు..తోబుట్టువుల అనుబంధాన్ని చాటిచెప్పడమే కాదు ఆ చిన్న భుజాలు ఎంత పెద్ద బాధ్యతను మోస్తున్నాయి. వారి కళ్లను చూస్తుంటేనే బాధంతా అర్థమైపోతోంది అంటూ పోస్టులు పెట్టారు. 

(చదవండి: ఆ చీరే మా ప్రాణాలను రక్షించింది..! నేపాల్‌ జలప్రళయంలో ఓ అద్భుతం..)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement