వర్షం పడితే ఈ ద్వీపం అందం రెట్టింపు.. ఎక్కడో తెలుసా? | Bali Rainy Season Travel Guide Indonesia Trip | Sakshi
Sakshi News home page

వర్షం పడితే ఈ ద్వీపం అందం రెట్టింపు.. ఎక్కడో తెలుసా?

Aug 31 2026 11:40 AM | Updated on Aug 31 2026 11:46 AM

Bali Rainy Season Travel Guide Indonesia Trip

పర్యటన

ఇండోనేషియా

ర్షం కొన్ని ప్రదేశాలను మరింత అందంగా కనువిందు చేస్తుంది. డబుల్‌ బ్యూటీతో అలరించే ద్వీపాల సమూహమైన ఇండోనేషియా వర్షంలో కొత్త రంగులను పులుముకుంటుంది. మిగతా రోజుల్లో బాలి వెళ్లిన వాళ్లు వర్షాకాలంలో మరోసారి వెళ్లాల్సిందే అనుకుంటారు. చిరుజల్లులతో ఆకులపై నిలిచే చినుకులు, జారి నేలపై పడటం.. ఆలయ సమూహంలో నిలిచే నీరు.. ఇవన్నీ మణిరత్నం సినిమాలోని ఫ్రేమ్‌లా అనిపిస్తాయి.

ఇండోనేషియా అంటే ఒక దేశం మాత్రమే కాదు. ఇది ఎన్నో ద్వీపాల సమూహం.  ఏకంగా 17,380కు పైగా ద్వీపాలు ఉన్న ఈ దేశానికి ఒక వైపు సముద్రం ఉంటే మరోవైపు అగ్నిపర్వతాలు ఉంటాయి. ఇందులో బాలీ, జావా, లంబోక్‌ వంటి ద్వీపాలకు వెళ్లేందుకు చాలా మంది ఇష్టపడతారు. దీనికి కారణం ఇక్కడి బ్యూటీ అనేది సీజన్‌ ను బట్టి మారుతుంది.

ఎలా వెళ్లాలి..

  • బాలి ఎలా వెళ్లాలి అని చాలా మంది ఆన్‌ లైన్‌ లో సెర్చ్‌ చేస్తుంటారు. ఈ సమాచారం వారికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాం. ముందుగా హైదరాబాద్‌లోని శంషాబాద్‌ నుంచి ఈ డ్రీమ్‌ జర్నీ మొదలవుతుంది. కౌలాలంపూర్‌ లేదా సింగపూర్‌ మీదుగా సాగే ట్రిప్‌ మేఘాల సముద్రంలో పడవలో వెళ్తున్నట్టు అనిపిస్తుంది.

  • అలాగే బాలిలోని న్గురా రాయ్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిన వెంటనే ఒక చల్లని గాలి వచ్చి హాయ్‌ అని పలకరిస్తుంది. ఇదే ఇండోనేషియా వెల్‌కమ్‌ చెప్పే స్టైల్‌. ఈ విమానాశ్రయం డెన్‌ పసార్‌ నగరానికి సమీపంలోని టుబాన్‌ ప్రాంతంలో ఉంది. ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఉబుద్‌కు వెళ్లే సమయంలో సిటీ గజిబిజి నుంచి ప్రశాంతమైన పచ్చని పొలాల మధ్య ఈ ట్రాన్సిషన్‌ ఎంత స్మూత్‌గా జరుగుతుందో గమనించవచ్చు.

  • విజయవాడలో ఉన్న వారు ఉదయానికి హైదరాబాద్‌ చేరుకుని అక్కడి నుంచి జర్నీని ్రపారంభించవచ్చు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రయాణం అంటే గమ్యస్థానానికి చేరుకోవడమే కాదు.. ఆ ప్రయాణాన్ని ఎంజాయ్‌ చేయడమే.

ఆసక్తికరమైన విషయాలు..

  • 2024  గణాంకాల ప్రకారం ఇండోనేషియాలో

  • 17,380 ద్వీపాలు ఉన్నాయి.

  • బాలీ రాజధాని డెన్‌ పసార్‌. బాలీకి వచ్చే అంతర్జాతీయ పర్యాటకులకు న్గురా రాయ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రధాన ప్రవేశ ద్వారం.

  • ఉబుద్‌ బాలీ కళలు, సంప్రదాయాలు, సంస్కతికి ప్రసిద్ధి చెందిన ప్రాంతం.

  • జటిలువిహ్‌ వరి పొలాలు బాలీ యూనెస్కో గుర్తించి కల్చరల్‌ ల్యాండ్‌స్కేప్‌లో  భాగం.

  • ప్రపంచంలోనే అతిపెద్ద బల్లి జాతి అయిన కొమోడో డ్రాగన్‌ ఇండోనేషియాలోనే కనిపిస్తుంది.

ఏం తినాలి..

  • చాలా మంది ఫుడ్‌ లవర్స్‌ ఇండోనేషియా వెళ్లే ముందు అక్కడ మంచి ఫుడ్‌ లభిస్తుందా లేదా అని ఆలోచిస్తారు. వారిని ఇండోనేషియా అస్సలు డిస΄్పాయింట్‌ చేయదు. ఎందుకంటే భోజనం కూడా ప్రయాణంలో ఒక భాగమే.

  • నాసి గోరెంగ్‌ అనే ఫ్రై డ్‌ రైస్,  నంచుకోవడానికి ఫ్రై డ్‌ ఎగ్స్, ఫ్లేవర్‌ కోసం కొద్దిగా మిరపకాయ, వెల్లుల్లి, టమోటోలను దంచి చేసిన రోటి పచ్చడి లాంటి సాంబల్‌ ఇవన్నీ మన తెలుగు రుచులను గుర్తుచేస్తాయి. ముందు కాస్త కారంగా అనిపించినా, అరే టేస్ట్‌ బాగుంది అనిపిస్తుంది. రెండు రోజుల్లో అలవాటైపోతుంది.

  • అలాగే చాలా మంది ఇండోనేషియాలో ఎంజాయ్‌ చేసే ఫస్ట్‌ డిష్‌ వచ్చేసి గడో గడో అనే లోకల్‌ రెసిపీ. దీనిని ఒక రెసిపీ అనడం కన్నా సలాడ్‌ అనడం బాగుంటుంది. ఇండోనేషియాలోని చాలా ప్రాంతాల్లో ఈ డిష్‌ లభిస్తుంది.

ఏం చూడాలి..
ఇండోనేషియాను కళ్లతో కాకుండా మనసుతో చూడాలి. కెమెరా కన్నులకు కాస్త విశ్రాంతిని ఇచ్చి అక్కడి లైఫ్‌ను ఎంజాయ్‌ చేయాలి. స్థానికంగా ఉండే సందర్శనీయ ప్రదేశాల్లో చాలా మంది తెలియకుండానే అక్కడి జటిలువిహ్‌ వరి పొలాలను కూడా యాడ్‌ చేసుకుంటారు. సూర్యుడి వెలుగును బట్టి అక్కడి పొలాల అందం మారిపోతుంది. అలాగే ఉబుద్‌లో కెచక్‌ డ్యాన్‌ ్స చూడటం, ప్రాంబనన్‌ దేవాలయ దర్శనం, లంబోక్‌ తీరంలో కూర్చొని ఇండోనేషియాను కొత్త కోణంలో చూడటం ఇలా ఎన్నో ΄్లాన్‌ చేసుకోవచ్చు.

ఎక్కడ ఉండాలి..

  • ఇండోనేషియా వెళ్తే బాలిని చూడాలి.. ఉబుద్‌లో ఉండాలి అనే సింపుల్‌ థియరీ గుర్తుంచుకోవాలి. ఉబుద్‌లో ఉండటానికి కారణం అక్కడి ప్రకతి. ఇక్కడ చెట్ల మధ్య కలపతో చేసిన జోగ్లో హౌస్‌లు ఒక స్పెషల్‌ అట్రాక్షన్‌ గా నిలుస్తాయి.

  • వాటి ముందు చిన్న కొలను, చుట్టూ వరి చేలుం మార్నింగ్‌ లేవగానే బాల్కనీలో కూర్చుని.. ఆల్రెడీ తడిసిన పొలాలపై పడే వర్షాన్ని చూస్తూం కాఫీ లేదా చాయ్‌ సిప్‌ చేస్తుంటే వచ్చే ఫీలింగ్‌కు ఏం పేరు పెట్టగలమో చెప్పండి.

  • ఒకవేళ మీరు సముద్రానికి దగ్గరగా ఉండాలి అనుకుంటే సనూర్, సెమిన్యాక్‌లో కూడా ΄్లాన్‌ చేసుకోవచ్చు. ఇక్కడి విల్లాల్లో ఉంటే ఒకవైపు సముద్రం హోరు, మరోవైపు వర్షపు జోరు రెండూ కలిస్తే వచ్చే మ్యూజిక్‌ ఒక మ్యాజిక్‌లా ఉంటుంది.

  • యోగ్యకర్త అనే ప్రదేశంలో అయితే పాతకాలపు హోటళ్లు ఉంటాయి, గోడల మీద బటిక్‌ పెయింటింగ్స్, మూలల్లో చెక్క బొమ్మలు కనిపిస్తాయి. ఒక్కసారిగా రాజుల కాలంలోకి వెళ్లిపోయినట్టు అనిపిస్తుంది.

యాత్ర, బడ్జెట్‌ వివరాలు..

  • హైదరాబాద్‌ నుంచి ఐదు రోజుల బాలి ట్రిప్‌ కోసం సుమారు రూ.65 వేల నుంచి రూ.80 వేల వరకు ఖర్చు కావచ్చు. ఇందులో ఫుడ్, ఫ్లైట్, స్టే వంటి ఖర్చులు ఉంటాయి. కాస్త లగ్జరీగా ట్రావెల్‌ చేయాలి అనుకుంటే రూ.90 వేల నుంచి రూ.1 లక్షా 20 వేల వరకు, అల్ట్రా లగ్జరీ ట్రిప్‌కోసం రూ.1 లక్షా 50 వేల వరకు ఖర్చయ్యే అవకాశం ఉంది.

  • హైదరాబాద్‌ నుంచి బాలి రిటర్న్‌ ఫ్లైట్‌ కాస్ట్‌ అనేది టికెట్‌ బుకింగ్‌ టైమ్, ఎయిర్‌లైన్‌ ను బట్టి మారుతుంది. విజయవాడ నుంచి బాలి వెళ్లాలి అనుకుంటి ఫ్లైట్‌ కాస్ట మరింత పెరిగే అవకాశం ఉంటుంది. స్టే విషయానికి వస్తే హోమ్‌స్టేలు, హోటల్స్‌ బడ్జెట్‌ నుంచి లగ్జరీ వరకు వివిధ ధరల్లో లభిస్తాయి.

  • భారతీయులు బాలికి వెళ్లాలి అంటే ఆన్‌ అరైవల్‌ వీసా పొందవచ్చు. దీని కోసం 5 లక్షల ఇండోనేషియా రుపియాలు ఖర్చు అవుతాయి. ఈ వీసాతో 30 రోజుల వరకు ఇండోనేషియాలో ఉండవచ్చు. ఒకసారి మరో 30 రోజులు పొడిగించుకునే అవకాశం ఉంది

– ఎం.జి. కిశోర్, ప్రయాణికుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement