ఆ రాష్ట్ర సీఎం విజయ్ వెల్లడి
సాక్షి, చెన్నై: తమిళనాడులో కొత్త శాసనసభ, సచివాలయ భవన సముదాయాన్ని నిర్మించాలని విజయ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రూ.1,200 కోట్లను కేటాయించాలని నిర్ణయించినట్లు తమిళనాడు సీఎం విజయ్ ప్రకటించారు.
ఈ నిర్మాణాలు వందేళ్ల పాటు ఉపయోగపడేలా తీర్చిదిద్దుతామని గురువారం అసెంబ్లీలో ఆయన ప్రకటించారు. అలాగే, ప్రస్తుతం ఉన్న సెయింట్ జార్జ్ కోట భవనాలను రాబోయే తరాల కోసం వారసత్వ చిహ్నలుగా భద్రపరుస్తామని చెప్పారు. ఒలింపిక్ సిటీ, మోటార్ స్పోర్ట్స్ సిటీలకు కూడా రూపకల్పన చేస్తున్నట్లు తెలిపారు.


