న్యాయ విద్యార్థులపై చర్యలకు సుప్రీం ఆక్షేపణ
అడ్వొకేట్లుగా నమోదైన తరువాతే బీసీఐ పరిధిలోకి
నల్సార్ విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్ అడ్డుకోవడంపై సుప్రీం కీలక తీర్పు
బీసీఐ ఛైర్మన్ ఆదేశాలు సరికాదని స్పషీ్టకరణ
గంటలోపే ఆదేశాలు ఉపసంహరించుకున్నామన్న బీసీఐ
సాక్షి, న్యూఢిల్లీ: న్యాయ విద్యార్థులపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే అధికారం బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ), రాష్ట్ర బార్ కౌన్సిళ్లకు లేదని దేశ సర్వోన్నత న్యాయస్థానం గురువారం స్పష్టం చేసింది. న్యాయ విద్యార్థులు అడ్వొకేట్లుగా నమోదైన తరువాతే బీసీఐ, రాష్ట్ర బార్ కౌన్సిళ్లకు ఆ అధికారం వస్తుందని తేల్చి చెప్పింది.
విద్యార్థులు ఉన్నంతవరకూ సంబంధిత విద్యా సంస్థలు లేదా బైలాస్ ప్రకారం అధికారమున్న సంస్థల నియమ నిబంధలు మాత్రమే వారికి వర్తిస్తాయని చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్య బాగ్చీ, జస్టిస్ వి.మోహనలతో కూడిన ధర్మాసనం కీలక న్యాయ ప్రకటన చేసింది.
‘మిహిరా సూద్ వర్సెస్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా’కేసులో ఈ తీర్పు వెలువడింది. హైదరాబాద్‌లోని నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా 2026 బ్యాచ్ విద్యార్థులు తమ స్నాతకోత్సవాలకు ముఖ్యఅతిథిగా సీజేఐని పిలవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఒక లేఖ రాయడం.. దీనికి స్పందనగా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ మన్నన్ కుమార్ మిశ్రా ఆగస్టు 13న సంచలన ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.
బీసీఐ ఛైర్మన్ నల్సార్ విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్ నిలిపివేత, విద్యార్థులు, అధ్యాపకులపై విచారణలకు ఆదేశించడంతో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దాంతో వాటిని గంటలోపే ఉపసంహరించుకున్నారు. అయినప్పటికీ ఆ ఆదేశాల చట్టబద్ధతను ప్రశి్నస్తూ నల్సార్ పూర్వ విద్యార్థులు మిహిరా సూద్, అభిõÙక్ తివారీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం...
గురువారం విచారణ సందర్భంగా పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది కె. పరమేశ్వర్ వాదిస్తూ.. బీసీఐ తన ఆదేశాలను ఉపసంహరించుకున్నప్పటికీ అవి ఏ ప్రాతిపదికన, ఎవరి నిర్ణయంతో, ఏ చట్ట నిబంధన ఆధారంగా జారీ అయ్యాయో తేలాల్సి ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ‘మొత్తం బ్యాచ్ ఎన్‌రోల్‌మెంట్‌ను నిలిపివేయాలని తొలుత ఆదేశించారు. ఈ నిర్ణయం ఎవరు తీసుకున్నారు? సమావేశం జరిగిందా? ఏ నిబంధన ఆధారంగా ఆదేశాలు ఇచ్చారు?’అని ప్రశ్నించారు.
ఇది ఒక్క విద్యార్థికి సంబంధించిన అంశం కాదని, విశ్వవిద్యాలయంలో భావ ప్రకటన స్వేచ్ఛకు సంబంధించిన కీలకమైన ప్రశ్న అని తెలిపారు. ఇందుకు బీసీఐ తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది మన్నన్ కుమార్ మిశ్రా మాట్లాడుతూ.. గంటలోపే ఆదేశాలను ఉపసంహరించుకున్నందున ఈ అంశాన్ని అంతటితో ముగించాలని ధర్మాసనాన్ని కోరారు. అయితే ధర్మాసనం మాత్రం ‘పరమేశ్వర్ వాదన సరైందిగా కనిపిస్తోంది.
బీసీఐకి విద్యార్థులపై అధికారం లేదు. న్యాయ విద్య పూర్తిచేసి అడ్వొకేట్‌గా నమోదై తర్వాత అతని వృత్తిగతమైన ప్రవర్తనను నియంత్రించే అధికారం ఉంటుంది’అని చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు. అంతేకాకుండా.. ఆగస్టు 13న జారీ చేసిన, అనంతరం సవరించిన అన్ని కమ్యూనికేషన్లను ‘చట్టపరమైన అధికారం లేనివి’గా బెంచ్ ప్రకటించింది. విద్యార్థులపై చర్యలు నిలిపివేస్తూ గతంలో జారీ చేసిన మధ్యంతర రక్షణ ఆదేశాలను తుది ఆదేశాలుగా సవరించింది.


