breaking news
Law students
-
బార్ కౌన్సిళ్లకు ఆ అధికారమెక్కడిది?
సాక్షి, న్యూఢిల్లీ: న్యాయ విద్యార్థులపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే అధికారం బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ), రాష్ట్ర బార్ కౌన్సిళ్లకు లేదని దేశ సర్వోన్నత న్యాయస్థానం గురువారం స్పష్టం చేసింది. న్యాయ విద్యార్థులు అడ్వొకేట్లుగా నమోదైన తరువాతే బీసీఐ, రాష్ట్ర బార్ కౌన్సిళ్లకు ఆ అధికారం వస్తుందని తేల్చి చెప్పింది. విద్యార్థులు ఉన్నంతవరకూ సంబంధిత విద్యా సంస్థలు లేదా బైలాస్ ప్రకారం అధికారమున్న సంస్థల నియమ నిబంధలు మాత్రమే వారికి వర్తిస్తాయని చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్య బాగ్చీ, జస్టిస్ వి.మోహనలతో కూడిన ధర్మాసనం కీలక న్యాయ ప్రకటన చేసింది. ‘మిహిరా సూద్ వర్సెస్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా’కేసులో ఈ తీర్పు వెలువడింది. హైదరాబాద్‌లోని నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా 2026 బ్యాచ్ విద్యార్థులు తమ స్నాతకోత్సవాలకు ముఖ్యఅతిథిగా సీజేఐని పిలవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఒక లేఖ రాయడం.. దీనికి స్పందనగా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ మన్నన్ కుమార్ మిశ్రా ఆగస్టు 13న సంచలన ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. బీసీఐ ఛైర్మన్ నల్సార్ విద్యార్థుల ఎన్రోల్మెంట్ నిలిపివేత, విద్యార్థులు, అధ్యాపకులపై విచారణలకు ఆదేశించడంతో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దాంతో వాటిని గంటలోపే ఉపసంహరించుకున్నారు. అయినప్పటికీ ఆ ఆదేశాల చట్టబద్ధతను ప్రశి్నస్తూ నల్సార్ పూర్వ విద్యార్థులు మిహిరా సూద్, అభిõÙక్ తివారీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం... గురువారం విచారణ సందర్భంగా పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది కె. పరమేశ్వర్ వాదిస్తూ.. బీసీఐ తన ఆదేశాలను ఉపసంహరించుకున్నప్పటికీ అవి ఏ ప్రాతిపదికన, ఎవరి నిర్ణయంతో, ఏ చట్ట నిబంధన ఆధారంగా జారీ అయ్యాయో తేలాల్సి ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ‘మొత్తం బ్యాచ్ ఎన్‌రోల్‌మెంట్‌ను నిలిపివేయాలని తొలుత ఆదేశించారు. ఈ నిర్ణయం ఎవరు తీసుకున్నారు? సమావేశం జరిగిందా? ఏ నిబంధన ఆధారంగా ఆదేశాలు ఇచ్చారు?’అని ప్రశ్నించారు. ఇది ఒక్క విద్యార్థికి సంబంధించిన అంశం కాదని, విశ్వవిద్యాలయంలో భావ ప్రకటన స్వేచ్ఛకు సంబంధించిన కీలకమైన ప్రశ్న అని తెలిపారు. ఇందుకు బీసీఐ తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది మన్నన్ కుమార్ మిశ్రా మాట్లాడుతూ.. గంటలోపే ఆదేశాలను ఉపసంహరించుకున్నందున ఈ అంశాన్ని అంతటితో ముగించాలని ధర్మాసనాన్ని కోరారు. అయితే ధర్మాసనం మాత్రం ‘పరమేశ్వర్ వాదన సరైందిగా కనిపిస్తోంది. బీసీఐకి విద్యార్థులపై అధికారం లేదు. న్యాయ విద్య పూర్తిచేసి అడ్వొకేట్‌గా నమోదై తర్వాత అతని వృత్తిగతమైన ప్రవర్తనను నియంత్రించే అధికారం ఉంటుంది’అని చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు. అంతేకాకుండా.. ఆగస్టు 13న జారీ చేసిన, అనంతరం సవరించిన అన్ని కమ్యూనికేషన్లను ‘చట్టపరమైన అధికారం లేనివి’గా బెంచ్ ప్రకటించింది. విద్యార్థులపై చర్యలు నిలిపివేస్తూ గతంలో జారీ చేసిన మధ్యంతర రక్షణ ఆదేశాలను తుది ఆదేశాలుగా సవరించింది. -
సివిల్ సర్వీసుకు న్యాయ పరిజ్ఞానం తోడ్పాటు
సబ్బవరం: ‘యూపీఎస్సీ, సివిల్ సర్వీసు పరీక్షల్లో న్యాయ విద్యార్థులు రాణించగలరు. ఇందుకు న్యాయ పరిజ్ఞానం తోడ్పడుతుంది. అదేవిధంగా చట్టాలను సమర్థంగా అమలు చేయడంతోపాటు శాంతిభద్రతల పరిరక్షణకు సైతం న్యాయ పరిజ్ఞానం దోహదపడుతుంది.’ అని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం కులపతి జస్టిస్ లీసా గిల్ అన్నారు. అనకాపల్లి జిల్లా సబ్బవరంలోని దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాన్ని శనివారం సీజే జస్టిస్ లీసా గిల్ సందర్శించారు. యూనివర్సిటీలో నూతనంగా నిర్మించిన విద్యార్థినుల వసతి గృహం, రెండు సమావేశ మందిరాలను ఆమె ప్రారంభించారు. అనంతరం విశ్వవిద్యాలయంలోని వివిధ విభాగాల్లో తరగతుల నిర్వహణ తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా సీజే జస్టిస్ లీసా గిల్ విద్యార్థులతో ముచ్చటించారు. విద్యార్థి దశ నుంచే లక్ష్యాన్ని నిర్దేశించుకుని, దాన్ని సాధించే దిశగా కృషి చేయాలని ఆమె సూచించారు. ప్రతి రంగంలో మహిళలకు కొన్ని అడ్డంకులు ఎదురవుతున్నప్పటికీ, అవి వారి ఆలోచనలు, ఆశయాలు, లక్ష్యాలను పరిమితం చేయకూడదని చెప్పారు. మహిళలు భవిష్యత్‌లో మార్గదర్శకులుగా నిలిచేలా లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకు సాగాలని సూచించారు.న్యాయ వ్యవస్థలో మహిళల ప్రాతినిధ్యం బాగా పెరుగుతోందిన్యాయవాద వృత్తిలో మహిళల పాత్రపై విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సీజే జస్టిస్ లీసా గిల్ సమాధానమిస్తూ... న్యాయ వ్యవస్థలో మహిళల ప్రాతినిధ్యం గణనీయంగా పెరుగుతోందని చెప్పారు. పంజాబ్–హరియాణ హైకోర్టులో ప్రస్తుతం సుమారు 70 శాతం మంది, పలు రాష్ట్రాల హైకోర్టుల్లో దాదాపు 65 శాతం మంది మహిళా న్యాయవాదులు ఉన్నారని తెలిపారు. న్యాయరంగంలో పరిస్థితులు మారుతున్నాయనడానికి ఇదే నిదర్శనమన్నారు. మొదటి తరం మహిళా న్యాయవాదులు వృత్తిలోకి ప్రవేశించినప్పుడు అనేక సవాళ్లు ఎదుర్కొన్నప్పటికీ.. అంకితభావం, పట్టుదలతో వాటిని అధిగమించారని చెప్పారు. న్యాయ విద్యార్థులు అత్యుత్తమ సివిల్ సర్వెంట్లుగా రాణించాలని ఆకాంక్షించారు. అనంతరం విశ్వవిద్యాలయ జనరల్ కౌన్సిల్ సమావేశంలో ఆమె పాల్గొన్నారు. సీజే జస్టిస్ లీసా గిల్‌ను యూనివర్సిటీ వీసీ ఆచార్య సూర్యప్రకాశరావు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జయసూర్య, మాజీ న్యాయమూర్తి జస్టిస్ సోమయాజులు, భోపాల్ నేషనల్ అకాడమీ మాజీ డైరెక్టర్ మోహన్ గోపాల్, యూనివర్సిటీ ఇన్చార్జి రిజిస్ట్రార్ విశ్వచంద్రనాథ్ మదాసు, అకడమిక్ డైరెక్టర్ సోమా భట్టాచార్య, అధ్యాపకులు పాల్గొన్నారు. -
ఆంధ్ర యూనివర్సిటీ లా విద్యార్థుల మధ్య గంజాయి చిచ్చు
-
వీడియో వైరల్: ఏయూ లా విద్యార్థుల మధ్య గంజాయి చిచ్చు
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రా యూనివర్శిటీ లా విద్యార్థుల మధ్య గంజాయి చిచ్చు రేగింది. ఒక వర్గం విద్యార్థులపై మరో వర్గం విద్యార్థులు దాడి చేశారు. ఒక వర్గం విద్యార్థులు గంజాయి తయారు చేస్తున్న వీడియో వైరల్‌గా మారింది. ఇరువర్గాల విద్యార్థులపై పోలీసులు కేసు నమోదు చేశారు. చదవండి: ఎన్నెన్నో అందాలు.. వాటి వెనుక అంతులేని విషాదాలు -
వారధిలా న్యాయ విద్యార్థులు
సాక్షి, అమరావతి: పేదలకు న్యాయం అందించే దిశగా ప్రారంభించిన ‘మిషన్ లీగల్ సర్వీసెస్’ను ఓ ఉద్యమంలా చేపట్టాల్సిన అవసరం ఉందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా పేర్కొన్నారు. పేదలకు సాయం అందించడంలో న్యాయ విద్యార్థులే కీలకమని, మిషన్ లీగల్ సర్వీసెస్‌కు వారు వెన్నెముక లాంటి వారని చెప్పారు. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా జాతీయ న్యాయ సేవాధికార సంస్థ పిలుపు మేరకు చేపట్టిన మిషన్ లీగల్ సర్వీసెస్ కార్యక్రమాన్ని సీజే జస్టిస్ మిశ్రా మంగళవారం ఉదయం ప్రారంభించి మాట్లాడారు. దత్తత గ్రామాల పర్యటనకు ఉద్దేశించిన వాహనాలను ఆయన ప్రారంభించారు. దత్తత గ్రామాల్లో సేవలు... గుంటూరు జిల్లాలోని తాడేపల్లి, తుళ్లూరు, సత్తెనపల్లి, ప్రత్తిపాడు, కృష్ణా జిల్లా పెనమలూరు మండలాల్లో ఎంపిక చేసిన గ్రామాలను న్యాయసేవాధికార సంస్థలు దత్తత తీసుకుని మిషన్ లీగల్ సర్వీసెస్‌ను ప్రారంభిస్తాయని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మిశ్రా తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడం న్యాయ విద్యార్థులపై ఆధారపడి ఉందన్నారు. వారు ప్రజలు, న్యాయవ్యవస్థకు మధ్య వారధిలా పని చేస్తారన్నారు. మిషన్ లీగల్ సర్వీసెస్ ద్వారా గ్రామాల్లో మహిళలు, పిల్లలు, వృద్ధులు, ట్రాన్స్జెండర్లు, రైతుల సమస్యలతో పాటు తాగునీటి ఇబ్బందులను గుర్తించేందుకు కోర్ కమిటీని ఏర్పాటు చేశామని తెలిపారు. ఎంపిక చేసిన న్యాయవాదులు, న్యాయ విద్యార్థులు కమిటీ సభ్యులుగా ఉంటూ గ్రామ, మండల స్థాయిల్లో సమస్యలను పరిష్కరిస్తారని చెప్పారు. న్యాయస్థానాల్లో పిటిషన్లు దాఖలు చేయాల్సి వస్తే సంబం«ధిత వ్యక్తులకు కోర్ కమిటీ ఉచితంగా న్యాయ సాయం అందిస్తుందన్నారు. చట్టాలున్నా... అవగాహన లేక పేదల హక్కుల రక్షణ విషయంలో పలు చట్టాలున్నా అవగాహన లేకపోవడం వల్ల నిరర్థకం అవుతున్నాయని ఏపీ న్యాయసేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ అసనుద్దీన్ అమానుల్లా పేర్కొన్నారు. చట్టాలపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన బాధ్యత న్యాయ విద్యార్థులపై ఉందన్నారు. మిషన్ లీగల్ సర్వీసెస్ సమర్థంగా అమలయ్యేలా 6 కమిటీలు ఏర్పాటు చేశామని హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి తెలిపారు. ఎనిమిది న్యాయ కళాశాలలకు చెందిన ప్రిన్సిపాళ్లు, లెక్చరర్లు, న్యాయ విద్యార్థులు, 41 మంది న్యాయవాదులు ఈ కమిటీల్లో సభ్యులుగా ఉన్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ కార్యదర్శి ఎంవీ రమణకుమారి, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కె.జానకిరామిరెడ్డి, పలువురు న్యాయవాదులు, న్యాయ విద్యార్థులు పాల్గొన్నారు. -
లా విద్యార్థుల రాస్తారోకో
తిరువళ్లూరు: చెన్నైలో ఉన్న లా కళాశాలను కాంచీపు రం తిరువళ్లూరుకు మార్చడాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేసిన లా విద్యార్థులపై లాఠీచార్జ్‌కు నిరసనగా తిరువళ్లూరులోని మెజిస్ట్రేట్ కోర్టు వద్ద శుక్రవారం లా విద్యార్థులు రాస్తారోకో నిర్వహించారు. తిరుపతి-చెన్నై జాతీయ రహదారిపై నిర్వహించిన రాస్తారోకో కార్యక్రమానికి లా విద్యార్థుల కోఆర్డినేటర్ జార్జిముల్లర్ అద్యక్షత వహించారు. రాస్తారోకో కార్యక్రమానికి తమిళనాడు, ఆంధ్ర లా విద్యార్థులు ఉమ్మడి ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహించారు. జార్జిముల్లర్ మాట్లాడుతూ మెట్రోరైలు ప్రాజెక్టు కోసం అంబేద్కర్ లా కళాశాలను తిరువళ్లూరు, కాంచీపురం జిల్లాకు తరలించడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న లా విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడం దారుణమన్నారు. లాఠీచార్జ్ చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవడంతో పాటు అంబేద్కర్ లా కళాశాల మార్పు నిర్ణయూన్ని విరమించుకోవాలని వారు డిమాండ్ చేశారు. రాస్తారోకోతో దాదాపు 40 నిమిషాల పాటు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. అనంతరం కోర్టు నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. తమ డిమాండ్లను పరిష్కరించని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. -
లా విద్యార్థుల రగడ
సాక్షి, చెన్నై : బ్రాడ్ వేలోని అంబేద్కర్ లా కళాశాల పురాతనమైనది. మెట్రో రైలు పనులకు ఈ భవనం ఆటంకం కల్పిస్తోంది. దీంతో అక్కడి లా కళాశాలను మరో చోటకు మార్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు తగ్గ ఏర్పాట్లను న్యాయశాఖ అధికారులు వేగవంతం చేశారు. శ్రీ పెరంబదూరుకు ఈ కళాశాలను తరలించే విధంగా కార్యాచరణను సిద్ధం చేశారన్న సమాచారంతో విద్యార్థుల్లో ఆగ్రహం రేగింది. రెండు మూడు రోజులుగా విద్యార్థులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. కళాశాల తరలింపు ఖాయం చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో బుధవారం విద్యార్థుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. నగరంలో ఉన్న కళాశాలను మరో చోటకు మార్చడంతో ద్వారా శ్రమతో పాటుగా తీవ్ర కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్న ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ విద్యార్థులు మధ్యాహ్నం రోడ్డెక్కారు. ట్రాఫిక్ పద్మవ్యూహం: కళాశాలను తొలగించేందుకు వీలు లేదని, అందుకు తగ్గ పనుల్ని నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తూ వందలాది మంది లా విద్యార్థులు బ్రాడ్వే మార్గంలో బైఠాయించారు. ఈ హఠాత్పరిణామంతో ఆ పరిసరాల్లో ఎక్కడి వాహనాలు అక్కడే ఆగాయి. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి విద్యార్థులను బుజ్జగించేందుకు తీవ్రంగానే ప్రయత్నించారు. ఈ క్రమంలో పలుమార్లు విద్యార్థులు, పోలీసుల మధ్య తోపులాట, వాగ్యుద్ధం చోటు చేసుకుంది. విద్యార్థులు 4 గంటల పాటుగా బైఠాయించడంతో ఉత్తర చెన్నై పరిసరాల్లో పాటుగా, మెరీనా తీరం, మౌంట్ రోడ్డు పరిసరాలు ట్రాఫిక్ పద్మ వ్యూహంలో చిక్కాయి. పలు మారా్గాల్లో వాహనాల్ని టేక్ డైవర్షన్లు తీసుకునే రీతిలో ఏర్పాట్లు చేసినా, చిన్న చిన్న సందుల్లో సైతం వాహనాలు ఆగాయి. ఎక్కడికక్కడ వాహనాలు పలు ప్రాంతాల్లో ఆగడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురి కాక తప్పలేదు. ఓ దశలో విద్యార్థుల్ని బుజ్జగించే ప్రయత్నంలో కొందరు పోలీసు సిబ్బంది దురుసుగా వ్యవహరించారన్న ఆరోపణ బయలు దేరింది. అదే సమయంలో కొందరు విద్యార్థులు పోలీసులపై తిరగబడ్డట్టు, దాడికి దిగినట్టు సమాచారం. దీంతో విద్యార్థులపై లాఠీలు ఝుళిపించి చెదరగొట్టారు. ఈ క్రమంలో ఆ పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కొందరు విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో విద్యార్థుల్లో ఆగ్రహం బయలు దేరింది. ఆ పరిసరాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా గట్టి భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. 4 గంటల ట్రాఫిక్ పద్మవ్యూహాన్ని ఛేదించేందుకు వాహన చోదకులు తంటాలు పడగా, ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు పోలీసులు చెమటోడ్చాల్సి వచ్చింది. లాఠీచార్జ్‌పై ఆగ్రహం: లా విద్యార్థులపై లాఠీ చార్జిని న్యాయవాద సంఘాలు, విద్యార్థి సం ఘాలు ఖండిస్తున్నాయి. కనిపించిన వారిని ఇష్టానుసారంగా పోలీసులు చితగ్గొట్టడాన్ని తీవ్రంగా పరిగణించాయి. అరెస్టు చేసిన క్రమంలో, వ్యాను లో ఎక్కుతున్న విద్యార్థులపై సైతం పోలీసులు లాఠీ ఝుళిపించడాన్ని వ్యతిరేకిస్తూ, విద్యార్థి సంఘాలన్నీ ఏకమవుతున్నాయి.


