సీఎం గొంతుతో మిమిక్రీ.. వెలుగులోకి భారీ ప్రభుత్వ ఉద్యోగాల కుంభకోణం | Debeswar Bora allegedly used a mimic of Himanta Biswa Sarma to impress job seekers | Sakshi
Sakshi News home page

సీఎం గొంతుతో మిమిక్రీ.. వెలుగులోకి భారీ ప్రభుత్వ ఉద్యోగాల కుంభకోణం

Sep 8 2026 9:38 PM | Updated on Sep 8 2026 9:38 PM

 Debeswar Bora allegedly used a mimic of Himanta Biswa Sarma to impress job seekers

గౌహతి: అస్సాంలో ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రభుత్వ కాంట్రాక్టుల పేరుతో సాగుతున్న భారీ మోసం వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించేందుకు ఏకంగా అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ గొంతును పోలిన వ్యక్తితో మిమిక్రీ చేయించి మోసాలకు పాల్పడిన సీనియర్ సివిల్ సర్వీస్ అధికారిని సీఎం ప్రత్యేక విజిలెన్స్ సెల్ అధికారులు అరెస్ట్ చేశారు.

1999 బ్యాచ్‌కు చెందిన అస్సాం సివిల్ సర్వీస్ అధికారి, ధేమాజీ జిల్లా అభివృద్ధి కమిషనర్‌గా పనిచేస్తున్న దేబేశ్వర్ బోరా ఈ కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా గుర్తించారు. ఆయన తన హోదాను దుర్వినియోగం చేస్తూ అక్రమాస్తులు ఆర్జించారనే ఆరోపణలపై విచారణ ప్రారంభంకాగా, ఈ విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. 

ఉద్యోగాలు, కాంట్రాక్టులు ఆశించేవారితో మాట్లాడేటప్పుడు సమయంలో తనకు ప్రభుత్వంలో అత్యున్నత స్థాయి వరకు సంబంధాలు ఉన్నాయని నమ్మించేందుకు నిందితుడు ఒక సరికొత్త ప్లాన్ వాడుకున్నాడు. మిమిక్రీ చేయడంలో నైపుణ్యం ఉన్న ఒక మధ్యవర్తి ద్వారా ఉద్యోగార్థులకు ఫోన్ చేయించేవాడు. ఆ ఫోన్ కాల్స్‌లో అవతలి వ్యక్తి అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (చీఫ్ సెక్రటరీ) రవి కోటాగా గొంతు మార్చి మాట్లాడేవారు. ప్రభుత్వం తరఫున ఆమోదం లభించిందని నమ్మించి అమాయకుల నుంచి భారీగా నగదు వసూలు చేసేవారు.  

అయితే, ధేమాజీకి చెందిన ఓ రాజకీయ నాయకుడుతో నాయకుడు క్యూబ్-బిజినెస్‌మన్‌తో ఈ తరహా డీల్ జరిగిన తర్వాత ఈ మోసం గుట్టు రట్టయింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో భాగంగా విజిలెన్స్ అధికారులు ఆయన నివాసాల్లో సోదాలు నిర్వహించి, ఈ నకిలీ కాల్స్ ధ్వని రికార్డులు,ఇతర ఆధారాలను సేకరించి దేబేశ్వర్ బోరాను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం దీనిపై మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement