‘ధురంధర్‌’లా మోదీ ఎంట్రీ.. ‘ఆరీ ఆరీ’ పాటతో గ్రాండ్‌ వెల్‌కమ్‌ | PM Modi Dhurandhar Entry In Vadodara As Aari Aari Plays | Sakshi
Sakshi News home page

‘ధురంధర్‌’లా మోదీ ఎంట్రీ.. ‘ఆరీ ఆరీ’ పాటతో గ్రాండ్‌ వెల్‌కమ్‌

Sep 8 2026 7:21 PM | Updated on Sep 8 2026 8:38 PM

PM Modi Dhurandhar Entry In Vadodara As Aari Aari Plays

గాంధీనగర్‌: గుజరాత్‌లోని వడోదరలో ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం లభించింది. మంగళవారం ఆయన వడోదరలోని మహారాజా సయాజీరావు విశ్వవిద్యాలయంలో జరిగిన ‘నమో ఫర్‌ వికసిత్‌ భారత్‌’ కార్యక్రమానికి హాజరయ్యారు. మోదీ కార్యక్రమ ప్రాంగణంలోకి అడుగుపెట్టే సమయంలో ‘ధురంధర్‌’ సినిమాలోని ‘ఆరీ ఆరీ’ పాట వినిపించింది. 

అంతకుముందు క్వీన్‌ బృందానికి చెందిన ‘వీ విల్‌ రాక్‌ యూ’ పాటను కూడా వినిపించారు. యువత పెద్ద సంఖ్యలో హాజరైన ఈ కార్యక్రమంలో మోదీ వారిని ఉద్దేశించి చేతులు ఊపుతూ ముందుకు సాగారు. ‘ఆరీ ఆరీ’ (Aari Aari) అనేది రణ్‌వీర్ సింగ్ నటించిన 'ధురంధర్ ది రివెంజ్' సినిమాలోని సూపర్‌హిట్‌ పాట.

 మోదీ రాక సందర్భంగా ప్రత్యేకంగా ‘వై’ ఆకారంలో వేదికను ఏర్పాటు చేశారు. దాని చుట్టూ యువత కూర్చొని ఉండగా, మోదీ ఆ వేదికపై నడుస్తూ వారిని పలకరించారు. వడోదర పర్యటనలో మోదీ రూ.35,000 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయడంతో పాటు పూర్తయిన పలు ప్రాజెక్టులను ప్రారంభించారు. రైల్వే, రహదారులకు సంబంధించిన కీలక ప్రాజెక్టులు ఇందులో ఉన్నాయి.

ఈ సందర్భంగా మోదీ సరుకు రవాణా రైలు సేవలను, టాండా రోడ్‌ నుంచి వడోదరలోని ప్రతాప్‌నగర్‌కు అనుసంధానించే కొత్త ప్రయాణికుల రైలును ప్రారంభించారు. పశ్చిమ ప్రత్యేక సరుకు రవాణా మార్గంలోని 3 కీలక విభాగాలు, రైల్వే, రహదారి మౌలిక వసతులతో పాటు గుజరాత్‌ ప్రభుత్వానికి చెందిన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement