‘స్థానిక’ ఎన్నికలకు మనమంతా సన్నద్ధంగా ఉండాలి: బొత్స | Botsa Satyanarayana Chairs YSRCP District Level Meeting in Kakinada | Sakshi
Sakshi News home page

‘స్థానిక’ ఎన్నికలకు మనమంతా సన్నద్ధంగా ఉండాలి: బొత్స

Sep 8 2026 8:17 PM | Updated on Sep 8 2026 8:38 PM

Botsa Satyanarayana Chairs YSRCP District Level Meeting in Kakinada

కాకినాడ: స్థానిక సంస్థల ఎన్నికలకు మనమంతా సమాయత్తంగా ఉండాలని వైఎస్సార్‌సీపీ శ్రేణులకు, మాజీ మంత్రి, పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ సూచించారు. ప్రతీ స్థానంలోనూ పోటీ చేయాలని, పోరాటం చేసి విజయం సాధించాలన్నారు. కాకినాడ జిల్లా వైఎస్సార్‌సీపీ విస్తృతస్థాయి సమావేశంలో బొత్స మాట్లాడారు. కూటమి పాలనలో జరుగుతున్న ఆకృత్యాలను ఎన్నడూ చూడలేదని, వారి ఆకృత్యాలన్నీ టీవీ, పేపర్‌లు చూస్తూ కనిపిస్తాయన్నారు. 

‘ టెట్ ఎన్ని సార్లు అయిన రాసుకోవచ్చు అని చంద్రబాబు, లోకేష్ ప్రజల చెవ్వుల్లో పువ్వులు పెడుతున్నారు. టెట్ రాయకుండా టీచర్ ఉద్యోగం ఇవ్వొచ్చా లేదా  అనే దాని పై చెప్పడం లేదు. డీఎస్సీ అక్రమాల పై ప్రశ్నించినందుకు మాపై కేసులు పెడితే తేల్చుకుంటాం.  ఆంద్రాలో ప్రజలు తిండిలేకుండా ఉంటే...ఢిల్లీలో బియ్యం కౌంటర్లు ఏర్పాటు చేశారు. 

పురుషోత్తపట్నం నుండి నీళ్లు తోడి పోలవరం కాలువలో వదులుతారా?, గ్రావెటీతో కాకుండా ఎన్నాళ్ళు నీళ్ళు ఇస్తారు. పోలవరం ప్రాజెక్టు నాణ్యత కోసం విదేశి నిపుణులు ఏం చెప్పారో చంద్రబాబు చెప్పాలి. అపర భగీరధుడు అంటే వైఎస్ఆర్. సున్నా వడ్డీ డ్వాక్రా మహిళలకు చంద్రబాబు ఎందుకు తీసేశాడు?, నిరుద్యోగ భృతి ఏది అని నిరుద్యోగులు అడిగితే వాళ్ళపై కేసుల పెడతారు.. అసలు సూపర్‌ సిక్స్‌ అమలు చేయకుండానే సూపర్‌హిట్‌ అని చెప్పుకోవడం సిగ్గుచేటు’ అని ధ్వజమెత్తారు. 

‘టెట్‌ లేకుండా ఉద్యోగాలు ఎలా ఇస్తారు?’

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement